Monday, February 11, 2008

జీవన తరంగాలు--1973






















సంగీతం::J.V.రాఘవులురచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు

నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
ఊహూ...
నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
నీ చేతులానాడు చెరలాయెను
నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను

ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు !!

నీ వేడి లోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
నీ వేడి లోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో
ఇంధ్ర ధనస్సే విరిసింది
ఏడు రంగుల ముగ్గును వేసి
నింగీ నేలను కలిపింది
ప్రేమకు పెళ్ళే చేసింది

ఈ అందానికి బంధం వేసానొకనాడు
ఆ బంధమె నాకందమైనది ఈ నాడు
ఆహాహా ఆహాహా!
!!

No comments: