Monday, October 17, 2022

సంసారబంధం..1980

 


సంగీతం::J.V.రాఘవులు 

రచన::మైలవరపు గోపి

గానం::S.P.బాలు,P.సుశీల.

తారాగణం::శ్రీధర్,ప్రభ,నూతనప్రసాద్,జయసుధ,నారాయణరావు.


పల్లవి::


వేణు గానాలు నీరాకలోనా..వేయి వెన్నెల్లు కలిచూపులోనా 

 

వేణు గానాలు నీరాకలోనా..వేయి వెన్నెల్లు ప్రతిచూపులోనా 


వేణు గానాలు నీరాకలోనా..ఆ..


చరణం::1


నీలాల నీ కళ్ళలోనా..నను నూరేళ్ళు కొలువుండిపోనీ..

ఆ..కడదాక నీ నీడలోనా..నను గువ్వల్లే ఒదిగుండిపోనీ 

హో.. ఊహ నీవై..ఊసు నేనై..గుండె నీవై గొంతు నేనై..చేరి బాసలాడనీ..  


వేణు గానాలు నీరాకలోనా..వేయి వెన్నెల్లు ప్రతిచూపులోనా 


వేణు గానాలు నీరాకలోనా..ఆ..


చరణం::2


నీ కులుకు తళుకు నన్ను కవ్విస్తున్నాయ్..అబ్భా..పొందలేక బ్రతుకెండుకు అనిపిస్తున్నాయ్..చినదానా..ఆ..నాకు నచ్చిన దానా..

చినదానా నాకు నచ్చిన దానా..చినదానా..ఆ..


చరణం::3


నీటతడిసి ఒళ్ళు సగం కనిపిస్తుంటే..

చీరకట్టినా నీ వంటికి లేనట్లుంటే.. 


నీటతడిసి ఒళ్ళు సగం కనిపిస్తుంటే..

చీరకట్టినా నీ వంటికి లేనట్లుంటే..


మనసుపడే నా మనసు ఏమైపోనూ..నువ్ కాదనకే నీ సొగసు నాదైపోనూ..చినదానా నాకు నచ్చిన దానా..చిన్నదానా నాకు నచ్చిన దానా..

నీ కులుకు తళుకు నన్ను కవ్విస్తున్నాయ్.. 

అబ్భా..పొందలేక బ్రతుకెందుకు అనిపిస్తున్నాయ్.. 


చినదానా నాకు నచ్చిన దానా..చిన్నదానా నాకు నచ్చిన దానా..  


Samsaarabandham..1980

sangeetam::`J.V.`raaghavulu 

rachana::mailavarapu gOpi

gaanam::`S.P.`baalu,`P`.suSeela.

taaraagaNam::Sreedhar,prabha.


:::::::::::::::::::::::::::::


vENu gaanaalu neeraakalOnaa..vEyi vennellu kalichoopulOnaa 

 

vENu gaanaalu neeraakalOnaa..vEyi vennellu pratichoopulOnaa 


vENu gaanaalu neeraakalOnaa..aa..


::;:::1


neelaala nee kaLLalOnaa..nanu noorELLu koluvunDipOnii..

aa..kaDadaaka nee neeDalOnaa..nanu guvvallE odigunDipOnii 

hO.. uuha neevai..Usu nEnai..gunDe neevai gontu nEnai..chEri baasalaaDanee..  


vENu gaanaalu neeraakalOnaa..vEyi vennellu pratichoopulOnaa 


vENu gaanaalu neeraakalOnaa..aa..


:::::2


nee kuluku taLuku nannu kavvistunnaay..abbhaa..pondalEka bratukenDuku anipistunnaay..chinadaanaa..aa..naaku nachchina daanaa..

chinadaanaa naaku nachchina daanaa..chinadaanaa..aa..


:::::3


neeTataDisi oLLu sagam kanipistunTE..

chiirakaTTinaa nee vanTiki lEnaTlunTE.. 


neeTataDisi oLLu sagam kanipistunTE..

chiirakaTTinaa nee vanTiki lEnaTlunTE..


manasupaDE naa manasu EmaipOnuu..nuv kaadanakE nee sogasu naadaipOnuu..chinadaanaa naaku nachchina daanaa..chinnadaanaa naaku nachchina daanaa..

nee kuluku taLuku nannu kavvistunnaay.. 

abbhaa..pondalEka bratukenduku anipistunnaay.. 


chinadaanaa naaku nachchina daanaa..chinnadaanaa naaku nachchina daanaa..  

మునసబుగారి అల్లుడు..1985



సంగీతం::B,గోపాలం 

రచన::దేవులపల్లి క్రిష్ణశాస్ర్తి

గానం::S.P.బాలు,P.సుశీల.

తారాగణం::గిరిబాబు,శ్రీగీత


పల్లవి::


శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..


చరణం::1


ఎన్నో కొండలు దాటాలా..అన్నిలోయలూ నడవాలా

కన్నతండ్రివే కాచేదొరవే..కన్నతండ్రివే కాచేదొరవే

కనకరించి మాపై దిగిరావే..


శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా.. 


చరణం::2


ఒక కనుచూపే చాలులే..ఒక చిరునవ్వే చాలులే

కథనము మరచి సన్నిధి నిలిచి

చరణముల కడ పడిపోవగ 


శ్రీగిరి మందిర సుందర సుందర


చరణం::3


మనసును వీడని మమతలు..మాలో వాడని మల్లియలూ 

ఈ సంసారమూ నీదే వరమూ..ఆఆఆఆ

ఈ సంసారం నీదే వరమూ 

కలకాలం ఇలా నిలుపుము తండ్రి..


శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రీగిరి మందిర సుందర సుందర 

శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..... 


Munasabugaari alluDu..1985
Music::B.Gopaalam 
Lyrics::Devulapalli krishNaSaasrti
Singer's::`S.P.`baalu,`P`.suSeela.
Cast::giribaabu,Sreegeeta

::::::::::::::::::::::::::::::::::::::::

Sreegiri mandira sundara sundara
Sreegiri mandira sundara sundara
Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..

::::::1

ennO konDalu daaTaalaa..annilOyaluu naDavaalaa
kannatanDrivE kaachEdoravE..kannatanDrivE kaachEdoravE
kanakarinchi maapai digiraavE..

Sreegiri mandira sundara sundara
Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa.. 

:::::2

oka kanuchoopE chaalulE..oka chirunavvE chaalulE
kathanamu marachi sannidhi nilichi
charaNamula kaDa paDipOvaga 

Sreegiri mandira sundara sundara

:::::3

manasunu veeDani mamatalu..maalO vaaDani malliyaloo 
ii samsaaramoo needE varamoo..aaaaaaaaaaaa
ii samsaaram needE varamuu 
kalakaalam ilaa nilupumu tanDri..

Sreegiri mandira sundara sundara
Sreegiri mandira sundara sundara 
Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..... 

Friday, July 22, 2022

సీతాకల్యాణం--1976



సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B.శ్రీనివాస్,S.P.బాలు,

B.వసంత,బ్రుందం.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


జానకి రాముల కలిపే విల్లు..జనకుని ఇంటనె ఉన్నది

ఈ యింటికి ఆ వింటికి..ఘనమగు కథ యొకటున్నది..ఈ


తారకాసురుని తనయులు..ముగ్గురు దారుణ బలయుతులు..ఊఉ 

విపరీతమ్మగు వరములు పొంది..కట్టిరి త్రిపురములు


ఆ కోటల చుట్టూ పెట్టిరి..ఎన్నో రక్కసి రక్షణలు..ఊ

ఎదురు లేదని చెలరేగిరి..ఆ త్రిలోక కంటకులు..

దారుణ హింసలు తాళజాలక..తల్లడిల్లి సురలు

హిమాలయమ్మున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు


సర్వదేవమయ సర్వమహేశ్వర..శరణు శరణు శరణు

శత్రుభయంకర పాపలయంకర..శరణు శరణు శరణు

పాహిమాం..పాహిమాం..పాహిమాం..

గర్వాంధులు ఆ త్రిపురాసురుల..కడతేర్ప నిదే అదను

పాహిమాం..పాహిమాం..పాహిమాం..పాహిమా..


పాహిమాం..పాహిమాం..పాహిమాం..పాహిమాం..

మేరు పర్వతము వింటిబద్దగా..ఆ

ఆదిశేషుడే వింటి నారిగా..నలువరాణియే వింటి గంటగా

నారాయణుడే వింటి శరముగా..అమరెను శివునికి విల్లు

అసురుల ఆయువు చెల్లు..అమరెను శివునికి విల్లు

అసురుల ఆయువు చెల్లు..


చండ ప్రచండ అఖండ బలుండగు

గండరగండడు శివుడు..కొండరథముపై కొండవింటితో

దండిమగల చెండాడె..దండిమగల చెండాడె..ఏఏ


సీతాకల్యాణం--1976

 




సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,రమోల, 

B.వసంత.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


సీతమ్మకు సింగారం చేతాము రారమ్మా

సీతమ్మకు సింగారం చేతాము రారమ్మా 

సిరితల్లి ముచ్చటలు చూతాము రారమ్మ 

రారమ్మా..ఆ..రారమ్మా..ఆ

రారమ్మా..ఆ..రారమ్మా..ఆ 


చరణం::1


దువ్వకముందే దువ్వినరీతి తోచె నల్లని కురులు 

అందు తురుముటకోసం నోములు నోచును 

తోటలోని విరులు

నీలవర్ణుడు నిండిన కనులకు..కాటుక ఏలమ్మా

నీలవర్ణుడు నిండిన కనులకు..కాటుక ఏలమ్మా

ఫాలభాగమున దిద్దిన తిలకము..బాలభానుడే అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా


చరణం::2


ఒక్కా ఓ చెలియా రెండూ రేవన్నా

మూడు ముచ్చిలుక నాలుగు నందన్నా..ఆ

ఐదుం చిట్టిగొలుసు ఆరుం జవ్వాది

ఏడుం వేడుకలు ఎనిమిది ఎలమంద

తొమ్మిది తోకుచ్చు..పదీ పట్టెడ..చెంగనాలో చెంగనాలు..చెంగనాలో..చెంగనాలు..హా హా హా


చరణం::3


ఆటలలోన హరినే తలచి మనలోకంలో వుండదు

పంటలవేళ పరాకువల్ల పడతి జానకి పండదు

చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మా మూసేదీ

చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మా మూసేదీ

సైయ్యా..ఆ.. సై.. దాగిన వారిని వెదకదు సీతా ఎల్లాగమ్మా ఆడేదీ


అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

చరణం::4

బంతుల ఆటకు ఇంతీరావే..ఏఏ..ఇదిగో బంతి పూలబంతీ

ఇదిగో సన్నజాజి బంతీ..ఈ.. ఇదిగో మల్లెపూల బంతీ..ఈఈ..ఇదిగో కలువపూల బంటీ..హా హా హా 

చెలికత్తెలు విరబంతులు రువ్వ..ఆఅ..చిరునవ్వులు రువ్వును సీతమ్మా..ఆ

ఆదిలక్ష్మికి పూవుల పూజలు అలవాటే కద ఔనమ్మా..

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా 

Tuesday, July 19, 2022

సీతాకల్యాణం--1976

 




సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

వసంత,రామకృష్ణ,S.P.బాలసుబ్రమణ్యం 

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


పరమ పావనమైన శ్రీ పాదము

పాషాణమున కొసగి స్త్రీ రూపము

పతితపావనమైన యీ పాదము

సతిపతుల కలిపినది కలకాలము

జగమేల గల మేటి మగరాయడు

హరుని విల్లును వంచు సిరకన్నె వరియించు

హరిలాగ వున్నాడు ఎవరీతడూ ఎవరీతడూ,ఎవరీతడూ.


ఈ పాదమందే పుట్టినది

ఎల్లపాపాలు హరియించు గంగానది

ఈ పాదమిప్పుడు మెట్టినది

కడు ఇంపైన సొంపైన మిథిలాపురి

ఆజానుబాహువులు రాజీవనేత్రాలు

అందాల అరుణాబ్జ చరణాలు

ఎగు భుజమ్ములవాడు నగుమోము కలవాడు

జగమేలగల మేటి మగరాయడు

హరుని విల్లును వంచు సిరకన్నె వరియించు

హరిలాగ వున్నాడు ఎవరీతడు


చరణం::1 


రాముని సొగసులు పువ్వులు అయితే

పౌరుల చూపులు తుమ్మెదలు..వాలిన చోటున వీడగలేవు

మధుర మధురమా సుధలూ..పదములు అందం చూసే చూపు

పదముల నుండి కదలవులే..పెదవుల నవ్వు చూసే చూపు

పెదవుల వదలీ కదలదులే

రాముని అందం మకరందం 

రసమయమైనది ప్రతిబింభం

రాముని అందం మకరందం

రసమయమైనది ప్రతిబింభం 

రాముని చరణం అరవిందం 

కొలచిన చాలును ఆనందం


సీతాకల్యాణం--1976

 




సంగీతం::KV..మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


సీతమ్మ విహరించు పూదోటకు 

మధుమాస మెపుడో వచ్చింది

కాని మరలా వచ్చింది..సరికొత్త ఆమని

రామయ్య అటు అడుగు పెట్టాడని


గోరింక పిలిచింది రాచిలుకని

కోరి చూపించింది రామయ్యని

చిలకమ్మ పిలిచింది సీతమ్మని

చేయెత్తి చూపింది రామయ్యని

బిడియపడి చూసింది సీతమ్మ


కడగంట చూశాడు రామయ్య

ఆ రెండుచూపులూ ఒకసారి కలిసె

అతిలోక ప్రణయాలు అందులో వెలసె


విరితోట గడిచాడు రామయ్య

విడలేక నడిచింది సీతమ్మ

ఎవరేని రామయ్య పేరెత్తినా

సీతమ్మ నిలువెల్ల పులకింతలే


సీతాకల్యాణం--1976




సంగీతం::కే.వి.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

వసంత,రామకృష్ణ.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::

కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ

కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ


ఆకసమంత పందిరివేసి

భూదవంతాఅరుగును అలికి. .ఆఆ 

ఆకసమంత పందిరివేసి

భూదవంతాఅరుగును అలికి

ఆణిముత్యముల ముగ్గులు పెట్టి

ఆణిముత్యముల ముగ్గులు పెట్టి

అంగరంగ వైభోగ భరితమౌ 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::1 


పగడపు రోకలి బంగరు కట్లు

పసుపును దంచే పడతుల జట్లు

పగడపు రోకలి బంగరు కట్లు

పసుపును దంచే పడతుల జట్లు


పరిపరి విధముల కొట్నముదంచి

సువ్వి సువ్వి అని సుదతులు పాడే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::2


సంపెంగె నూనెల శిరసును అంటి

హరి చందనమే మేనున అలది

సంపెంగె నూనెల శిరసును అంటి

హరి చందనమే మేనున అలది

మణిపీఠముపై నలుగులుపెట్టి

మణిపీఠముపై నలుగులుపెట్టి

మంగళస్నానము చేసే రాముని 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::3


తీరుగ కస్తూరి తిలకము తీర్చి

తీరుగ కస్తూరి తిలకము తీర్చి

పాదాలకు పారాణిని పెట్టి

పాదాలకు పారాణిని పెట్టి

దిష్టిచుక్క బుగ్గను నిలిపి..దిష్టిచుక్క బుగ్గను నిలిపి 

పెళ్లికూతురై వెలసిన సీతా


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::4


వరుడు రాముడు..పురుషోత్తముడే

వధువు సీత..ఆ జగన్మాతయే

బ్రహ్మ కడిగిన పాదము కడిగే

కన్యాదాత..బ్రహ్మజ్ఞాని

ఇది నా పుత్రిక..సీత శుభాంగి

ఇటు చేపట్టగ..నీకు అర్థాంగి

నిత్యము నీతో నీడ విధాన

చరించ కలదని..జనకుడు పలికే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::5


తెల్లనిముత్యము లెర్రగమారి

ఎర్రనివేమో నీలములవుతూ

తడవ తడవకో రంగును దాల్చే

తడవ తడవకో రంగును దాల్చే

తలంబ్రాలు మది భ్రమింపజేసే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::6


చూచువారలకు శుభదాయకము

రక్తి భుక్తి ముక్తి దాయకము..ఆ ఆ ఆ ఆఅ

చూచువారలకు శుభదాయకము

రక్తి భుక్తి ముక్తి దాయకము

కామితార్థముల కల్పవృక్షము

కామితార్థముల కల్పవృక్షము 

కలకాలానికి నిరుపమానమౌ


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


Monday, April 04, 2022

ప్రేమించు పెళ్ళాడు--1985



సంగీతం::ఇళయరాజ

రచన::వేటూరి

గానం::S,P,బాలు,S.జానకి 


పల్లవి::

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

రొదగా..నా ఎదలో..తుమ్మెదలా చేసే 

ప్రేమాలాపన

రొదగా..నా ఎదలో..తుమ్మెదలా చేసే ప్రే

మాలాపన

ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని 

లాలా లాలా లల లా లా లా లా  


చరణం::1


విడిపోలేనీ విరి తీవెలలో..వురులే మరులై పోతుంటే..హో

ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమే వలపే పుడుతుంటే 

తనువు తనువు..తరువు తరువై

పుప్పోడి ముద్దే పెడుతుంటే 

పూలే గంధం పూస్తుంటే..ఏఏ..

తొలిగా..నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా 

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

లాలా లాలా లల లా లా లా లా క్ష్4 


చరణం::2 


గళమే పాడే కళ కోయిలనే

వలచీ పిలిచే నా గీతం..హోయ్

నదులై సాగే ఋతు శోభలనే అ

భిషేకించే మకరందం

గగనం... భువనం..కలిసే సొగసే

సంధ్యారాగం అవుతుంటే..ఏ

లయలే ప్రియమై పోతుంటే..హోయ్

వనమే..యవ్వనమై..జీవనమై సాగే రాధాలాపనా 

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

రొదగా..నా ఎదలో..

తుమ్మెదలా చేసే ప్రేమాలాపన  


Preminchu Pellaadu--1985

sangeetam::ilayaraja  

rachana::Vetoori 

gaanam::S.P.Baalu,S.Jaanaki 


pallavi::


ii chaitra veeNa..jhum^ jhummani

ii chaitra veeNa..jhum^ jhummani

rodagaa..naa edalO..tummedalaa chEsE 

prEmaalaapana

rodagaa..naa edalO..tummedalaa chEsE prE

maalaapana

ii chaitra veeNa jhum^ jhummani 

laalaa laalaa lala laa laa laa laa  


charaNam::1


viDipOlEnii viri teevelalO..vurulE marulai pOtunTE..hO

eDabaaTEdii eda lOtulalO..adimE valapE puDutunTE 

tanuvu tanuvu..taruvu taruvai

puppODi muddE peDutunTE 

poolE gandham poostunTE..EE..

toligaa..naa chelitO kaugililO saagE prEmaaraadhanaa 

ii chaitra veeNa..jhum^ jhummani

ii chaitra veeNa..jhum^ jhummani

laalaa laalaa lala laa laa laa laa x4 


charaNam::2 


gaLamE paaDE kaLa kOyilanE

valachii pilichE naa geetam..hOy^

nadulai saagE Rtu SObhalanE a

bhishEkinchE makarandam

gaganam... bhuvanam..kalisE sogasE

sandhyaaraagam avutunTE..E

layalE priyamai pOtunTE..hOy^

vanamE..yavvanamai..jeevanamai saagE raadhaalaapanaa 

ii chaitra veeNa..jhum^ jhummani

ii chaitra veeNa..jhum^ jhummani

rodagaa..naa edalO..

tummedalaa chEsE prEmaalaapana  

Thursday, March 10, 2022

మువ్వగోపాలుడు--1987

 




సంగీతం::మహదేవన్

రచన::సినారె 

గానం::S.P.బాలు,P.సుశీల 

Film Directed By::Kodi Ramakrishna 

తారాగణం::బాలకృష్ణ,రావుగోపాలరావు,G.మారుతిరావు,శోభన,విజయశాంతి,జయచిత్ర,అనిత,కల్పనరా

పల్లవి::

 ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా 

చేమంతికి సీమంతం..గోరింకకు పేరంటం

సిరిమల్లికి సింధూరం


లలలలలలలలలలలల 

ముత్యాల చెమ్మచెక్కలు.ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా  


చరణం::1


చిగురు మాను గుబురుళ్లూ..చిలకపాప కబురుళ్లు

పైరు పైరునా పైర గాలి పరవళ్లు

చిగురు మాను గుబురుళ్లూ..చిలక పాప కబురుళ్లూ

పైరు పైరునా పైర గాలి పరవళ్లు


కోకిల గొంతున..కుహుకుహు రాగం

మబ్బుల మాటున..ధిమిధిమి నాదం

కోకిల గొంతున..కుహుకుహు రాగం

మబ్బుల మాటున..ధిమిధిమి నాదం

ఆకాశం అంచు మీద..ఆరేసిన మబ్బు చీర

అందుకుంటే ఆటవిడుపు పదవే 

పదపదపదపద..పదపదపదపదపద 


అహ..ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా

కొండపల్లి కొయ్యబొమ్మ..కోకకట్టి కూర్చుందమ్మ

అంతలోనే అయ్యయ్యయ్యో..పమపమపమపమ

ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా 


చరణం::2


సరి ఈడు అమ్మళ్లు..సరదాల గుమ్మళ్లు

ఆటలాడితే..అల్లోఅల్లో నేరళ్ళు

సరి ఈడు అమ్మళ్లు..సరదాల గుమ్మళ్లు

ఆటలాడితే అల్లోఅల్లో నేరళ్ళు

కురిసే సిగ్గుల..మరదలు పిల్లా

మెరిసే బుగ్గల..సొగసరి పిల్లా

కురిసే సిగ్గుల..మరదలు పిల్లా

మెరిసే బుగ్గల..సొగసరి పిల్లా

నిన్నేమో చిన్ని మొలక..నేడేమో వన్నె చిలకా

నేటితోనే ఆట కట్టు..అవునా


సరిసరిసరిసరిసరిసరిసరిసరి

ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా

కొండపల్లి కొయ్యబొమ్మ..కోకకట్టి కూర్చుందమ్మ

అంతలోనే..అయ్యయ్యయ్యోయ్యోయ్యో 

లలలలలలలలలలలలలల 

అరే..ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా


MuvvagOpaaluDu--1987 
sangeetam::mahadEvan
rachana::sinaare 
gaanaM::`S.P.`baalu,`P`.suSeela 
`Film Directed By::Kodi Ramakrishna` 
taaraagaNaM::baalakRshNa,raavugOpaalaraavu,`G`.maarutiraavu,SObhana,vijayaSaaMti,jayachitra,anita,kalpanaraa

pallavi::
 
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa 
chEmamtiki seemantam..gOrinkaku pEranTam
sirimalliki sindhooram

lalalalalalalalalalalala 
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa

charaNam::1

chiguru maanu guburuLLu ..chilakapaapa kaburuLLu
pairu pairunaa paira gaali paravaLLu

chiguru maanu guburuLLu ..chilakapaapa kaburuLLu
pairu pairunaa paira gaali paravaLLu

kOkila gontuna..kuhukuhu raagam
mabbula maaTuna..dhimidhimi naadam
kOkila gontuna..kuhukuhu raagam
mabbula maaTuna..dhimidhimi naadam
AkaaSam anchu meeda..ArEsina mabbu cheera
andukunTE ATaviDupu padavE 
padapadapadapada..padapadapadapadapada 

Aha..mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa
konDapalli koyyabomma..kOkakaTTi koorchundamma
antalOnE ayyayyayyO..pamapamapamapama
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa

charaNam::2

sari EDu ammaLLu..saradaala gummaLLu
aaTalaaDitE..allO allO nEraLLu
sari EDu ammaLLu..saradaala gummaLLu
aaTalaaDitE..allO allO nEraLLu
kurisE siggula..maradalu pillaa
merisE buggala..sogasari pillaa
kurisE siggula..maradalu pillaa
merisE buggala..sogasari pillaa
ninnEmO chinni molaka..nEDEmO vanne chilakaa
nETitOnE ATa kaTTu..avunaa

sarisarisarisarisarisarisarisari
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa
konDapalli koyyabomma..kOkakaTTi koorchundamma
antalOnE..ayyayyayyOyyOyyO 
lalalalalalalalalalalalalala 
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa

Thursday, December 30, 2021

పెంకిపెళ్ళాం--1956



పెంకిపెళ్ళాం--1956

సంగీతం::K.ప్రసాద్‌రావ్

రచన::ఆరుద్ర

గానం::P.సుశీల

తారాగణం::NTR.రాజసులోచన,శ్రీరంజని,రమణారెడ్డి,రేలంగి,నాగభూషణం,సూర్యకాంతం,చాయాదేవి,E.V.సరోజ.


పల్లవి::


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా..


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా.. 

చరణం::1

దీనుల పాలిట..దేవత నీవు

నమ్మిన వారిని వీడవులే

దీనుల పాలిట..దేవత నీవు

నమ్మిన వారిని వీడనులేవు 

కరుణించి..మొరలాలకించుమా..ఆఆఆ

కరుణించి..మొరలాలకించుమా

కోరికదీర్చి..తీరముచేర్చే

కోరికదీర్చి..తీరముచేర్చే


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా.. 


చరణం::2


తల్లీతండ్రీ దూరముకాగా..తీరని వేతనలో ధైర్యముపోగా

తల్లీతండ్రీ దూరముకాగా..తీరని వేతనలో ధైర్యముపోగా 

కలిగెను కడలేని వేదనా..కలిగెను కడలేని వేదనా 

శరణు శరణు ఓ చల్లని తల్లీ..


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా.. 


penkipeLLaam--1956

sangeetam::`K`.prasaad^raav

rachana::Arudra

gaanam::`P.`suSeela

taaraagaNam::`NTR`.raajasulOchana,Sreeranjani,ramaNaareDDi,rElangi,naagabhuushaNam,sooryakaantam,chaayaadEvi,`E.V.`sarOja.


pallavi::


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa..


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa.. 


charaNam::1


deenula paaliTa..dEvata neevu

nammina vaarini veeDavulE

deenula paaliTa..dEvata neevu

nammina vaarini veeDanulEvu 

karuNinchi..moralaalakinchumaa..AAA

karuNinchi..moralaalakinchumaa

kOrikadeerchi..teeramuchErchE

kOrikadeerchi..teeramuchErchE


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa.. 


charaNam::2


talliitanDrii dooramukaagaa..teerani vEtanalO dhairyamupOgaa

talliitanDrii dooramukaagaa..teerani vEtanalO dhairyamupOgaa 

kaligenu kaDalEni vEdanaa..kaligenu kaDalEni vEdanaa 

SaraNu SaraNu O challani tallii..


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa..