సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల
ఆ నవ్వుకు ఒక ఆమనీ అహహా..
ఆ చూపుకు ఒకటే ఛలి అహహా..
ఆ కౌగిట ఒక వేసవి అహహా..
ఆ చక్కిట చిరు జాబిలి అహహా..
ఏమి లయలు ఎంత హొయలు ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులుపడెనాలో
మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులుపడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ అహహా..
ఆ చూపుకు ఒకటే ఛలి అహహా..
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
నీ కొంటెచూపు మనసంత వెలుగు వేదాలు పాడగా
అల్లారుపొద్దు అల్లారుముద్దు నీకే జవాబులిస్తాగా
బదులైనా బతుకైనా..ముద్దుకు ముద్దే చెల్లంటా
వయసుకు వయసే వళ్ళంటా..కన్ను తుదల ఎన్ని ఎదల
తీపి సుధలు నీలో..మెత్తని ముద్దులుగా..అవి హద్దులు పడెనాలో
వెచ్చని ముద్దులుగా..అవి అచ్చులు పడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ అహహా..
ఆ చూపుకు ఒకటే ఛలి అహహా..
ఆ కౌగిట ఒక వేసవి అహహా..
ఆ చక్కిట చిరు జాబిలి అహహా..
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
వీచే పెదాల చిలిపీ సిరాల చిరుసంతకాలతో
నా జీవితాలు చెలికాగితాలు..నీ కంకితాలు చేస్తాగా
కలలైనా నిజమైనా కౌగిలి పెట్టిన ఇల్లంటా
ఇద్దరి పేరే ప్రేమంటా..ఎన్నిజతలు..ప్రేమ జతలు
పూలరుతులు నీలో..
తుంటరి తుమ్మెదనై..అవి తొందరపడెనాలో
తుంటరి తుమ్మెదనై..అవి తొందరపడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ అహహా..
ఆ చూపుకు ఒకటే ఛలి అహహా..
ఆ కౌగిట ఒక వేసవి అహహా..
ఆ చక్కిట చిరు జాబిలి అహహా..
ఏమి లయలు ఎంత హొయలు ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా అవి సిగ్గులుపడెనాలో
వెచ్చని ముద్దులుగా అవి అచ్చులు పడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ అహహా..
ఆ చూపుకు ఒకటే ఛలి అహహా..
లాలలలాలలలా లలలాలలలాలలలా
No comments:
Post a Comment