సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SP.బాలు,P.సుశీల
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా
నీకై జపించి జపించి తపించు తపించు భక్తునిపైనా..
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా
మౌన భంఘమూ మౌన భంఘము
భరియించదు ఈ దేవి హౄదయము
ప్రేమ పాఠము ప్రేమ పాఠము
వినకూడదు ఇది పూజా సమయము
దేవి హౄదయము విశాలమూ
భక్తుని కది కైలాసమూ
హే..దేవి హౄదయము విశాలమూ
భక్తునికది కైలాసమూ..
కోరిక కోరుట భక్తుని వంతు..
అడగక తీర్చుట దేవత వంతు
ధూపం వేయుట భక్తుని వంతు
పాపం మోయుట దేవుని వంతు
పాపానికి మోక్షం ధూప దర్శనం
ఈ పాణికి మోక్షం నామస్మరణం..నీ..నామస్మరణం
దేవీ...దేవీ...దేవీ...దేవీ...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
నీకై జపించి జపించి తపించు తపించు భక్తునిపైనా..హా...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
స్వామి విరహము అహోరాత్రము
చూడలేదు ఈ దేవి హౄదయము
దేవీ స్తోత్రము నిత్యకౄత్యము
సాగనివ్వదు మౌన వ్రతము...
స్వామి హౄదయము ఆకాశమూ..
దేవికి మాత్రమే అవకాశమూ..
అ..హా..హ..హా..
స్వామి హౄదయము ఆకాశమూ..
దేవికి మాత్రమే అవకాశమూ..
అర్చన చేయుట దాసుని వంతు
అనుగ్రహించుట దేవత వంతు..
కోపం తాపం మా జన్మహక్కు
పుష్పం పత్రం అర్పించి మొక్కు
నా హౄదయం..ఒక పూజా పుష్పం
నా అనురాగం ఒక ప్రేమ పత్రం..
నా...ప్రేమ పత్రం...
దేవీ...దేవీ...దేవీ...దేవీ...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
నీకై జపించి జపించి తపించు తపించు భక్తునిపైనా..హా...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా...
No comments:
Post a Comment