సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,బృందం
పల్లవి::
ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
చరణం::1
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
చరణం::2
ఒప్పులకుప్ప....వయ్యారి భామా
సన్నబియ్యం....చాయపప్పు
చిన్నమువ్వ......సన్నగాజు
కొబ్బరికోరు.........బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్.....నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు...........నీ మొగుడెవడు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ...
ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
No comments:
Post a Comment