Sunday, August 05, 2007

శ్రీ కాళహస్తి మహాత్యం--1954



సంగీతం::సుదర్శనం,గోవర్ధనం
రచన::తోలేటి వెంకటరెడ్డి
గానం::ఘంటసాల

Film Director::H.L.N.Simha, 
తారాగణం::రాజ్‌కుమార్(కన్నడ నటుడు),కె.మాలతి,కుమారి,లింగమూర్తి,పద్మనాభం,
రాజసులోచన,ఋష్యేంద్రమణి

రాగములు::అభేరి..హిందోళం..

పల్లవి::

జయ జయ మహాదేవ శంభో హరా శంకరా
సత్య శివ సుందరా నిత్య గంగాధరా

బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్
నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడం దయాసాగరా

భీకరారణ్య మధ్యంబునం బోయనై పుట్టి
పశు పక్షి సంతానముల్ కూల్చి
భక్షించు పాపాత్ముడం

దివ్య జపహోమ తపమంత్ర కృషిలేని జ్ఞానాంధుడం
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడం
దుష్టాత్ముడం
విశ్వరూపా మహామేరుచాపా
జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యత్ కలాపా
మహిం పంచ భూతాత్మ వీవే కదా
దేవ దేవా శివా..
పృథ్వి జలవాయు రాకాశ తేజో విలాసా మహేశా ప్రభో..

రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు
కాశీ పురాధీశవిశ్వేశ్వరా
కాశీ పురాధీశవిశ్వేశ్వరా

నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు
శ్రీశైల మల్లేశ్వరా..శ్రీశైల మల్లేశ్వరా

కోటి నదులందు సుస్నానముల్ చేయు
ఫలమిచ్చు క్షేత్రాన నివసించు
శ్రీరామలింగేశ్వరా..శ్రీరామలింగేశ్వరా

నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు
దాక్షారమావాసభీమేశ్వరా..భీమేశ్వరా..భీమేశ్వరా

దివ్య ఫలపుష్ప సందోహ బృందార్చితానంద
భూలోక కైలాస..శైలాన వసియించు
శ్రీకాళహస్తీశ్వరా..శ్రీకాళహస్తీశ్వరా..
దేవ దేవా..ఆ..నమస్తే నమస్తే నమస్తే నమః

No comments: