Monday, March 24, 2008

పాతాళబైరవి--1951::సింధుభైరవి::రాగం





సంగీతం::ఘంటసాల
సాహిత్యం::పింగళి
దర్శకత్వం::K.V.రెడ్డి
గానం::ఘంటసాల

సింధుభైరవి::రాగం 

ఈ పాట ఇక్కడ వినండి

పల్లవి::

కనుగొనగలనో లేనో...
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ
కనుగొనగలనో లేనో...

చరణం::1

పెండ్లిపీటపై ప్రియనెడబాయ
గాలిమేడలూ గారడికాగా (2)
కలకాలమును కర్మను దూరుచు
కలగా బ్రతకడమేనో
కనుగొనగలనో లేనో...

చరణం::2

వెదకివెదకి ఏ జాడ తెలియక
హృదయమంతా చీకటిగా (2)
ఎంత పిలచినా పిలుపే అందక
చింతిలి తిరగడమేనో
కనుగొనగలనో లేనో...

చరణం::3

పులివాతను బడు బాలహరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా (2)
జాలిలేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో

Sunday, March 23, 2008

పాతాళబైరవి--1951::ఆభేరి::రాగం



ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::ఘంటసాల
సాహిత్యం::పింగళి
గానం::P.లీల,ఘంటసాల


ఆభేరి:::రాగం

పల్లవి::


కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయ మదిలో నా మదిలో

చరణం::1


కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

చరణం::2


నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో

Saturday, March 22, 2008

పాతాళబైరవి--1951




ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::ఘంటసాల
సాహిత్యం::పింగళి
గానం::రేలంగి


పల్లవి:

వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
నీకేనువ్వేల నిలువగజాల
వినవే బాల నా ప్రేమగోల

చరణం::1

గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
వినవే బాల నా ప్రేమగోల

చరణం::2

చిరునవ్వుచాలే చిత్తైపోతానులే
చిరునవ్వుచాలే చిత్తైపోతానులే
మురిపించేస్తాలే మూర్చైపోతాలే
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల

చరణం::3

జూడుగుడి తోడిరాగమ పాడుకుంటు
జూడుగుడి తోడిరాగమ పాడుకుంటు
మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్
వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా

చరణం::4

చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
చెట్టాపట్టిల్ జడకోలాటం
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో

పాతాళబైరవి--1951






ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::ఘంటసాల
సాహిత్యం::పింగళి
గానం::P.లీల


పల్లవి::

తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం::1

చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
వని అంతా పరిమళించెనే మనసంతా పరవశించెనే
వని అంతా పరిమళించెనే మనసంతా పరవశించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం::2

గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం::3

ఓ ఓ ఓ ఓ కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
వని అంతా రవళించేనే తనువెంతో మురిపీంచేనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్