Tuesday, September 04, 2007

గండికోట రహస్యం--1969



సంగీతం::TV.రాజు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా
నిరుపేద కలువ వేచెనని మరచి పోదువా..
అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా
నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా..

నీ కోసము కుసుమించెను శతకోటితారలూ
నీకోసము కురిపించును పన్నీటిధారలూ
ఆ తళుకులలో పరవసించి కరిగిపోదువా..
అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా

అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎదనిండ ప్రణయ పరిమళాలు పొదుపుకొంటిని
ఎన్నెన్ని జన్మలైనగాని నిన్ను మరుతునా..
నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా
నిరుపేద కలువ వేచెనని మరచి పోదువా..
ఆ..హా..హా..ఆ..హా..మ్మ్..మ్మ్...

No comments: