Thursday, June 07, 2007

పెళ్ళి చేసి చూడు--1952::కల్యాణి::రాగం



రచన::పింగళిగానం::ఘంటసాల
సంగీతం::ఘంటసాల

కల్యాణి::రాగంలో చక్కటి పాట !!

ఓ... భావి భారత భాగ్య విధాతలార

యువతీ యువకులార..ఆ..ఆ..
స్వానుభవమున చాటు నా సందేశమిదే వరెవహ్
పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా

ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ "పరంపం"ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్

!! పెళ్ళి చేసుకొని !!
నవ భావముల నవ రాగముల ఆ..ఆ..నవ జీవనమె నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్

!! పెళ్ళి చేసుకొని !!

No comments: