సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల,బృందం
సాకీ :
వీరభారతీయ పౌరులారా!..దేశమాత పిలుపు వినలేరా
పల్లవి ::
హిమాలయంలో మంటలురేగి ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం::1
అంతా స్నేహితులనుకున్నాము
అందరి మేలు ఆశించాము
అందరి మేలు ఆశించాము
పరుల మంచిపై నమ్మకముంచి
పగటికలలో జీవించాము
నే టికి కలిగెను కనువిప్పు
ముంచుకు వచ్చెను పెనుముప్పు
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం::2
వీరమాతలారా సుతులకు
చందన గంధం పూయండి
చందన గంధం పూయండి
వీరవనితలారా పతులకు
కుంకుమ తిలకం తీర్చండి
కుంకుమ తిలకం తీర్చండి
నెత్తురుపొంగే యువకుల్లారా కత్తులుదూసి దూకండి
బానిసతనమున బ్రతికేకన్న చావేమేలని తలచండి
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం::3
మనమంతా ఒకజాతి సమైక్యమే మననీతి
మనమంతా ఒకజాతి సమైక్యమే మననీతి
కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి
ధర్మదీక్షయే మన కవచం తప్పక మనదే ఘనవిజయం
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం::4
భరతమాత పరువు నిల్పగా ఆ..
భరత వీర ప్రతిన దాల్పరా ఆ..
జయపతాక చేతబూనరా ఆ..
సమర విజయశంఖమూదరా ఆ..
సమర విజయశంఖమూదరా ఆ..
No comments:
Post a Comment