సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం
ఈ భగ్నహృదయం ఈ అగ్నిగుండం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం..
ప్రేమభిక్ష నువ్వే పెట్టి ఈ పేదహృదయం పగులగొట్టి
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివ్వనిది దాచలేను ఇంకెవ్వడినీ అడుగలేను
బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలైపోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ కాలిపోయి బూడిదే మిగలనీ
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
మమత నింపమన్నాను మనసు చంపుకున్నావు
మధువు తాగనన్నాను విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు
నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను మరణిస్తాను
No comments:
Post a Comment