Monday, August 13, 2007

రాజకోట రహస్యం--1971





సంగీతం::విజయ క్రిష్ణ మూర్తి
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల



నెలవంక తొంగిచూసింది
చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ
తనువెల్ల పొంగిపూచింది

నెలవంక తొంగిచూసింది
చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక
నిలువెల్ల వెల్లివిరిసింది
నెలవంక తొంగిచూసింది


జన్మలోని వరమో
ఈ జన్మలోన దొరిక
ఏ జన్మలోని వరమో
ఈ జన్మలోన దొరికే
ఏ పూల నోము ఫలమో
నీ రూపమందు నిలిచె
సుడిగాలులయిన జడివానలయిన
విడిపోని బంధమే వెలసే
నెలవంక తొంగిచూసింది
చలిగాలి మేను సోకింది


ఆనాటి వలపు పాట
ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట
ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత
ఈనాటి కౌగిలింత
ఏనాటికయిన ఏచొటనయిన
విడిపోనిదోయి మన జంట
నెలవంక తొంగిచూసింది
చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక
నిలువెల్ల వెల్లివిరిసింది
నెలవంక తొంగిచూసింది
చలిగాలి మేను సోకిం
ది

No comments: