Friday, July 22, 2022

సీతాకల్యాణం--1976



సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B.శ్రీనివాస్,S.P.బాలు,

B.వసంత,బ్రుందం.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


జానకి రాముల కలిపే విల్లు..జనకుని ఇంటనె ఉన్నది

ఈ యింటికి ఆ వింటికి..ఘనమగు కథ యొకటున్నది..ఈ


తారకాసురుని తనయులు..ముగ్గురు దారుణ బలయుతులు..ఊఉ 

విపరీతమ్మగు వరములు పొంది..కట్టిరి త్రిపురములు


ఆ కోటల చుట్టూ పెట్టిరి..ఎన్నో రక్కసి రక్షణలు..ఊ

ఎదురు లేదని చెలరేగిరి..ఆ త్రిలోక కంటకులు..

దారుణ హింసలు తాళజాలక..తల్లడిల్లి సురలు

హిమాలయమ్మున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు


సర్వదేవమయ సర్వమహేశ్వర..శరణు శరణు శరణు

శత్రుభయంకర పాపలయంకర..శరణు శరణు శరణు

పాహిమాం..పాహిమాం..పాహిమాం..

గర్వాంధులు ఆ త్రిపురాసురుల..కడతేర్ప నిదే అదను

పాహిమాం..పాహిమాం..పాహిమాం..పాహిమా..


పాహిమాం..పాహిమాం..పాహిమాం..పాహిమాం..

మేరు పర్వతము వింటిబద్దగా..ఆ

ఆదిశేషుడే వింటి నారిగా..నలువరాణియే వింటి గంటగా

నారాయణుడే వింటి శరముగా..అమరెను శివునికి విల్లు

అసురుల ఆయువు చెల్లు..అమరెను శివునికి విల్లు

అసురుల ఆయువు చెల్లు..


చండ ప్రచండ అఖండ బలుండగు

గండరగండడు శివుడు..కొండరథముపై కొండవింటితో

దండిమగల చెండాడె..దండిమగల చెండాడె..ఏఏ


సీతాకల్యాణం--1976

 




సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,రమోల, 

B.వసంత.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


సీతమ్మకు సింగారం చేతాము రారమ్మా

సీతమ్మకు సింగారం చేతాము రారమ్మా 

సిరితల్లి ముచ్చటలు చూతాము రారమ్మ 

రారమ్మా..ఆ..రారమ్మా..ఆ

రారమ్మా..ఆ..రారమ్మా..ఆ 


చరణం::1


దువ్వకముందే దువ్వినరీతి తోచె నల్లని కురులు 

అందు తురుముటకోసం నోములు నోచును 

తోటలోని విరులు

నీలవర్ణుడు నిండిన కనులకు..కాటుక ఏలమ్మా

నీలవర్ణుడు నిండిన కనులకు..కాటుక ఏలమ్మా

ఫాలభాగమున దిద్దిన తిలకము..బాలభానుడే అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా


చరణం::2


ఒక్కా ఓ చెలియా రెండూ రేవన్నా

మూడు ముచ్చిలుక నాలుగు నందన్నా..ఆ

ఐదుం చిట్టిగొలుసు ఆరుం జవ్వాది

ఏడుం వేడుకలు ఎనిమిది ఎలమంద

తొమ్మిది తోకుచ్చు..పదీ పట్టెడ..చెంగనాలో చెంగనాలు..చెంగనాలో..చెంగనాలు..హా హా హా


చరణం::3


ఆటలలోన హరినే తలచి మనలోకంలో వుండదు

పంటలవేళ పరాకువల్ల పడతి జానకి పండదు

చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మా మూసేదీ

చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మా మూసేదీ

సైయ్యా..ఆ.. సై.. దాగిన వారిని వెదకదు సీతా ఎల్లాగమ్మా ఆడేదీ


అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

చరణం::4

బంతుల ఆటకు ఇంతీరావే..ఏఏ..ఇదిగో బంతి పూలబంతీ

ఇదిగో సన్నజాజి బంతీ..ఈ.. ఇదిగో మల్లెపూల బంతీ..ఈఈ..ఇదిగో కలువపూల బంటీ..హా హా హా 

చెలికత్తెలు విరబంతులు రువ్వ..ఆఅ..చిరునవ్వులు రువ్వును సీతమ్మా..ఆ

ఆదిలక్ష్మికి పూవుల పూజలు అలవాటే కద ఔనమ్మా..

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా

అవునమ్మా..ఆ ఆ ఆ..అవునమ్మా 

Tuesday, July 19, 2022

సీతాకల్యాణం--1976

 




సంగీతం::K.V.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

వసంత,రామకృష్ణ,S.P.బాలసుబ్రమణ్యం 

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


పరమ పావనమైన శ్రీ పాదము

పాషాణమున కొసగి స్త్రీ రూపము

పతితపావనమైన యీ పాదము

సతిపతుల కలిపినది కలకాలము

జగమేల గల మేటి మగరాయడు

హరుని విల్లును వంచు సిరకన్నె వరియించు

హరిలాగ వున్నాడు ఎవరీతడూ ఎవరీతడూ,ఎవరీతడూ.


ఈ పాదమందే పుట్టినది

ఎల్లపాపాలు హరియించు గంగానది

ఈ పాదమిప్పుడు మెట్టినది

కడు ఇంపైన సొంపైన మిథిలాపురి

ఆజానుబాహువులు రాజీవనేత్రాలు

అందాల అరుణాబ్జ చరణాలు

ఎగు భుజమ్ములవాడు నగుమోము కలవాడు

జగమేలగల మేటి మగరాయడు

హరుని విల్లును వంచు సిరకన్నె వరియించు

హరిలాగ వున్నాడు ఎవరీతడు


చరణం::1 


రాముని సొగసులు పువ్వులు అయితే

పౌరుల చూపులు తుమ్మెదలు..వాలిన చోటున వీడగలేవు

మధుర మధురమా సుధలూ..పదములు అందం చూసే చూపు

పదముల నుండి కదలవులే..పెదవుల నవ్వు చూసే చూపు

పెదవుల వదలీ కదలదులే

రాముని అందం మకరందం 

రసమయమైనది ప్రతిబింభం

రాముని అందం మకరందం

రసమయమైనది ప్రతిబింభం 

రాముని చరణం అరవిందం 

కొలచిన చాలును ఆనందం


సీతాకల్యాణం--1976

 




సంగీతం::KV..మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::


సీతమ్మ విహరించు పూదోటకు 

మధుమాస మెపుడో వచ్చింది

కాని మరలా వచ్చింది..సరికొత్త ఆమని

రామయ్య అటు అడుగు పెట్టాడని


గోరింక పిలిచింది రాచిలుకని

కోరి చూపించింది రామయ్యని

చిలకమ్మ పిలిచింది సీతమ్మని

చేయెత్తి చూపింది రామయ్యని

బిడియపడి చూసింది సీతమ్మ


కడగంట చూశాడు రామయ్య

ఆ రెండుచూపులూ ఒకసారి కలిసె

అతిలోక ప్రణయాలు అందులో వెలసె


విరితోట గడిచాడు రామయ్య

విడలేక నడిచింది సీతమ్మ

ఎవరేని రామయ్య పేరెత్తినా

సీతమ్మ నిలువెల్ల పులకింతలే


సీతాకల్యాణం--1976




సంగీతం::కే.వి.మహాదేవన్

రచన::ఆరుద్ర 

Directed by..Baapu 

గానం::P.సుశీల,P.B. శ్రీనివాస్, 

వసంత,రామకృష్ణ.

తారాగణం:: రవికుమార్,గుమ్మడి,కాంతారావు,త్యాగరాజు,ధుళిపాళ,మిక్కిలినేని,K.సత్యనారాయణ,ముక్కామల,జయప్రద,హేమలత,జమున,P.R.వరలక్ష్మీ,మమత,


పల్లవి::

కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ

కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ


ఆకసమంత పందిరివేసి

భూదవంతాఅరుగును అలికి. .ఆఆ 

ఆకసమంత పందిరివేసి

భూదవంతాఅరుగును అలికి

ఆణిముత్యముల ముగ్గులు పెట్టి

ఆణిముత్యముల ముగ్గులు పెట్టి

అంగరంగ వైభోగ భరితమౌ 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::1 


పగడపు రోకలి బంగరు కట్లు

పసుపును దంచే పడతుల జట్లు

పగడపు రోకలి బంగరు కట్లు

పసుపును దంచే పడతుల జట్లు


పరిపరి విధముల కొట్నముదంచి

సువ్వి సువ్వి అని సుదతులు పాడే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::2


సంపెంగె నూనెల శిరసును అంటి

హరి చందనమే మేనున అలది

సంపెంగె నూనెల శిరసును అంటి

హరి చందనమే మేనున అలది

మణిపీఠముపై నలుగులుపెట్టి

మణిపీఠముపై నలుగులుపెట్టి

మంగళస్నానము చేసే రాముని 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::3


తీరుగ కస్తూరి తిలకము తీర్చి

తీరుగ కస్తూరి తిలకము తీర్చి

పాదాలకు పారాణిని పెట్టి

పాదాలకు పారాణిని పెట్టి

దిష్టిచుక్క బుగ్గను నిలిపి..దిష్టిచుక్క బుగ్గను నిలిపి 

పెళ్లికూతురై వెలసిన సీతా


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::4


వరుడు రాముడు..పురుషోత్తముడే

వధువు సీత..ఆ జగన్మాతయే

బ్రహ్మ కడిగిన పాదము కడిగే

కన్యాదాత..బ్రహ్మజ్ఞాని

ఇది నా పుత్రిక..సీత శుభాంగి

ఇటు చేపట్టగ..నీకు అర్థాంగి

నిత్యము నీతో నీడ విధాన

చరించ కలదని..జనకుడు పలికే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::5


తెల్లనిముత్యము లెర్రగమారి

ఎర్రనివేమో నీలములవుతూ

తడవ తడవకో రంగును దాల్చే

తడవ తడవకో రంగును దాల్చే

తలంబ్రాలు మది భ్రమింపజేసే 


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ


చరణం::6


చూచువారలకు శుభదాయకము

రక్తి భుక్తి ముక్తి దాయకము..ఆ ఆ ఆ ఆఅ

చూచువారలకు శుభదాయకము

రక్తి భుక్తి ముక్తి దాయకము

కామితార్థముల కల్పవృక్షము

కామితార్థముల కల్పవృక్షము 

కలకాలానికి నిరుపమానమౌ


కళ్యాణము చూతము రారండీ

శ్రీ సీతాము రారంరాముల కళ్యాణము చూతడీ