రాము--1968
సంగీతం::R.గోవర్ధన్
రచన::దాశరధి
గానం::P.సుశీల
పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...
పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...
చల్లని పలుకుల తల్లీ..
చక్కని నవ్వుల తండ్రీ..
కమ్మని నోముల పంటా..నేనే సుమా..2
ఇద్దరి బుగ్గలమీదా..ముద్దుల మూటలు పడితే
ఇంపుగ నిదుర పోవాలి..జోజోజో...2
పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...
చిట్టీ చిలక పలకా..
చిలకా తల్లి కులకా
చిలకరాజు చెట్ల చాటున వెతకాలీ..2
చల్లగ మురిసె వేళా..చాటుగ మసలే వేళా
ఎల్లరు కళ కళ లాడాలి జోజోజో..2
పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...
No comments:
Post a Comment