Wednesday, June 06, 2007

మల్లేశ్వరి--1951:::రాగమాలిక



చక్కటి రాగాలతో మనసును రాగమాలిక చేసిన ఈ పాటను
స్వర్గీయ భానుమతి గారి తో చేరి మన ఘంటసాల గారు
ఆలపించిన మధురమైన ఈ రాగమాలికను ,
సాలూరి రాజేశ్వర రావ్ గారు స్వరపరచగా ,
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారి రచనలో
ఈ పంచవన్నెల రాగాలను మీరూ విని ఆనందించండి :)

రాగం : ఆభేరి .

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగిచూసేవు...
ఏడ తానున్నాడో బావా..
జాడ తెలిసిన పోయిరావా ....
అందాల ఓ మేఘమాల ఆ..
చందాల ఓ మెఘమాల

రాగం : భీంపలాశ్రీ .

గగన సీమల తేలు ఓ మేఘమాల
మావూరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతోమనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాల ఓ మేఘమాలా

రాగం : కళంగడ . హిందుస్తానీ కర్నాటక రాగం .

మమతలెరిగిన మేఘమాలానా
మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్లు నాకళ్లు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచేనే
బావకై చెదరి కాయలు కాచెనే...
నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా

రాగం : కీరవాణి .

మనసు తెలిసిన మేఘమాలా
మరువలేనని చెప్పలేవామల్లితో
మరువలేనని చెప్పలేవా
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లిరూపె నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచేనే

రాగం : హంసానంది .

జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుకజాల...
కురియు నా కన్నీరు
గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల

No comments: