సంగీతం::K.Vమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తలకి నీల్లోసుకొని
కురులారబోసుకొని
నిలుసుంటే నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది
తలకి నీల్లోసుకొని
తడియార బెట్టుకొని నిలుసుంటే
నివు నిలుసుంటే నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్న నిన్నొదలి రానంటది
పొద్దుపోని సూరీడూ
పోంచి పోంచి సూసుంటే
పొద్దుపోని సూరీడూ
ముద్దుమొగం మీద నీటి
ముత్తాలు మెరుస్తుంటే
సుగసులకే బానిసను పిల్లోయ్
నీ సొగసులకే బానిసను పిల్లోయ్
తడిసి తడిసి నీళ్ళల్లో
నీ బిరుసెక్కిన కండరాలు
తడిసి తడిసి నీళ్ళల్లో
నీ బిరుసెక్కిన కండరాలు
నీరెండ ఎలుగులో
నిగా నిగా మంటుంటే
మగసిరికి బానిసను మావా
నీ మగసిరికి బానిసను మావా
తలకి నీల్లోసుకొని
కురులారబోసుకొని
నిలుసుంటే
నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది
ఆరీ ఆరని కోకా
అరగొరగ సుత్తుకొంటే
ఆరీ ఆరని కోకా
అరగొరగ సుత్తుకొంటే
దాగీ దాగని అందం
దా దా అంటుంటే
దాహమేస్తున్నది పిల్లోయ్
సెడ్డ దాహమేస్తున్నాది పిల్లోయ్
సూస్తున్న నీ కళ్ళూ
సురకత్తులవుతుంటే
సూస్తున్న నీ కళ్ళూ
సురకత్తులవుతుంటే
ఓపలేక నావొళ్ళు
వంకరలు పోతుంటే
ఏడుపొస్తున్నాది మావా
సెడ్డ ఏడుపొస్తున్నాది మావా
తలకి నీల్లోసుకొని
తడియార బెట్టుకొని నిలుసుంటే
నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది సల్లగాలి ఆ పక్క సలి సలిగ సోకుతుంటే
పిల్లగాలి ఈ పక్క ఎచ్చెచ్చగ ఏపుతుంటే
నడిమద్దే నలిగాను పిల్లోయ్
ఈ పక్క ఆ పక్క యిరకాటం నీకుంటే
నా కెదటేమో కుర్రతనం ఎనకేమో కన్నెతనం
ఎటు తోస్తే ఏమౌనో మావో..
హోయ్..హోయ్..హోయ్..హాయ్
తలకి నీల్లోసుకొని
కురులారబోసుకొని
నిలుసుంటే నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది
No comments:
Post a Comment