Friday, November 07, 2008

బంగారు బాబు--1973::కల్యాణి::రాగం



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
దర్శకత్వంV.B.రాజేంద్ర ప్రసాద్
నిర్మాణంV.B.రాజేంద్ర ప్రసాద్

Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.
Kalyani ::raagam

:::::::

కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు

కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు

::::1


నా మాటకు పలికే దేవుడూ..నా మనసుకు తెలిసిన చంద్రుడూ
నా మాటకు పలికే దేవుడూ..నా మనసుకు తెలిసిన చంద్రుడూ
అలిగాడమ్మా ఈనాడూ..అలిగాడమ్మా ఈనాడూ..
నా బ్రతుకే చీకటి చేసాడూ..నా బ్రతుకే చీకటి చేసాడూ

కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు

::::2


నా ఆశలు తీర్చే తండ్రే తానూ..తన ఆకలి ఎరిగిన తల్లిని నేనూ
నా ఆశలు తీర్చే తండ్రే తానూ..తన ఆకలి ఎరిగిన తల్లిని నేనూ
నా కనుపాపడు పలకని నాడు..నా కనుపాపడు పలకని నాడు
కన్నులొచ్చినా కబోదినే..నేనూ..కన్నులొచ్చినా కబోదినే

అమ్మా..చెల్లెమ్మా..అన్నయ్యా..

కన్నమ్మలాంటి చెల్లెమ్మ ఉంటే..అన్నమెందుకూ
నా చెల్లెమ్మ చల్లగ నవ్వుతు ఉంటే వెన్నెలెందుకూ

కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు

కన్నమ్మలాంటి చెల్లెమ్మ ఉంటే..అన్నమెందుకూ
నా చెల్లెమ్మ చల్లగ నవ్వుతు ఉంటే వెన్నెలెందుకూ

No comments: