Tuesday, October 18, 2022

తల్లికొడుకుల అనుబంధం..1982

 



సంగీతం::సత్యం 

రచన::వేటూరి 

గానం::S.P.బాలు,P.సుశీల.

తారాగణం::కృష్ణంరాజు,జయప్రద,జగ్గయ్య,K.R.విజయ,కైకాల సత్యనారాయణ.

  

పల్లవి:: 


దాచుకోకు వలపువాలు కన్నుల 

దరహసించు దశమినాటి వెన్నెలా 

మాపటింటి జాడలో..మల్లెపూల నీడలో

కరగాలి వన్నెలన్ని వెన్నలా..ఆ


దోచుకోకు చిలిపివాలు కన్నులా..

పరిమళించి నవమి లేత వెన్నెలా.. 

నీలిమబ్బు నీడలో..వానవిల్లు మేడలో 

అడగాలి ముద్దులన్ని నన్నిలా..ఆ..


దాచుకోకు వలపువాలు కన్నుల 

పరిమళించి నవమి లేత వెన్నెలా..


చరణం::1


పున్నమంటి చిన్నదాన్ని కౌగిటా..ఆ

పూటకొక్క పులకరింత పుట్టగా.. 

సన్నజాజి వన్నెకాడి సందిటా..ఆ

సందెగాలి పలకరింత పెట్టగా..

పొంగుతున్న వయసును..బెంగపడ్డ మనసును

పెరగాలి పెళ్ళిముందు..పేమగా..ఆ..


దోచుకోకు చిలిపివాలు కన్నులా..

దరహసించు దశమినాటి వెన్నెలా


చరణం::2


ఆహా..ఆ ఆ ఆ ఆ ఆ

చినుకులాంటి చిన్నవాడి చూపులే.

వలపు తెలుపు మాటలేని పిలుపులు

మేలివంటి కన్నెపిల్ల మేనిలో..తొంగి చూసె నింగిలోని మెరుపులూ..ఊ

పడుచు పట్టు విడుపులు..వయసు ఆట  విడుపులు..కలవాలి ప్రేమ ఇంక పెళ్ళిగా..ఆ..


దాచుకోకు వలపువాలు కన్నుల 

దరహసించు దశమినాటి వెన్నెలా 


పరిమళించి నవమి లేత వెన్నెలా.. 

నీలిమబ్బు నీడలో..వానవిల్లు మేడలో 

అడగాలి ముద్దులన్ని నన్నిలా..ఆ..

లాలలాలలాలలాలలాలలా..హా..

ఆ...ఆహా..ఆఆ....


tallikoDukula anubandham..1982

sangeetam::satyam 

rachana::vEToori 

gaanam::`S.P.`baalu,`P`.suSeela.

taaraagaNam::kRshNam^raaju,jayaprada,jaggayya,`K.R.`vijaya,kaikaala satyanaaraayaNa.

  

::::::::::::::::::::::::::::::::::::::::

daachukOku valapuvaalu kannula 

darahasinchu daSaminaaTi vennelaa 

maapaTinTi jaaDalO..mallepoola neeDalO

karagaali vannelanni vennalaa..aa


dOchukOku chilipivaalu kannulaa..

parimaLinchi navami lEta vennelaa.. 

neelimabbu neeDalO..vaanavillu mEDalO 

aDagaali muddulanni nannilaa..aa..


daachukOku valapuvaalu kannula 

parimaLinchi navami lEta vennelaa..


:::::::1


punnamanTi chinnadaanni kougiTaa..aa

pooTakokka pulakarinta puTTagaa.. 

sannajaaji vannekaaDi sandiTaa..aa

sandegaali palakarinta peTTagaa..

pongutunna vayasunu..bengapaDDa manasunu

peragaali peLLimundu..pEmagaa..aa..


dOchukOku chilipivaalu kannulaa..

darahasinchu daSaminaaTi vennelaa


:::::::2


aahaa..aa aa aa aa aa

chinukulaanTi chinnavaaDi choopulE.

valapu telupu maaTalEni pilupulu

mElivanTi kannepilla mEnilO..tongi choose ningilOni merupuloo..oo

paDuchu paTTu viDupulu..vayasu ATa  viDupulu..kalavaali prEma inka peLLigaa..aa..


daachukOku valapuvaalu kannula 

darahasinchu daSaminaaTi vennelaa 


parimaLinchi navami lEta vennelaa.. 

neelimabbu neeDalO..vaanavillu mEDalO 

aDagaali muddulanni nannilaa..aa..

laalalaalalaalalaalalaalalaa..haa..

aa...aahaa..aaaaaa....

Monday, October 17, 2022

సంసారబంధం..1980

 


సంగీతం::J.V.రాఘవులు 

రచన::మైలవరపు గోపి

గానం::S.P.బాలు,P.సుశీల.

తారాగణం::శ్రీధర్,ప్రభ,నూతనప్రసాద్,జయసుధ,నారాయణరావు.


పల్లవి::


వేణు గానాలు నీరాకలోనా..వేయి వెన్నెల్లు కలిచూపులోనా 

 

వేణు గానాలు నీరాకలోనా..వేయి వెన్నెల్లు ప్రతిచూపులోనా 


వేణు గానాలు నీరాకలోనా..ఆ..


చరణం::1


నీలాల నీ కళ్ళలోనా..నను నూరేళ్ళు కొలువుండిపోనీ..

ఆ..కడదాక నీ నీడలోనా..నను గువ్వల్లే ఒదిగుండిపోనీ 

హో.. ఊహ నీవై..ఊసు నేనై..గుండె నీవై గొంతు నేనై..చేరి బాసలాడనీ..  


వేణు గానాలు నీరాకలోనా..వేయి వెన్నెల్లు ప్రతిచూపులోనా 


వేణు గానాలు నీరాకలోనా..ఆ..


చరణం::2


నీ కులుకు తళుకు నన్ను కవ్విస్తున్నాయ్..అబ్భా..పొందలేక బ్రతుకెండుకు అనిపిస్తున్నాయ్..చినదానా..ఆ..నాకు నచ్చిన దానా..

చినదానా నాకు నచ్చిన దానా..చినదానా..ఆ..


చరణం::3


నీటతడిసి ఒళ్ళు సగం కనిపిస్తుంటే..

చీరకట్టినా నీ వంటికి లేనట్లుంటే.. 


నీటతడిసి ఒళ్ళు సగం కనిపిస్తుంటే..

చీరకట్టినా నీ వంటికి లేనట్లుంటే..


మనసుపడే నా మనసు ఏమైపోనూ..నువ్ కాదనకే నీ సొగసు నాదైపోనూ..చినదానా నాకు నచ్చిన దానా..చిన్నదానా నాకు నచ్చిన దానా..

నీ కులుకు తళుకు నన్ను కవ్విస్తున్నాయ్.. 

అబ్భా..పొందలేక బ్రతుకెందుకు అనిపిస్తున్నాయ్.. 


చినదానా నాకు నచ్చిన దానా..చిన్నదానా నాకు నచ్చిన దానా..  


Samsaarabandham..1980

sangeetam::`J.V.`raaghavulu 

rachana::mailavarapu gOpi

gaanam::`S.P.`baalu,`P`.suSeela.

taaraagaNam::Sreedhar,prabha.


:::::::::::::::::::::::::::::


vENu gaanaalu neeraakalOnaa..vEyi vennellu kalichoopulOnaa 

 

vENu gaanaalu neeraakalOnaa..vEyi vennellu pratichoopulOnaa 


vENu gaanaalu neeraakalOnaa..aa..


::;:::1


neelaala nee kaLLalOnaa..nanu noorELLu koluvunDipOnii..

aa..kaDadaaka nee neeDalOnaa..nanu guvvallE odigunDipOnii 

hO.. uuha neevai..Usu nEnai..gunDe neevai gontu nEnai..chEri baasalaaDanee..  


vENu gaanaalu neeraakalOnaa..vEyi vennellu pratichoopulOnaa 


vENu gaanaalu neeraakalOnaa..aa..


:::::2


nee kuluku taLuku nannu kavvistunnaay..abbhaa..pondalEka bratukenDuku anipistunnaay..chinadaanaa..aa..naaku nachchina daanaa..

chinadaanaa naaku nachchina daanaa..chinadaanaa..aa..


:::::3


neeTataDisi oLLu sagam kanipistunTE..

chiirakaTTinaa nee vanTiki lEnaTlunTE.. 


neeTataDisi oLLu sagam kanipistunTE..

chiirakaTTinaa nee vanTiki lEnaTlunTE..


manasupaDE naa manasu EmaipOnuu..nuv kaadanakE nee sogasu naadaipOnuu..chinadaanaa naaku nachchina daanaa..chinnadaanaa naaku nachchina daanaa..

nee kuluku taLuku nannu kavvistunnaay.. 

abbhaa..pondalEka bratukenduku anipistunnaay.. 


chinadaanaa naaku nachchina daanaa..chinnadaanaa naaku nachchina daanaa..  

మునసబుగారి అల్లుడు..1985



సంగీతం::B,గోపాలం 

రచన::దేవులపల్లి క్రిష్ణశాస్ర్తి

గానం::S.P.బాలు,P.సుశీల.

తారాగణం::గిరిబాబు,శ్రీగీత


పల్లవి::


శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..


చరణం::1


ఎన్నో కొండలు దాటాలా..అన్నిలోయలూ నడవాలా

కన్నతండ్రివే కాచేదొరవే..కన్నతండ్రివే కాచేదొరవే

కనకరించి మాపై దిగిరావే..


శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా.. 


చరణం::2


ఒక కనుచూపే చాలులే..ఒక చిరునవ్వే చాలులే

కథనము మరచి సన్నిధి నిలిచి

చరణముల కడ పడిపోవగ 


శ్రీగిరి మందిర సుందర సుందర


చరణం::3


మనసును వీడని మమతలు..మాలో వాడని మల్లియలూ 

ఈ సంసారమూ నీదే వరమూ..ఆఆఆఆ

ఈ సంసారం నీదే వరమూ 

కలకాలం ఇలా నిలుపుము తండ్రి..


శ్రీగిరి మందిర సుందర సుందర

శ్రీగిరి మందిర సుందర సుందర 

శ్రితజన మందారా..శ్రీకర..శ్రితజన మందారా..... 


Munasabugaari alluDu..1985
Music::B.Gopaalam 
Lyrics::Devulapalli krishNaSaasrti
Singer's::`S.P.`baalu,`P`.suSeela.
Cast::giribaabu,Sreegeeta

::::::::::::::::::::::::::::::::::::::::

Sreegiri mandira sundara sundara
Sreegiri mandira sundara sundara
Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..

::::::1

ennO konDalu daaTaalaa..annilOyaluu naDavaalaa
kannatanDrivE kaachEdoravE..kannatanDrivE kaachEdoravE
kanakarinchi maapai digiraavE..

Sreegiri mandira sundara sundara
Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa.. 

:::::2

oka kanuchoopE chaalulE..oka chirunavvE chaalulE
kathanamu marachi sannidhi nilichi
charaNamula kaDa paDipOvaga 

Sreegiri mandira sundara sundara

:::::3

manasunu veeDani mamatalu..maalO vaaDani malliyaloo 
ii samsaaramoo needE varamoo..aaaaaaaaaaaa
ii samsaaram needE varamuu 
kalakaalam ilaa nilupumu tanDri..

Sreegiri mandira sundara sundara
Sreegiri mandira sundara sundara 
Sritajana mandaaraa..Sreekara..Sritajana mandaaraa..... 

Friday, July 22, 2022

సీతాకల్యాణం--1976



సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B.శ్రీనివాస్,S.P.బాలు,

B.వసంత,బ్రుందం.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


జానకి రాముల కలిపే విల్లు..జనకుని ఇంటనె ఉన్నది

ఈ యింటికి ఆ వింటికి..ఘనమగు కథ యొకటున్నది..ఈ


తారకాసురుని తనయులు..ముగ్గురు దారుణ బలయుతులు..ఊఉ 

విపరీతమ్మగు వరములు పొంది..కట్టిరి త్రిపురములు


ఆ కోటల చుట్టూ పెట్టిరి..ఎన్నో రక్కసి రక్షణలు..ఊ

ఎదురు లేదని చెలరేగిరి..ఆ త్రిలోక కంటకులు..

దారుణ హింసలు తాళజాలక..తల్లడిల్లి సురలు

హిమాలయమ్మున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు


సర్వదేవమయ సర్వమహేశ్వర..శరణు శరణు శరణు

శత్రుభయంకర పాపలయంకర..శరణు శరణు శరణు

పాహిమాం..పాహిమాం..పాహిమాం..

గర్వాంధులు ఆ త్రిపురాసురుల..కడతేర్ప నిదే అదను

పాహిమాం..పాహిమాం..పాహిమాం..పాహిమా..


పాహిమాం..పాహిమాం..పాహిమాం..పాహిమాం..

మేరు పర్వతము వింటిబద్దగా..ఆ

ఆదిశేషుడే వింటి నారిగా..నలువరాణియే వింటి గంటగా

నారాయణుడే వింటి శరముగా..అమరెను శివునికి విల్లు

అసురుల ఆయువు చెల్లు..అమరెను శివునికి విల్లు

అసురుల ఆయువు చెల్లు..


చండ ప్రచండ అఖండ బలుండగు

గండరగండడు శివుడు..కొండరథముపై కొండవింటితో

దండిమగల చెండాడె..దండిమగల చెండాడె..ఏఏ


సీతాకల్యాణం--1976

 




సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,రమోల, 

B.వసంత.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


సీతమ్మకు సింగారం చేతాము రారమ్మా

సీతమ్మకు సింగారం చేతాము రారమ్మా 

సిరితల్లి ముచ్చటలు చూతాము రారమ్మ 

రారమ్మా..ఆ..రారమ్మా..ఆ

రారమ్మా..ఆ..రారమ్మా..ఆ 


చరణం::1


దువ్వకముందే దువ్వినరీతి తోచె నల్లని కురులు 

అందు తురుముటకోసం నోములు నోచును 

తోటలోని విరులు

నీలవర్ణుడు నిండిన కనులకు..కాటుక ఏలమ్మా

నీలవర్ణుడు నిండిన కనులకు..కాటుక ఏలమ్మా

ఫాలభాగమున దిద్దిన తిలకము..బాలభానుడే అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా


చరణం::2


ఒక్కా ఓ చెలియా రెండూ రేవన్నా

మూడు ముచ్చిలుక నాలుగు నందన్నా..ఆ

ఐదుం చిట్టిగొలుసు ఆరుం జవ్వాది

ఏడుం వేడుకలు ఎనిమిది ఎలమంద

తొమ్మిది తోకుచ్చు..పదీ పట్టెడ..చెంగనాలో చెంగనాలు..చెంగనాలో..చెంగనాలు..హా హా హా


చరణం::3


ఆటలలోన హరినే తలచి మనలోకంలో వుండదు

పంటలవేళ పరాకువల్ల పడతి జానకి పండదు

చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మా మూసేదీ

చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మా మూసేదీ

సైయ్యా..ఆ.. సై.. దాగిన వారిని వెదకదు సీతా ఎల్లాగమ్మా ఆడేదీ


అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

చరణం::4

బంతుల ఆటకు ఇంతీరావే..ఏఏ..ఇదిగో బంతి పూలబంతీ

ఇదిగో సన్నజాజి బంతీ..ఈ.. ఇదిగో మల్లెపూల బంతీ..ఈఈ..ఇదిగో కలువపూల బంటీ..హా హా హా 

చెలికత్తెలు విరబంతులు రువ్వ..ఆఅ..చిరునవ్వులు రువ్వును సీతమ్మా..ఆ

ఆదిలక్ష్మికి పూవుల పూజలు అలవాటే కద ఔనమ్మా..

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా 

Tuesday, July 19, 2022

సీతాకల్యాణం--1976

 




సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

వసంత,రామకృష్ణ,S.P.బాలసుబ్రమణ్యం 

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


పరమ పావనమైన శ్రీ పాదము

పాషాణమున కొసగి స్త్రీ రూపము

పతితపావనమైన యీ పాదము

సతిపతుల కలిపినది కలకాలము

జగమేల గల మేటి మగరాయడు

హరుని విల్లును వంచు సిరకన్నె వరియించు

హరిలాగ వున్నాడు ఎవరీతడూ ఎవరీతడూ,ఎవరీతడూ.


ఈ పాదమందే పుట్టినది

ఎల్లపాపాలు హరియించు గంగానది

ఈ పాదమిప్పుడు మెట్టినది

కడు ఇంపైన సొంపైన మిథిలాపురి

ఆజానుబాహువులు రాజీవనేత్రాలు

అందాల అరుణాబ్జ చరణాలు

ఎగు భుజమ్ములవాడు నగుమోము కలవాడు

జగమేలగల మేటి మగరాయడు

హరుని విల్లును వంచు సిరకన్నె వరియించు

హరిలాగ వున్నాడు ఎవరీతడు


చరణం::1 


రాముని సొగసులు పువ్వులు అయితే

పౌరుల చూపులు తుమ్మెదలు..వాలిన చోటున వీడగలేవు

మధుర మధురమా సుధలూ..పదములు అందం చూసే చూపు

పదముల నుండి కదలవులే..పెదవుల నవ్వు చూసే చూపు

పెదవుల వదలీ కదలదులే

రాముని అందం మకరందం 

రసమయమైనది ప్రతిబింభం

రాముని అందం మకరందం

రసమయమైనది ప్రతిబింభం 

రాముని చరణం అరవిందం 

కొలచిన చాలును ఆనందం


సీతాకల్యాణం--1976

 




సంగీతం::KV..మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


సీతమ్మ విహరించు పూదోటకు 

మధుమాస మెపుడో వచ్చింది

కాని మరలా వచ్చింది..సరికొత్త ఆమని

రామయ్య అటు అడుగు పెట్టాడని


గోరింక పిలిచింది రాచిలుకని

కోరి చూపించింది రామయ్యని

చిలకమ్మ పిలిచింది సీతమ్మని

చేయెత్తి చూపింది రామయ్యని

బిడియపడి చూసింది సీతమ్మ


కడగంట చూశాడు రామయ్య

ఆ రెండుచూపులూ ఒకసారి కలిసె

అతిలోక ప్రణయాలు అందులో వెలసె


విరితోట గడిచాడు రామయ్య

విడలేక నడిచింది సీతమ్మ

ఎవరేని రామయ్య పేరెత్తినా

సీతమ్మ నిలువెల్ల పులకింతలే


సీతాకల్యాణం--1976




సంగీతం::కే.వి.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

వసంత,రామకృష్ణ.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::

కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ

కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ


ఆకసమంత పందిరివేసి

భూదవంతాఅరుగును అలికి. .ఆఆ 

ఆకసమంత పందిరివేసి

భూదవంతాఅరుగును అలికి

ఆణిముత్యముల ముగ్గులు పెట్టి

ఆణిముత్యముల ముగ్గులు పెట్టి

అంగరంగ వైభోగ భరితమౌ 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::1 


పగడపు రోకలి బంగరు కట్లు

పసుపును దంచే పడతుల జట్లు

పగడపు రోకలి బంగరు కట్లు

పసుపును దంచే పడతుల జట్లు


పరిపరి విధముల కొట్నముదంచి

సువ్వి సువ్వి అని సుదతులు పాడే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::2


సంపెంగె నూనెల శిరసును అంటి

హరి చందనమే మేనున అలది

సంపెంగె నూనెల శిరసును అంటి

హరి చందనమే మేనున అలది

మణిపీఠముపై నలుగులుపెట్టి

మణిపీఠముపై నలుగులుపెట్టి

మంగళస్నానము చేసే రాముని 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::3


తీరుగ కస్తూరి తిలకము తీర్చి

తీరుగ కస్తూరి తిలకము తీర్చి

పాదాలకు పారాణిని పెట్టి

పాదాలకు పారాణిని పెట్టి

దిష్టిచుక్క బుగ్గను నిలిపి..దిష్టిచుక్క బుగ్గను నిలిపి 

పెళ్లికూతురై వెలసిన సీతా


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::4


వరుడు రాముడు..పురుషోత్తముడే

వధువు సీత..ఆ జగన్మాతయే

బ్రహ్మ కడిగిన పాదము కడిగే

కన్యాదాత..బ్రహ్మజ్ఞాని

ఇది నా పుత్రిక..సీత శుభాంగి

ఇటు చేపట్టగ..నీకు అర్థాంగి

నిత్యము నీతో నీడ విధాన

చరించ కలదని..జనకుడు పలికే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::5


తెల్లనిముత్యము లెర్రగమారి

ఎర్రనివేమో నీలములవుతూ

తడవ తడవకో రంగును దాల్చే

తడవ తడవకో రంగును దాల్చే

తలంబ్రాలు మది భ్రమింపజేసే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::6


చూచువారలకు శుభదాయకము

రక్తి భుక్తి ముక్తి దాయకము..ఆ ఆ ఆ ఆఅ

చూచువారలకు శుభదాయకము

రక్తి భుక్తి ముక్తి దాయకము

కామితార్థముల కల్పవృక్షము

కామితార్థముల కల్పవృక్షము 

కలకాలానికి నిరుపమానమౌ


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


Monday, April 04, 2022

ప్రేమించు పెళ్ళాడు--1985



సంగీతం::ఇళయరాజ

రచన::వేటూరి

గానం::S,P,బాలు,S.జానకి 


పల్లవి::

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

రొదగా..నా ఎదలో..తుమ్మెదలా చేసే 

ప్రేమాలాపన

రొదగా..నా ఎదలో..తుమ్మెదలా చేసే ప్రే

మాలాపన

ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని 

లాలా లాలా లల లా లా లా లా  


చరణం::1


విడిపోలేనీ విరి తీవెలలో..వురులే మరులై పోతుంటే..హో

ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమే వలపే పుడుతుంటే 

తనువు తనువు..తరువు తరువై

పుప్పోడి ముద్దే పెడుతుంటే 

పూలే గంధం పూస్తుంటే..ఏఏ..

తొలిగా..నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా 

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

లాలా లాలా లల లా లా లా లా క్ష్4 


చరణం::2 


గళమే పాడే కళ కోయిలనే

వలచీ పిలిచే నా గీతం..హోయ్

నదులై సాగే ఋతు శోభలనే అ

భిషేకించే మకరందం

గగనం... భువనం..కలిసే సొగసే

సంధ్యారాగం అవుతుంటే..ఏ

లయలే ప్రియమై పోతుంటే..హోయ్

వనమే..యవ్వనమై..జీవనమై సాగే రాధాలాపనా 

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

ఈ చైత్ర వీణ..ఝుం ఝుమ్మని

రొదగా..నా ఎదలో..

తుమ్మెదలా చేసే ప్రేమాలాపన  


Preminchu Pellaadu--1985

sangeetam::ilayaraja  

rachana::Vetoori 

gaanam::S.P.Baalu,S.Jaanaki 


pallavi::


ii chaitra veeNa..jhum^ jhummani

ii chaitra veeNa..jhum^ jhummani

rodagaa..naa edalO..tummedalaa chEsE 

prEmaalaapana

rodagaa..naa edalO..tummedalaa chEsE prE

maalaapana

ii chaitra veeNa jhum^ jhummani 

laalaa laalaa lala laa laa laa laa  


charaNam::1


viDipOlEnii viri teevelalO..vurulE marulai pOtunTE..hO

eDabaaTEdii eda lOtulalO..adimE valapE puDutunTE 

tanuvu tanuvu..taruvu taruvai

puppODi muddE peDutunTE 

poolE gandham poostunTE..EE..

toligaa..naa chelitO kaugililO saagE prEmaaraadhanaa 

ii chaitra veeNa..jhum^ jhummani

ii chaitra veeNa..jhum^ jhummani

laalaa laalaa lala laa laa laa laa x4 


charaNam::2 


gaLamE paaDE kaLa kOyilanE

valachii pilichE naa geetam..hOy^

nadulai saagE Rtu SObhalanE a

bhishEkinchE makarandam

gaganam... bhuvanam..kalisE sogasE

sandhyaaraagam avutunTE..E

layalE priyamai pOtunTE..hOy^

vanamE..yavvanamai..jeevanamai saagE raadhaalaapanaa 

ii chaitra veeNa..jhum^ jhummani

ii chaitra veeNa..jhum^ jhummani

rodagaa..naa edalO..

tummedalaa chEsE prEmaalaapana  

Thursday, March 10, 2022

మువ్వగోపాలుడు--1987

 




సంగీతం::మహదేవన్

రచన::సినారె 

గానం::S.P.బాలు,P.సుశీల 

Film Directed By::Kodi Ramakrishna 

తారాగణం::బాలకృష్ణ,రావుగోపాలరావు,G.మారుతిరావు,శోభన,విజయశాంతి,జయచిత్ర,అనిత,కల్పనరా

పల్లవి::

 ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా 

చేమంతికి సీమంతం..గోరింకకు పేరంటం

సిరిమల్లికి సింధూరం


లలలలలలలలలలలల 

ముత్యాల చెమ్మచెక్కలు.ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా  


చరణం::1


చిగురు మాను గుబురుళ్లూ..చిలకపాప కబురుళ్లు

పైరు పైరునా పైర గాలి పరవళ్లు

చిగురు మాను గుబురుళ్లూ..చిలక పాప కబురుళ్లూ

పైరు పైరునా పైర గాలి పరవళ్లు


కోకిల గొంతున..కుహుకుహు రాగం

మబ్బుల మాటున..ధిమిధిమి నాదం

కోకిల గొంతున..కుహుకుహు రాగం

మబ్బుల మాటున..ధిమిధిమి నాదం

ఆకాశం అంచు మీద..ఆరేసిన మబ్బు చీర

అందుకుంటే ఆటవిడుపు పదవే 

పదపదపదపద..పదపదపదపదపద 


అహ..ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా

కొండపల్లి కొయ్యబొమ్మ..కోకకట్టి కూర్చుందమ్మ

అంతలోనే అయ్యయ్యయ్యో..పమపమపమపమ

ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా 


చరణం::2


సరి ఈడు అమ్మళ్లు..సరదాల గుమ్మళ్లు

ఆటలాడితే..అల్లోఅల్లో నేరళ్ళు

సరి ఈడు అమ్మళ్లు..సరదాల గుమ్మళ్లు

ఆటలాడితే అల్లోఅల్లో నేరళ్ళు

కురిసే సిగ్గుల..మరదలు పిల్లా

మెరిసే బుగ్గల..సొగసరి పిల్లా

కురిసే సిగ్గుల..మరదలు పిల్లా

మెరిసే బుగ్గల..సొగసరి పిల్లా

నిన్నేమో చిన్ని మొలక..నేడేమో వన్నె చిలకా

నేటితోనే ఆట కట్టు..అవునా


సరిసరిసరిసరిసరిసరిసరిసరి

ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా

కొండపల్లి కొయ్యబొమ్మ..కోకకట్టి కూర్చుందమ్మ

అంతలోనే..అయ్యయ్యయ్యోయ్యోయ్యో 

లలలలలలలలలలలలలల 

అరే..ముత్యాల చెమ్మచెక్కలు..ముగ్గులు వేయంగా  

రతనాల చెమ్మచెక్కలు..రంగులు వేయంగా


MuvvagOpaaluDu--1987 
sangeetam::mahadEvan
rachana::sinaare 
gaanaM::`S.P.`baalu,`P`.suSeela 
`Film Directed By::Kodi Ramakrishna` 
taaraagaNaM::baalakRshNa,raavugOpaalaraavu,`G`.maarutiraavu,SObhana,vijayaSaaMti,jayachitra,anita,kalpanaraa

pallavi::
 
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa 
chEmamtiki seemantam..gOrinkaku pEranTam
sirimalliki sindhooram

lalalalalalalalalalalala 
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa

charaNam::1

chiguru maanu guburuLLu ..chilakapaapa kaburuLLu
pairu pairunaa paira gaali paravaLLu

chiguru maanu guburuLLu ..chilakapaapa kaburuLLu
pairu pairunaa paira gaali paravaLLu

kOkila gontuna..kuhukuhu raagam
mabbula maaTuna..dhimidhimi naadam
kOkila gontuna..kuhukuhu raagam
mabbula maaTuna..dhimidhimi naadam
AkaaSam anchu meeda..ArEsina mabbu cheera
andukunTE ATaviDupu padavE 
padapadapadapada..padapadapadapadapada 

Aha..mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa
konDapalli koyyabomma..kOkakaTTi koorchundamma
antalOnE ayyayyayyO..pamapamapamapama
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa

charaNam::2

sari EDu ammaLLu..saradaala gummaLLu
aaTalaaDitE..allO allO nEraLLu
sari EDu ammaLLu..saradaala gummaLLu
aaTalaaDitE..allO allO nEraLLu
kurisE siggula..maradalu pillaa
merisE buggala..sogasari pillaa
kurisE siggula..maradalu pillaa
merisE buggala..sogasari pillaa
ninnEmO chinni molaka..nEDEmO vanne chilakaa
nETitOnE ATa kaTTu..avunaa

sarisarisarisarisarisarisarisari
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa
konDapalli koyyabomma..kOkakaTTi koorchundamma
antalOnE..ayyayyayyOyyOyyO 
lalalalalalalalalalalalalala 
mutyaala chemmachekkalu..muggulu vEyangaa  
ratanaala chemmachekkalu..rangulu vEyangaa

Thursday, December 30, 2021

పెంకిపెళ్ళాం--1956



పెంకిపెళ్ళాం--1956

సంగీతం::K.ప్రసాద్‌రావ్

రచన::ఆరుద్ర

గానం::P.సుశీల

తారాగణం::NTR.రాజసులోచన,శ్రీరంజని,రమణారెడ్డి,రేలంగి,నాగభూషణం,సూర్యకాంతం,చాయాదేవి,E.V.సరోజ.


పల్లవి::


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా..


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా.. 

చరణం::1

దీనుల పాలిట..దేవత నీవు

నమ్మిన వారిని వీడవులే

దీనుల పాలిట..దేవత నీవు

నమ్మిన వారిని వీడనులేవు 

కరుణించి..మొరలాలకించుమా..ఆఆఆ

కరుణించి..మొరలాలకించుమా

కోరికదీర్చి..తీరముచేర్చే

కోరికదీర్చి..తీరముచేర్చే


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా.. 


చరణం::2


తల్లీతండ్రీ దూరముకాగా..తీరని వేతనలో ధైర్యముపోగా

తల్లీతండ్రీ దూరముకాగా..తీరని వేతనలో ధైర్యముపోగా 

కలిగెను కడలేని వేదనా..కలిగెను కడలేని వేదనా 

శరణు శరణు ఓ చల్లని తల్లీ..


భారము నీదేనమ్మా..మా భారము నీదేనమ్మా

పాలముంచినా..నీటముంచినా

భారము నీదేనమ్మా.. 


penkipeLLaam--1956

sangeetam::`K`.prasaad^raav

rachana::Arudra

gaanam::`P.`suSeela

taaraagaNam::`NTR`.raajasulOchana,Sreeranjani,ramaNaareDDi,rElangi,naagabhuushaNam,sooryakaantam,chaayaadEvi,`E.V.`sarOja.


pallavi::


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa..


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa.. 


charaNam::1


deenula paaliTa..dEvata neevu

nammina vaarini veeDavulE

deenula paaliTa..dEvata neevu

nammina vaarini veeDanulEvu 

karuNinchi..moralaalakinchumaa..AAA

karuNinchi..moralaalakinchumaa

kOrikadeerchi..teeramuchErchE

kOrikadeerchi..teeramuchErchE


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa.. 


charaNam::2


talliitanDrii dooramukaagaa..teerani vEtanalO dhairyamupOgaa

talliitanDrii dooramukaagaa..teerani vEtanalO dhairyamupOgaa 

kaligenu kaDalEni vEdanaa..kaligenu kaDalEni vEdanaa 

SaraNu SaraNu O challani tallii..


bhaaramu needEnammaa..maa bhaaramu needEnammaa

paalamunchinaa..neeTamunchinaa

bhaaramu needEnammaa.. 

Wednesday, December 29, 2021

సీతారాములు--1980





సంగీతం::సత్యం

రచన::వేటూరి

గానం::S.P.బాలు,P.సుశీల.

తారాగణం::కృష్ణంరాజు,జయప్రద,గుమ్మడి,అల్లురామలింగయ్య,మోహన్‌బాబు, జయమాలిని.   


పల్లవి::


రంగురంగుబిల్లా..రుపాయిబిళ్ళ

ఖంగుమంటే..కరిగేనుకాలం

తద్దిత్తళాంగుమటే..తిరిగేనులోకం 


రంగురంగుబిల్లా..రుపాయిబిళ్ళ

ఖంగుమంటే..కరిగేనుకాలం

తద్దిత్తళాంగుమటే..తిరిగేనులోకం


శివరుపాయ విష్ణురూపాయ..అన్నదివేదం

రుపాయ పూజించనిదే..బతకదీలోకం

లోకానికి పెద్దదిక్కు..వున్నవాడే స్వర్గానికి 

మొదటిమెట్టు కలవాడే 


లోకానికి పెద్దదిక్కు..వున్నవాడే స్వర్గానికి 

మొదటిమెట్టు కలవాడే  


రుపాయల రుపాయి..నవవేదం వినపించకు

రుపాయల రుపాయి..నవవేదం వినపించకు

శివ విష్ణువు ఇద్దరికీ..కొత్తర్థం కల్పించకు


శివ విష్ణువు ఇద్దరికీ..కొత్తర్థం కల్పించకు


హే హే హే..డబ్బులేనివాడు..డబ్బుకైన కొరగాడు

డబ్బుకైన కొరగాడు..

కాసులేనివాడు..వడ్డీకాసులవాడే లేడు

వడ్డీకాసులవాడే లేడు


శ్రీమంతుల చినదానా..సిరి అంటే గుణమంట

అది పేదల ధనమంట..ఆ సిరి మీకేదంట 

ఓ..మతిలేని కలవారి శ్రీమతీ.. 


రంగురంగుబిల్లా..రుపాయిబిళ్ళ

ఖంగుమంటే..కలవారిలోకం 

తద్దిత్తళాంగుమంది..శ్రమజీవిరాజ్యం

తద్దిత్తళాంగుమంది..శ్రమజీవిరాజ్యం 


no money is the honey of the life  


 ఈ కాసులే నిరాకాసులు..కలవాళ్ళకు తిరకాసులు

 ఈ కాసులే నిరాకాసులు..కలవాళ్ళకు తిరకాసులు 

ఆకలి కేకలమూకలు..తోకలేలేని కోతులు  

ఆకలి కేకలమూకలు..తోకలేలేని కోతులు  


కన్నవాళ్ళ కన్నావీళ్ళు..చల్లనివాళ్ళు  

వున్నవాళ్ళబజారులో..చెల్లనివాళ్ళు

చేతకాని వేదాంతం ..చేతకావిలే రాద్ధాంతం  

చేతకాని వేదాంతం ..చేతకావిలే రాద్ధాంతం 

చలరేగింది నాటికీ..శ్రమజీవన సిద్ధంతం 

చలరేగింది నాటికీ..శ్రమజీవన సిద్ధంతం 


పుణ్యాత్ములు కనిపించరు..పునాదులు కనిపించవు

పుణ్యాత్ములు కనిపించరు..పునాదులు కనిపించవు

అనాదిగా కలవాళ్ళకు..లేనివారు వినిపించరు 

అనాదిగా కలవాళ్ళకు..లేనివారు వినిపించరు 


జానెడుపొట్టకోసం..సర్కస్ చేసే మృగాలు

వెట్టిచాకిరికోసం..పుట్టిన ఏడుపు ముఖాలు


పేదల నెత్తుటి విందులు..మెక్కే రాబందువులు


పెరుగుట విరుగుటకొరకు..ఎరుగరు ధనమధాంధులు 


పేదలబతుకులు..ఎంగిలిమెతుకులని తెలుసుకో

ఆ ఎంగిలిమింగే..పెద్దల బతుకులు తలుచుకో తల వంచుకో 


పేదలకోపం పెదవికి చేటని తెలుసుకో..

ఆ పేదలకోపం మీకేశాపమని తెలుసుకో

కళ్ళు తెరుచుకో..కళ్ళు తెరుచుకో 


seetaaraamulu--1980

sangeetam::satyam

rachana::vEToori

gaanam::`S.P.`baalu,`P.`suSeela.

taaraagaNam::kRshNam^raaju,jayaprada,gummaDi,alluraamalingayya,mOhan^baabu, jayamaalini.   


pallavi::


rangurangubillA..rupaayibiLLa

khangumanTE..karigEnukaalam

taddittaLaangumaTE..tirigEnulOkam 


rangurangubillA..rupaayibiLLa

khangumanTE..karigEnukaalam

taddittaLaangumaTE..tirigEnulOkam


Sivarupaaya vishNuroopaaya..annadivEdam

rupaaya poojinchanidE..batakadeelOkam

lOkaaniki peddadikku..vunnavaaDE swargaaniki 

modaTimeTTu kalavaaDE 


lOkaaniki peddadikku..vunnavaaDE swargaaniki 

modaTimeTTu kalavaaDE  


rupaayala rupaayi..navavEdam vinapinchaku

rupaayala rupaayi..navavEdam vinapinchaku

Siva vishNuvu iddarikii..kottartham kalpinchaku


Siva vishNuvu iddarikii..kottartham kalpinchaku


hE hE hE..DabbulEnivaaDu..Dabbukaina koragaaDu

Dabbukaina koragaaDu..

kaasulEnivaaDu..vaDDiikaasulavaaDE lEDu

vaDDiikaasulavaaDE lEDu


Sreemantula chinadaanaa..siri anTE guNamanTa

adi pEdala dhanamanTa..A siri meekEdanTa 

O..matilEni kalavaari Sreematii.. 


rangurangubillA..rupaayibiLLa

khangumanTE..kalavaarilOkam 

taddittaLaangumandi..Sramajeeviraajyam

taddittaLaangumandi..Sramajeeviraajyam 


`no money is the honey of the life ` 


 ii kaasulE niraakaasulu..kalavaaLLaku tirakaasulu

 ii kaasulE niraakaasulu..kalavaaLLaku tirakaasulu 

Akali kEkalamookalu..tOkalElEni kOtulu  

Akali kEkalamookalu..tOkalElEni kOtulu  


kannavaaLLa kannaaveeLLu..challanivaaLLu  

vunnavaaLLabajaarulO..chellanivaaLLu

chEtakaani vEdaantam ..chEtakaavilE raaddhaantam  

chEtakaani vEdaantam ..chEtakaavilE raaddhaantam 

chalarEgindi naaTikii..Sramajeevana siddhantam 

chalarEgindi naaTikii..Sramajeevana siddhantam 


puNyaatmulu kanipincharu..punaadulu kanipinchavu

puNyaatmulu kanipincharu..punaadulu kanipinchavu

anaadigaa kalavaaLLaku..lEnivaaru vinipincharu 

anaadigaa kalavaaLLaku..lEnivaaru vinipincharu 


jaaneDupoTTakOsam..sarkas chEsE mRgaalu

veTTichaakirikOsam..puTTina EDupu mukhaalu


pEdala nettuTi vindulu..mekkE raabanduvulu


peruguTa viruguTakoraku..erugaru dhanamadhaandhulu 


pEdalabatukulu..engilimetukulani telusukO

A engilimingE..peddala batukulu taluchukO tala vanchukO 


pEdalakOpam pedaviki chETani telusukO..

A pEdalakOpam meekESaapamani telusukO

kaLLu teruchukO..kaLLu teruchukO 


Tuesday, November 23, 2021

భార్యాభర్థలు--1961

                                                                                    








సంగీతం::S.రాజేశ్వరరావు

రచన::కోసరాజు

గానం::మాధవపెద్ది స్వర్ణలత

తారాగనం::ANR క్రిష్ణకుమారి,రేలంగి,గుమ్మడి,పద్మనాభం,గిరిజ,సూర్యకాంతం,హేమలత,రమణారెడ్డి,నిర్మలమ్మ,సంధ్యా,జయంతి.


పల్లవి::


కనకమా చిట్టికనకమా

ముద్దుకనకమా,నామాటవినుమా

మనము కలిసిమెలసుంటే అప్పీలు లేవుసుమా

కనకమా చిట్టి కనకమా,నామాటవినుమా

కనకమా చిట్టికనకమా

ముద్దుకనకమా,నామాటవినుమా


చరణం::1


కలసిమెలసి ఉన్నందుకేగా

నీవు కరుణ జూపించావు బాగా

కల్లాకపటం లేని నా తండ్రిని క్ష్2

వేటాడి వేధించి వెళ్ళగొట్టావుగా క్ష్2


కనకమా చిట్టికనకమా

ముద్దుకనకమా,నామాటవినుమా


చరణం::2


ఆలుమగలకు మధ్య చూడు

మామ అడ్డముంటే ఏంతోగోడు


ఆలుమగలకు మధ్య చూడు

మామ అడ్డముంటే ఏంతోగోడు

ఆనందముగ మనము అనుభవించాలంటే క్ష్2

అడుగడుగునా మనకు గుడిబండ అయినాడు


కనకమా చిట్టికనకమా

ముద్దుకనకమా,నామాటవినుమా 


Bhaaryaabharthalu--1961

sangeetam::`S`.raajESwararaavu

rachana::kOsaraaju

gaanam::maadhavapeddi swarNalata

taaraaganam::`ANR` krishNakumaari,rElangi,gummaDi,padmanaabham,girija,sooryakaantam,hEmalata,ramaNaareDDi,nirmalamma,sandhyaa,jayanti.


pallavi::


kanakamaa chiTTikanakamaa

muddukanakamaa,naamaaTavinumaa

manamu kalisimelasunTE appiilu lEvusumaa

kanakamaa chiTTi kanakamaa,naamaaTavinumaa

kanakamaa chiTTikanakamaa

muddukanakamaa,naamaaTavinumaa


charaNam::1


kalasimelasi unnandukEgaa

neevu karuNa joopinchaavu baagaa

kallaakapaTam lEni naa tanDrini x2

vETaaDi vEdhinchi veLLagoTTaavugaa x2


kanakamaa chiTTikanakamaa

muddukanakamaa,naamaaTavinumaa


charaNam::2


Alumagalaku madhya chooDu

maama aDDamunTE EntOgODu


Alumagalaku madhya chooDu

maama aDDamunTE EntOgODu

Anandamuga manamu anubhavinchaalanTE x2

aDugaDugunaa manaku guDibanDa ayinaaDu


kanakamaa chiTTikanakamaa

muddukanakamaa,naamaaTavinumaa 

Monday, November 01, 2021

రుణానుబంధం--1960

 



సంగీతం::ఆదినారాయణరావు

rachana::కొసరాజు

గానం::P.B.శ్రీనివాస్, P.సుశీల


pallavi::


ఓఓఓఓఓఓ....ఓఓఓఓ

ఓఓఓఓఓఓ....ఓఓఓఓ

ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ

ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి

ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ

ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి అమ్మీ


అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్

ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ 

అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్

ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ అన్నా


charaNam::1


ఓఓ పొద్దు పొడుపుటెండ అదర కాసే

చద్ది బువ్వ మూట ఎదురు చూసే

ఓఓ ఇసిరి ఇసిరి వారు గాలి వీసే

ఇగిరి ఇగిరి నేల నెర్రెలేసే

తడుపు బాగ పడాలోయ్

తలపులున్ని బాగ పండాలోయ్

ఓరన్నా.. ఓలమ్మీ.. ఔనా..

ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ

ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి అమ్మీ

అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్

ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ అన్నా


charaNam::2


ఓఓ కోడి కూతతోనే మేలుకుందాం

కాయా కసరు పైరు చేసుకుందాం

ఓఓ ఒళ్ళు వొంచి పాటు చేసుకుందాం

ఒకరికింద లొంగకుండ ఉందాం

దిగులు మాసి తిరుగుదాం

మగసిరిగా బతుకుదాం

ఓరన్నా..ఓలమ్మీ..ఔనా..aa..aa..

ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ

ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి అమ్మీ


అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్

ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ అన్నా


`Runaanubandham--1960

sageetam:Adinaaraayanaraavu

rachana::kosaraaju

gaanam::P.B.Sreenivaas Rao,P.Suseela


pallavi::


OOOOOO....OOOO

OOOOOO....OOOO

ehE ehE ohOM ohOm neeLLu tODaalii

E maDavalanni maarchi maarchi maLLu kaTTaali

ehE ehE ohOM ohOm neeLLu tODaalii

E maDavalanni maarchi maarchi maLLu kaTTaali..ammii


ahaam ahaam iiDE iiDE tODu unnaanOy

E bOdelannii baaroo chEsi maluputunnaanOy 

ahaam ahaam iiDE iiDE tODu unnaanOy

E bOdelannii baaroo chEsi maluputunnaanOy..annaa


charanam::1


OO poddu poDupuTenDa adara kaasE

chaddi buvva mooTa eduru choosE

OO isiri isiri vaaru gaali veesE

igiri igiri nEla nerrelEsE

taDupu baaga paDaalOy

talapulanni baaga panDaalOy

Orannaa.. Olammii..aunaa


ehE ehE ohOm ohOm neeLLu tODaalii

E maDavalanni maarchi maarchi maLLu kaTTaali ammii

ahaam ahaam iiDE iiDE tODu unnaanOy

E bOdelannii baaroo chEsi maluputunnaanOy annaa


charanam::2


OO kODi kootatOnE mElukundaam

kaayaa kasaru pairu chEsukundaam

OO OLLu vonchi paaTu chEsukondaam 

OO okarikinda longakunDa undaam

digulu maasi tirugudaam

magasirigaa batukudaam

Orannaa..Olammii..aunaa..aa..aa

ehE ehE ohOm ohOm neeLLu tODaalii

E maDavalanni maarchi maarchi maLLu kaTTaali ammii


ahaam ahaam iiDE iiDE tODu unnaanOy

E bOdelannii baaroo chEsi maluputunnaanOy annaa `


Tuesday, September 10, 2019

జీవనలీల--1979

 



సంగీతం::హరిరాం

రచన::C.నారాయణరెడ్డిగారు

గానం::S.P.బాలు,వాణీజయరాం 

తారాగణం::విశ్వనాథ్,శ్రీసత్య,C.రామ్మొహన్‌రావు,సూర్యప్రకాష్‌రావు,జయకుమార్,సునీతాదేవి,సుధ. 


పల్లవి::


మాధవీ..పూలరాగాలలో..గాలి ఉయ్యాలలో..తేలిపోదాములే..ఇలా ఇలా ఇలా..ఆహా..లలలలలలలా..


మాధవీ..పూలరాగాలలో..గాలి ఉయ్యాలలో..తేలిపోదాములే..ఇలా ఇలా ఇలా..ఆ..ఆఆఆఆఆ..


చరణం::1


మొగిలిలోని నీలి సొగసే..కనులలోనే ఉందనీ..

కడలిలోని పొంగులన్నీ..తనువులోనే ఉన్నవని..

పూచెనులే నా మనసే..పున్నమిలా..ఇలా ఇలా ఇలా..

పూలరాగలలో..గాలి ఉయ్యాలలో..

తేలిపోదాములె..ఇలా ఇలా ఇలా....


చరణం::2


పరువమేమి ఏమి పలికే..తరుణమిదియే రమ్మనీ..

హౄదయమేమి ఏమి పిలుపే..పెదవికేలా బిడియమని

పలికెనులే..తొలివలపే..పల్లవిలా..ఇలా ఇలా ఇలా..

ఆహహహహా..లలలల..ఓహొ ఓహోహోహో..లాలలలలల..లాల్లలాలలలా..లలా లలా లలా..


Jeevanaleela--1979

Music::hariraam

Lyrics::C.NaaraayaNaReddi 

gaanam::S.P.baalu,vaaNeejayaraam 

taaraagaNam::viSwanaath,Sreesatya,C.raammohan^raavu,sooryaprakaash^raavu,jayakumaar,suneetaadEvi,sudha. 


::::::::::::::::::::::::::::::::


maadhavee..poolaraagaalalO..gaali uyyaalalO..tElipOdaamulE..ilaa ilaa ilaa..aahaa..lalalalalalalaa..


maadhavee..poolaraagaalalO..gaali uyyaalalO..tElipOdaamulE..ilaa ilaa ilaa..aa..aaaaaaaaaaaaaa..


::::1


mogililOni neeli sogasE..kanulalOnE undanee..

kaDalilOni pongulannii..tanuvulOnE unnavani..

poochenulE naa manasE..punnamilaa..ilaa ilaa ilaa..

poolaraagalalO..gaali uyyaalalO..

tElipOdaamule..ilaa ilaa ilaa....


::::2


paruvamEmi Emi palikE..taruNamidiyE rammanii..

hRudayamEmi Emi pilupE..pedavikElaa biDiyamani

palikenulE..tolivalapE..pallavilaa..ilaa ilaa ilaa..

aahahahahaa..lalalala..Oho OhOhOhO..laalalalalala..laallalaalalalaa..lalaa lalaa lalaa..

Wednesday, November 21, 2018

బంగారు కొడుకు--1982

 




సంగీతం::K.చక్రవర్తి 

రచన::రాజశ్రీ

గానం::S.P.బాలు,P.సుశీల 

తారాగణం::కృష్ణ, శ్రీదేవి,సత్యనారాయణ,


పల్లవి::


గిల్లి గిల్లి చెప్పనా..ఆ..ఇది కల కాదని

మళ్ళి మళ్ళి చెప్పనా..ఆ..ఇది కథ కాదని


 గిల్లి గిల్లి చెప్పనా..ఆ..ఇది కల కాదని

మళ్ళి మళ్ళి చెప్పనా..ఆ..ఇది కథ కాదని

ఊగే మనసు ఉరికే వయసు..కలిసే వేళలోన

నీలో నిండిపోనా..


గిల్లి గిల్లి చెప్పనా..ఆ..ఇది కల కాదని

మళ్ళి మళ్ళి చెప్పనా..ఆ..ఇది కథ కాదని


చరణం::1


ఆడే ఊసులాడే చిందులాడే సోగకళ్ళు

చేసే బాస చేసే నాకు వేసే ప్రేమ సంకెళ్ళు

ఆడే ఊసులాడే చిందులాడే సోగకళ్ళు

చేసే బాస చేసే నాకు వేసే ప్రేమ సంకెళ్ళు

నీ తలపు పూలవిల్లు..నీ పిలుపు తేనె జల్లు..తొలకరి కేరింతలూ..తరగని కవ్వితలూ..

నువ్వునేను నవ్వుల్లోన తరిగే వేళలోన..నీలో నిండిపోనా..


గిల్లి గిల్లి చెప్పనా..ఆ..ఇది కల కాదని

మళ్ళి మళ్ళి చెప్పనా..ఆ..ఇది 


చరణం::2


ఏదో వింత వింత పులకరింతా..రేగె నాలోనా 

తొణికే ఆశలోనా రాగవీణా..మ్రోగె లోలోనా 

  

ఏదో వింత వింత పులకరింతా..రేగె నాలోనా 

తొణికే ఆశలోనా రాగవీణా..మ్రోగె లోలోనా 

తొలివలపు గాలి వీచే..ఎదలోన ప్రేమ పూచే..గడసరి చిరునవ్వులూ..తెలిపెను నీ ఊహలూ..

పగలు రేయి తోడునీడై..మురిసే వేళలోన..నీలో నిండిపోనా..


గిల్లి గిల్లి చెప్పనా..ఆ..ఇది కల కాదని

మళ్ళి మళ్ళి చెప్పనా..ఆ..ఇది కథ కాదని


ఊగే మనసు ఉరికే వయసు..కలిసే వేళలోన

నీలో నిండిపోనా..


గిల్లి గిల్లి చెప్పనా..ఆ..ఇది కల కాదని

మళ్ళి మళ్ళి చెప్పనా..ఆ..ఇది కథ కాదని


Bangaaru KoDuku--1982

music:K.chakravarti 

Lyrics::raajaSree

Singer;s::S.P.బాలుP.suSeela 

Cast::kRshNa, SreedEvi,satyanaaraayaNa,


:::::::::::::::::::::::::::::::::::


gilli gilli cheppanaa..aa..idi kala kaadani

maLLi maLLi cheppanaa..aa..idi katha kaadani

 

gilli gilli cheppanaa..aa..idi kala kaadani

maLLi maLLi cheppanaa..aa..idi katha kaadani


UgE manasu urikE vayasu..kalisE vELalOna

neelO ninDipOnaa..


gilli gilli cheppanaa..aa..idi kala kaadani

maLLi maLLi cheppanaa..aa..idi katha kaadani


::::1


ADE UsulaaDE chindulaaDE sOgakaLLu

chEsE baasa chEsE naaku vEsE prEma sankeLLu

ADE UsulaaDE chindulaaDE sOgakaLLu

chEsE baasa chEsE naaku vEsE prEma sankeLLu

nee talapu poolavillu..nee pilupu tEne jallu..tolakari kErintaluu..taragani kavvitaluu..

nuvvunEnu navvullOna tarigE vELalOna..neelO ninDipOnaa..


gilli gilli cheppanaa..aa..idi kala kaadani

maLLi maLLi cheppanaa..aa..idi katha kaadani


::::2


EdO vinta vinta pulakarintaa..rEge naalOnaa 

toNikE ASalOnaa raagaveeNaa..mrOge lOlOnaa 

  

EdO vinta vinta pulakarintaa..rEge naalOnaa 

toNikE ASalOnaa raagaveeNaa..mrOge lOlOnaa 

tolivalapu gaali veechE..edalOna prEma poochE..gaDasari chirunavvuloo..telipenu nee Uhaloo..

pagalu rEyi tODuneeDai..murisE vELalOna..neelO ninDipOnaa..


gilli gilli cheppanaa..aa..idi kala kaadani

maLLi maLLi cheppanaa..aa..idi katha kaadani


UgE manasu urikE vayasu..kalisE vELalOna

neelO ninDipOnaa..


gilli gilli cheppanaa..aa..idi kala kaadani

maLLi maLLi cheppanaa..aa..idi katha kaadani  

Thursday, October 11, 2018

కుటుంబ బంధం--1985

 


కుటుంబ బంధం--1985

సంగీతం::సత్యం

రచన::గోపి

గానం::S.P.బాలు,P.సుశీల 

తారాగణం::భానుప్రియ,రాజేష్,అంజలిదేవి,ప్రభాకర్‌రెడ్డి,రాజ్యలక్ష్మీ,జయవాణి,జగ్గారావు,వెంకట్,మాడ,బేబిరాణి,బేబిశ్రీదేవి

పల్లవి::


ఎన్నో ఏళ్ళకు మళ్ళి వెన్నల..కురిసే రాతిరి

చేసిన బాసలు ఇద్దరి మదిలో..మెదిలే రాతిరి

ఆగిపో జాబిలీ..చేరనీ కౌగిలి.. 


ఆగిపో జాబిలీ..చేరనీ కౌగిలీ..

ఎన్నో ఏళ్ళకు మళ్ళి వెన్నల..కురిసే రాతిరి

చేసిన బాసలు ఇద్దరి మదిలో..మెదిలే రాతిరి

తానని తన్నన్నా తానాని తన్నన్నా..తానాని తనననన్నా..


చరణం::1


ఒకనాడు నీజతలో..పులకించి పాడాను

ఇన్నాళ్ళు అది తలచీ..విరహాన వేగానూ


నీ నిండు కౌగిలిలో..నను నేను మరిచాను

నువ్నిండి పడకింటా..నే మూగ పోయాను


క్షణము యుగముగా వేచేనూ..బ్రతుకు బరువుగా తోచేను..

క్షణము యుగముగా వేచేనూ..బ్రతుకు బరువుగా తోచేను..


ఎన్నో ఏళ్ళకు మళ్ళి వెన్నల..కురిసే రాతిరి

చేసిన బాసలు ఇద్దరి మదిలో..మెదిలే రాతిరి

రామనా తందనాలో...


చరణం::2


తొలిరేయి రావాలీ..నా ఎదను వినిపించే

నీ కంటి లాలనలే..నా మనసు ఓదార్చే..


ఈ నాటి కలయికలో..నా ఆశ చిగురించే..

నాదేవి సన్నిధిలో..నా కలత మరపించే..


కలలు పండినవి ఈవేళా..చెలియ కనులలో నీరేలా..

కలలు పండినవి ఈవేళా..చెలియ కనులలో నీరేలా.


ఎన్నో ఏళ్ళకు మళ్ళి వెన్నల..కురిసే రాతిరి

చేసిన బాసలు ఇద్దరి మదిలో..మెదిలే రాతిరి

ఆగిపో జాబిలీ..చేరనీ కౌగిలి..ఆఆఆ  

ఆగిపో జాబిలీ..చేరనీ..హాహా..కౌగిలీ..


Kutumbha bandham--1985

Music::Satyam

Lyrics::Gopi

Singer;s::S.P.Baalu,P.Suseela. 

Cast::bhaanupriya,raajEsh,anjalidEvi,prabhaakar^reDDi,raajyalakshmii,jayavaaNi,jaggaaraavu,venkaT,maaDa,bEbiraaNi,bEbiSreedEvi. 


::::::::::::::::::::::::::


ennO ELLaku maLLi vennala..kurisE raatiri

chEsina baasalu iddari madilO..medilE raatiri

AgipO jaabilee..chEranii kougili.. 


AgipO jaabilee..chEranee kougilii..

ennO ELLaku maLLi vennala..kurisE raatiri

chEsina baasalu iddari madilO..medilE raatiri

taanani tannannaa taanaani tannannaa..taanaani tanananannaa..


::::1


okanaaDu neejatalO..pulakinchi paaDaanu

innaaLLu adi talachii..virahaana vEgaanuu


nee ninDu kougililO..nanu nEnu marichaanu

nuvninDi paDakinTaa..nE mooga pOyaanu


kshaNamu yugamugaa vEchEnuu..bratuku baruvugaa tOchEnu..

kshaNamu yugamugaa vEchEnuu..bratuku baruvugaa tOchEnu..


ennO ELLaku maLLi vennala..kurisE raatiri

chEsina baasalu iddari madilO..medilE raatiri

raamanaa tandanaalO...


::::2


tolirEyi raavaalii..naa edanu vinipinchE

nee kanTi laalanalE..naa manasu OdaarchE..


I naaTi kalayikalO..naa ASa chigurinchE..

naadEvi sannidhilO..naa kalata marapinchE..


kalalu panDinavi iivELaa..cheliya kanulalO neerElaa..

kalalu panDinavi iivELaa..cheliya kanulalO neerElaa.



ennO ELLaku maLLi vennala..kurisE raatiri

chEsina baasalu iddari madilO..medilE raatiri

AgipO jaabilee..chEranii kougili..aaaaaaaa  

AgipO jaabilee..chEranee..haahaa..kougilii.. 

Thursday, October 12, 2017

కోకిలమ్మ--1983



సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::ఆచార్య -  ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::K.Bala Chander
తారాగణం::రాజివ్,సంజయ్,సరిత,స్వప్న

పల్లవి::

నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
తీయ్యగా హాయిగా..మెత్తగా మత్తుగా

నీలో మమతల..తరంగం
నాలో పలికెను..మృదంగం
నీలో మమతల..తరంగం
నాలో పలికెను..మృదంగం
జతులుగా..గతులుగా
లయలుగా..హొయలుగా

చరణం::1

కనులకు వెలుగైనా..కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనులకు వెలుగైనా..కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తలపులనైనా మరపులనైనా
నీవే..నా రూపుగా..ఆ ఆ ఆ ఆ
తలపులనైనా..మరపులనైనా
నీవే...నా రూపుగా..ఆ ఆ ఆ ఆ
వయసుకే..మనసుగా
మనసుకే..సొగసుగా

నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
తీయ్యగా హాయిగా..మెత్తగా మత్తుగా

చరణం::2

మల్లెలజల్లేలా..వెన్నెల నవ్వేలా
మదిలో నీవుండగా..ఆ ఆ ఆ ఆ ఆ 
మల్లెలజల్లేలా..వెన్నెల నవ్వెలా
మదిలో..నీవుండగా..ఆ ఆ ఆ 
కోవెల ఏలా..దైవము ఏలా
ఎదటే నీవుండగా..ఆ ఆ ఆ ..ఆ హా 
కోవెల ఏలా..దైవము ఏలా
ఎదటే నీవుండగా..నేనుగా నేనుగా
వేరుగా..లేముగా..ఆ ఆ ఆ ఆ

నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా..ఆ..గతులుగా
లయలుగా..ఆ..హొయలుగా
నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
తీయ్యగా..ఆ..హాయిగా
మెత్తగా..ఆ..మత్తుగా

Kokilammaa--1983
Music::M.S.Viswanaatan
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Bala Chander
Cast::Rajiv,Sanjay,Sarita,Swapna..

:::::::::::::::::::::::::::::::::

neelO valapula..sugandam
naalO chilikenu..marandham
neelO valapula..sugandam
naalO chilikenu..marandham
teeyyagaa haayigaa..mettagaa mattugaa

neelO mamatala..tarangam
naalO palikenu..mRdangam
neelO mamatala..tarangam
naalO palikenu..mRdangam
jatulugaa..gatulugaa
layalugaa..hoyalugaa

::::1

kanulaku velugainaa..kalalaku viluvainaa
neevE naa choopugaa..aa aa aa aa aa aa
kanulaku velugainaa..kalalaku viluvainaa
neevE naa choopugaa..aa aa aa aa aa aa

talapulanainaa marapulanainaa
neevE..naa roopugaa..aa aa aa aa
talapulanainaa..marapulanainaa
neevE...naa roopugaa..aa aa aa aa
vayasukE..manasugaa
manasukE..sogasugaa

neelO valapula..sugandham
naalO chilikenu..marandham
teeyyagaa haayigaa..mettagaa mattugaa

::::2

mallelajallElaa..vennela navvElaa
madilO neevunDagaa..aa aa aa aa aa 
mallelajallElaa..vennela navvElaa
madilO..neevunDagaa..aa aa aa 
kOvela Elaa..daivamu Elaa
edaTE neevunDagaa..aa aa aa ..aa haa 
kOvela Elaa..daivamu Elaa
edaTE neevunDagaa..nEnugaa nEnugaa
vErugaa..lEmugaa..aa aa aa aa

neelO mamatala tarangam
naalO palikenu mRdangam
jatulugaa..aa..gatulugaa
layalugaa..aa..hoyalugaa
neelO valapula..sugandham
naalO chilikenu..marandham
teeyyagaa..aa..haayigaa
mettagaa..aa..mattugaa

Friday, September 29, 2017

గడసరి అత్త సొగసరి కోడలు--1981



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::భానుమతి

పల్లవి::

శ్రీ గౌరీ వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ 

చరణం::1

సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే 
నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి 
సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే 
నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి
ముంజేతి చిలుక ముద్దాడ పలుకా
దీవించవే మమ్ము మా భారతీ 
సకల శుభంకరి విలయ లయంకరి 
శంకర చిత్త వశంకరి శంకరి 
సౌందర్య లహరి శివానంద లహరీ 

శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ 

చరణం::2

ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి 
కల్పవల్లి గౌరి కాపాడవే 
ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి 
కల్పవల్లి గౌరి కాపాడవే 
మా ఇంట కొలువై మము బ్రోవవే 
పసుపు నిగ్గుల తల్లి మా పార్వతీ 
ఆగమ రూపిణి అరుణ వినోదిని 
అభయమిచ్చి కరుణించవె శంకరి 
సౌందర్య లహరి శివానంద లహరీ 

శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ