Monday, September 30, 2013

మల్లీశ్వరి--1951::కాఫీ::రాగం
























సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::భానుమతి రామకృష్ణ
   
కాఫీ::రాగం 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ 
కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట
కోవెలతోట విడిదంట
కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట
కోవెలతోట విడిదంట

చరణం::1

మల్లి మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా
బంతులు కట్టి తెస్తారా
పెళ్ళికి మీరు వస్తారా పేరంటానికి వస్తారా
పందిరి వేస్తాము ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద పెళ్ళివారికి విందులు చేస్తాము
మంచి విందులు చేస్తాము
బాకా బాజా డోలు సన్నాయి 
బాకా బాజా డోలు సన్నాయి 
బాకా బాజా డోలు సన్నాయి మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు
తప్పెట తాళాలెడతారు

కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట
కోవెలతోట విడిదంట

చరణం::2

అందాల మా బావగారికి గంధాలు పూసి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ 
గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసి గంధం పూసి కుళాయేసి
తురాయి పెడతాము కుచ్చుల తురాయి పెడతాము
ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ పల్లకి ఎక్కి 
పల్లకి ఎక్కి కోతిబావ పల్లికిలిస్తాడు
బావ పల్లికిలిస్తాడు
మా కోతిబావ పల్లికిలిస్తాడు

కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట
కోవెలతోట విడిదంట

Friday, September 27, 2013

చిలకమ్మ చెప్పింది..1977














సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::రజనీకాంత్,నారాయణ రావు,శ్రీప్రియ, సంగీత, సీతాలత

కుర్రాడనుకుని కునుకులు తీసే 
హహ వెర్రిదానికీ..పిలుపూ

కుర్రాడనుకుని కునుకులు తీసే.. 
వెర్రిదానికీ పిలుపు..ఇదే నా మేలుకొలుపూ
కుర్రాడనుకుని కునుకులు తీసే.. 
వెర్రిదానికీ పిలుపు..ఇదే నా మేలుకొలుపూ..ఊ..

చరణం::1

మల్లెలు విరిసే..మధువులు కురిసే 
లేత సోయగమున్నది..నీకు
మల్లెలు విరిసే..మధువులు కురిసే 
లేత సోయగమున్నది..నీకు
దీపమంటీ రూపముంది
దీపమంటీ..ఈ..రూపముంది
కన్నె మనసే..చీకటి చేయకు
కన్నె మనసే..చీకటి చేయకు

కుర్రాడనుకుని కునుకులు తీసే.. 
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..

చరణం::2

మత్తును విడిచీ..మంచిని వలచీ
తీపికానుక రేపును తలచీ 
కళ్ళు తెరిచి..ఒళ్ళు తెలిసీ
మేలుకుంటే..మేలిక మనకూ
మేలుకుంటే..మేలిక మనకూ

కుర్రాడనుకుని కునుకులు తీసే
వెర్రిదానికీ పిలుపూ..ఇదే నా మేలుకొలుపూ..ఊ..

చరణం::3

వెన్నెల చిలికే వేణువు పలికే 
వేళ నీ కిది నా తొలిపలుకు
వెన్నెల చిలికే వేణువు పలికే 
వేళ నీ కిది నా తొలిపలుకు
మూగదైనా..రాగవీణ
మూగదైనా..రాగవీణ
పల్లవొకటే పాడును చివరకు
పల్లవొకటే పాడును చివరకు
హహహహ్...

కుర్రాడనుకుని కునుకులు తీసే 
వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలుకొలుపు


Chilakamma Cheppindi..1977
Music::M.S.Visvanaathan
Lyrics::Atreya
Singer's::S.P.Baalu 
Taaraaganam:::RajaneekaaNt ,Naaraayana raavu, Sreepriya, Sangeeta, Seetaalata

kurraaDanukuni kunukulu teesae 
haha verridaanikee..pilupoo

kurraadanukuni kunukulu teese
verridaanikee pilupoo..ide naa melukolupoo
kurraadanukuni kunukulu teese
verridaanikee pilupoo..ide naa melukolupoo..oo..

:::1

mallelu virise..madhuvulu kurise 
leta soyagamunnadi..neeku
mallelu virise..madhuvulu kurise 
leta soyagamunnadi..neeku
deepamantee roopamundi
deepamantee..ee..roopamundi
kanne manase..cheekati cheyaku
kanne manase..cheekati cheyaku

kurraadanukuni kunukulu teese
verridaanikee pilupoo..ide naa melukolupoo..oo..

:::2

mattunu vidichee..manchini valachee
teepikaanuka repunu talachee 
kallu terichi..ollu telisee
melukunte..melika manakoo
melukunte..melika manakoo

kurraadanukuni kunukulu teese
verridaanikee pilupoo..ide naa melukolupoo..oo..

:::3

vennela chilike venuvu palike 
vela nee kidi naa tolipaluku
vennela chilike venuvu palike 
vela nee kidi naa tolipaluku
moogadainaa..raagaveeNa
moogadainaa..raagaveeNa
pallavokaTe paadunu chivaraku
pallavokaTe paadunu chivaraku
hahahah...

kurraadanukuni kunukulu teese 
verridaaniki pilupu ide naa melukolupu

సంతానం--1955::షణ్ముఖప్రియ::రాగం
















సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి
రచన::అనిశెట్టి
గానం::ఘంటసాల

షణ్ముఖప్రియ::రాగం 

పల్లవి::

దేవి శ్రీదేవీ..దేవి శ్రీదేవీ
మొరలాలించి పాలించి నన్నేలినావే
దేవి శ్రీదేవీ
మొరలాలించి పాలించి నన్నేలినావే
దేవి శ్రీదేవీ..

చరణం::1

మదిలో నిన్నే..మరువను దేవీ
మదిలో నిన్నే..మరువను దేవీ
నీ నామ సంకీర్తనేజేసెద..దేవి శ్రీదేవీ
మొరలాలించి పాలించి నన్నేలినావే..దేవి శ్రీదేవీ..

చరణం::2 

నీకనుసన్నల..నిరతరము నన్నే
నీకనుసన్నల..నిరతరము నన్నే
హాయిగా..ఓలలాడించరావే
నీకనుసన్నల..నిరతరము నన్నే
హాయిగా ఓలలాడించరావే
ఇలదేవతగా..ఆఆఆఅ 
ఇలదేవతగా..వెలసితివీవే
ఇలదేవతగా..వెలసితివీవే
ఈడేరే..కోర్కిలీనాటికే..దేవి శ్రీదేవీ
మొరలాలించి పాలించి నన్నేలినావే..దేవి శ్రీదేవీ


Santaanam--1955
Music::Susarla DakshiNaamoorti
Lyrics::Anisetti
Singer's::Ghantasaala 

Shanmukhapriya::raga
:;::

devi Sreedevee..devi Sreedevee
moralaalinchi paalinchi nannelinaave
daevi Sreedaevee
moralaalinchi paalinchi nannelinaave
devi Sreedevee..

:::1

madilo ninne..maruvanu devee
madilo ninne..maruvanu devee
nee naama sankeertanejeseda..devi Sreedevee
moralaalinchi paalinchi nannelinaave..devi Sreedevee..

:::2 

neekanusannala..nirataramu nanne
neekanusannala..nirataramu nanne
haayigaa..olalaadincharaave
neekanusannala..nirataramu nanne
haayigaa olalaadincharaave
iladevatagaa..aaaaaaa 
iladevatagaa..velasitiveeve
iladevatagaa..velasitiveeve
eedere..korkileenaaTike..devi Sreedevee

moralaalinchi paalinchi nannelinaave..devi Sreedevee

సంసారం ఒక చదరంగం--1987




















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల 

తారాగణం::శరత్ బాబు,సుహాసిని,షావుకారు జానకి,

గొల్లపూడి మారుతీ రావు,అన్నపూర్ణ,రాజేంద్ర ప్రసాద్,అరుణ.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
జానకి రాముల కల్యాణానికి..జగమే ఊయలలూగెనులే

జానకి రాముల కల్యాణానికి..జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే..సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి..జగమే ఊయలలూగెనులే

చరణం::1

కన్ను కన్ను కలవగనే..ప్రణయం రాగం తీసెనులే
పాదం పాదం కలపగనే..హృదయం తాళం వేసెనులే

ఒకటే మాట..ఒకటే బాణం..ఒక పత్ని..శ్రీరామ వ్రతం
నాలో..ఓ..నీలో..ఓ..రాగం తీసి..వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే

చరణం::2

జానకి మేను తాకగనే..జళ్ళున వీణలు పొంగినవి
జాణకు పూతలు పూయగనే..జావళి అందెలు మ్రోగినవి

ప్రేమే సత్యం ప్రేమే నిత్యం..ప్రేమే లేదా మయ్యమతం
నాలో..ఓ..నీలో..ఓ..నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే

Monday, September 23, 2013

చిల్లర కొట్టు చిట్టెమ్మ--1977







సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::రమేష్ నాయుడు 

పల్లవి::

ఆఅహా..ఓ..ఓ..హ్హా..ఆ ఆ 
తల్లి గోదారికే..ఏ..ఆటు పోటుంటే
తప్పుతుందా మనిషికీ..తలరాత
తప్పుతుందా మనిషికీ
ఆ..హా..హా..  

చరణం::1

ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి..ఈ..
ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి
సీకటికి దడిసేదేమిటి..ఓ..మనసా
సీకటికి దడిసేదేమిటి..

తల్లి గోదారికే..ఆటు పోటుంటే
తప్పుతుందా మనిషికీ..తలరాత
తప్పుతుందా మనిషికీ
ఆ..హా..హో..

చరణం::2

భగ భగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా
భగ భగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా
ఆ సూర్యచంద్రులే అగచాట్లపాలైతే
తప్పుతుందా మనిషికీ..తలరాత
తప్పుతుందా మనిషికీ
ఆ..హ్హా..హో..

చరణం::3

అవతార పురుషుడు ఆ రామచంద్రుడు
అడవులపాలు కాలేదా
అంతటా తానైన గోపాల కృష్ణుడు
అపనిందలను మోయలేదా
అంతటి దేవుళ్ళే అగచాట్ల పాలైతే
తప్పుతుందా మనిషికీ..తలరాత
తప్పుతుందా మనిషికీ
ఆ..హ్హా..హా..

Chillara Kottu Chittemma--1977
Music::Ramaesh Naayudu
Lyrics::C.Naaraayana Reddi
Singer's::Ramaesh Naayudu

:::

aaahaa..O..O..hhaa..aa aa 
talli gOdaarike..e..aatu pOtunte
tapputundaa manishikee..talaraata
tapputundaa manishikee
aa..haa..haa..  

:::1

elugu enakaalane seekatundani telisi..ee..
elugu enakaalane seekatundani telisi
seekatiki dadise demiti..O..manasaa
seekatiki dadisedemiti..

talli gOdaarike..aatu pOtunte
tapputundaa manishikee..talaraata
tapputundaa manishikee
aa..haa..hO..

:::2

bhaga bhaga mande sooreeduni pogamabbu kammeyadaa
challagaa velige sendurunni amavaasa mingeyadaa
bhaga bhaga mande sooreeduni pogamabbu kammeyadaa
challagaa velige sendurunni amavaasa mingeyadaa
aa sooryachandrule agachaatlapaalaite
tapputundaa manishikee..talaraata
tapputundaa manishikee
aa..hhaa..hO..

:::3

avataara purushudu aa raamachandrudu
adavulapaalu kaaledaa
antataa taanaina gOpaala krshnudu
apanindalanu mOyaledaa
antati devulle agachaatla paalaite
tapputundaa manishikee..talaraata
tapputundaa manishikee
aa..hhaa..haa..



Sunday, September 22, 2013

సతీ అనసూయ--1971

























సంగీతం::P.ఆదినారాయణ రావ్
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల

పల్లవి::

ఆలయమేల..అర్చనలేలా..ఆరాధనలేలా 
పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 
అదే సతి పెన్నిధి కాదా..అదే పరమార్ధం కాదా 

చరణం::1

ఏ కొండ కొమ్మపైనో ఏ రాతి బొమ్మలోనో 
దైవము దాగెనంటూ..తపిఇంచనేలా 
ఏ కొండ కొమ్మపైనో ఏ రాతి బొమ్మలోనో 
దైవము దాగెనంటూ..తపిఇంచనేలా
ఆ దైవం నిజముగా ఉంటే 
అడుగడుగున తానై ఉంటే గుడులేల యాత్రలేలా 

పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 
అదే సతి పెన్నిధి కాదా..అదే పరమార్ధం కాదా
ఆలయమేల..అర్చనలేలా..ఆరాధనలేలా 

చరణం::2

పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం 
మదిలోన వెలిగే అందం గమనించునా –ఈ లోకులతో  పనియేమి 
పాలుగాకులు ఏమంటేమి నా స్వామి తోడురాగా

పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 
అదే సతి పెన్నిధి కాదా..అదే పరమార్ధం కాదా
ఆలయమేల..అర్చనలేలా..ఆరాధనలేలా

Saturday, September 21, 2013

చిల్లర కొట్టు చిట్టెమ్మ--1977::ఆనందభైరవి::రాగం




సంగీతం::రమేష్ నాయుడు  
రచన::దాసం గోపాలకృష్ణ 
గానం::S.జానకి,S.P.బాలు  

ఆనందభైరవి::రాగం 

పల్లవి::

సువ్వి ఆ హు సువ్వి 
ఆ..హు..ఆ..హు..
సువ్వి కస్తూరి రంగా 
సువ్వి కావేటి రంగా 
సువ్వి రామాభిరామ 
సువ్వి లాలీ 

సువ్వి కస్తూరి రంగా 
సువ్వి కావేటి రంగా 
సువ్వి రామాభిరామ 
సువ్వి లాలీ 

హైలేసా హయ..హైలేసా హయ
హైలేసా హయ..హైలేసా హయ

అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా 
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా 
నా వద్దకు వచ్చెను ఓ సఖియా 

సువ్వి కస్తూరి రంగా 
సువ్వి కావేటి రంగా 
సువ్వి రామాభిరామ 
సువ్వి లాలీ 

ఉ ఉ హు హయ..ఉ ఉ హు హయ
ఉ ఉ హు హయ.. 

వంగి వంగి నను తొంగి చూచెను 
కొంగు పట్టుకుని లగేనుగా 
వంగి వంగి నను తొంగి చూచెను 
కొంగు పట్టుకుని లగేనుగా 
భల్ చెంగున యమునకు సగేనుగా 

సువ్వి కస్తూరి రంగా 
సువ్వి కావేటి రంగా 
సువ్వి రామాభిరామ 
సువ్వి లాలీ 

అల్లావనమున కొల్లలుగా వున్నా 
గొల్ల భామలను కూడితిని
నే గొల్ల భామనై అడితిని 

సువ్వి కస్తూరి రంగా 
సువ్వి కావేటి రంగా 
సువ్వి రామాభిరామ 
సువ్వి లాలీ 

నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా
నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా
హబ్బ అద్దినట్టుంది ఓ సఖియా 

సువ్వి కస్తూరి రంగా 
సువ్వి కావేటి రంగా 
సువ్వి రామాభిరామ 
సువ్వి లాలీ

దేవుడు చేసిన మనుషులు--1973::వలజి::రాగం



















సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::నందమూరి తారక రామారావు,కృష్ణ,
S.V. రంగారావు,జయలలిత,విజయనిర్మల,
జగ్గయ్య,కాంతారావు,కాంచన,శారద

వలజి::రాగం
{కళావతి--హిందుస్తాని}

పల్లవి::

మరల రేపల్లె వాడలో..మురళి మోగే 
మోడు వారిన హృదయాలు పూయసాగే 

విన్నారా..ఆ ఆ..విన్నారా 
అలనాటి వేణుగానం..మోగింది మరలా
అలనాటి వేణుగానం..మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు..తలపించును కృష్ణుని కథలు 
విన్నారా..ఆ..

చరణం::1

పుట్టింది ఎంతో గొప్ప వంశం..పెరిగింది ఏదో మరో లోకం 
పుట్టింది ఎంతో గొప్ప వంశం..పెరిగింది ఏదో మరో లోకం 
అడుగడుగున గండాలైనా..ఎదురీది బతికాడు 
చిలిపి చిలిపి దొంగతనాలు..చిననాడే మరిగాడు

దొంగైనా..ఆ..దొర అయినా..ఆ..మనసే హరించేనులే 
విన్నారా..ఆ.. 
అలనాటి వేణుగానం మోగింది మరలా
అలనాటి వేణుగానం మోగింది మరలా

చరణం::2

ద్వేషించే కూటమిలోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి 
ద్వేషించే కూటమిలోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి 

ఆడేది నాటకమైనా..పరుల మేలు తలచాడు 
ఆడేది నాటకమైనా..పరుల మేలు తలచాడు 
అందరికీ ఆనందాల..బృందావని నిలిచాడు 

ఆనాడూ ఈనాడూ మమతే తరించేనులే 
విన్నారా..ఆ.. 
అలనాటి వేణుగానం మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు 
విన్నారా..ఆ..

నాటకాల రాయుడు--1969::కాఫీ::రాగం





















సంగీతం::G.K. వేంకటేష్ 
రచన::ఆత్రేయ
దర్శకత్వం::A.సంజీవి
నిర్మాణం::దిడ్డి శ్రీహరిరావు
నిర్మాణ సంస్థ::హరిహర ఫిల్మ్స్ 
గానం::P.సుశీల 

కాఫీ:::రాగం::

తారాగణం::నాగభూషణం,కాంచన,కైకాల సత్యనారాయణ,
చిత్తూరు నాగయ్య,బి.పద్మనాభం,ప్రభాకరరెడ్డి

పల్లవి::

నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే
నెలవంక చలువల్లు వెదజల్లగా
నిదుర రావమ్మా రావేనెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే

చరణం::1

ఓ ఓ ఓ..చిరుగాలి బాల పాడింది జోల పాడిందీ జోల
చిగురాకు మనసు కనుపాపలందు
ఎదదోచెనమ్మా ఏవెవో కలలు
కలలన్నీ కళలెన్నో విరబూయగా
నిదుర రావమ్మా రావే..నెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే

చరణం::2

ఓ ఓ ఓ..నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగిందీ లాలీ
గగనాన్ని చూసి ఒక కన్నుదోయి వినిపించమంది ఎన్నెన్నో కథలు
కథ చెప్పి మురిపించి మరపించగా
నిదుర రావమ్మా రావే..నెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే


Friday, September 20, 2013

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
















Happy Birthday to Nata Samraat ANR Garu

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 























 90 సంవత్సరాల కుర్రవాడు మన నాగేశ్వరుడి “అక్కినేని నాగేశ్వర రావు”


 గారి పుట్టిన రోజు నేడు.
.
తెలుగు సినీపరిశ్రమలో నిలువెత్తు శిఖరంగా ఎదిగిన బాలరాజు అయన.. 


 సుదీర్ఘకాలం వెండితెరను ఏలిన దసరాబుల్లోడు.. ప్రేమికుడంటే ఎలా 

ఉండాలో.. నటనానిర్వచనం ఇచ్చిన దేవదాసు ఆయన.. పద్మశ్రీ.

. పద్మభూషణ్.. ఇప్పుడు పద్మ అవార్డుల్లో అత్యున్నత పద్మవిభూషణ్ 

అవార్డు అందుకున్న తొలి తెలుగు సినీ వెలుగు ఆయన..

1940లో విడుదలయిన "ధర్మపత్ని" అక్కినేని నాగేశ్వరరావు నటించిన 


మొదటి చిత్రం. నలబయ్యవ దశకం ఏఎన్నార్‌ కెరీర్‌కి బీజం పడింది. "శ్రీ

 సీతారామ జననం, మాయలోకం, బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్ను 

వంటి సినిమాలతో ఎన్నార్‌ కెరీర్‌ ఊపందుకుంది.

ఇక యాభైయవ దశకం అక్కినేని దశను తిరగరాసింది. పౌరణిక


 సినిమాలతో పాటు సాంఘీక చిత్రాలు చేసిన ఏఎన్నార్‌ ఖాతాలో ఎన్నో

 సూపర్‌హిట్స్‌ చేరాయి. మాయల మరాఠి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ,

 అల్లావుద్దీన్‌ అద్భుత దీపం, సతీసావిత్రి వంటి సినిమాలు ఆయనకు 

 మంచి పేరు తెచ్చిపెట్టాయి..
.
ఆరవయ్యో దశకంలోనూ మరెన్నో హిట్స్‌ అక్కినేని ఖాతాలో చేరాయి. 


పెళ్లికానుక, నమ్మినబంటు, ఇద్దరు మిత్రులు, మంచి మనుషుల

 గుండమ్మ కథ, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి , ప్రేమించి చూడు,

 అంతస్తులు, ఆత్మగౌరవం, ఆత్మబలం వంటి సినిమాలు ఏఎన్నార్‌ కెరీర్‌ను

ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాయి.

 డెభ్బయ్యవ దశకం కూడా అక్కినేని హవా వీచింది. డెబ్బయ్యవ దశకం


 ప్రారంభంలోనే వచ్చిన సినిమా దసరాబుల్లోడు. నాగేశ్వరరావు ఉల్లాసంగా 

ఉత్సాహంగా వేసిన స్టెప్పలకు ప్రేక్షకులు అదే రీతిలో స్టెప్పులేశారు. ఆనాటి 

ఏఎన్నార్‌ డాన్స్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.

దసరాబుల్లోడు తర్వాత అక్కినేని నటించిన మరో భారీ హిట్‌ ప్రేమనగర్‌.


 తాజ్‌మహల్ కి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర రంగంలో

"ప్రేమనగర్"కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నలభై ఏళ్ళ క్రితం వచ్చిన ఈ 

సినిమాలోని అక్కినేని నటనకు ప్రేక్షకులు జై కొట్టారు.

అక్కినేని నటనాజీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలు ఎన్నో


 ఎన్నెన్నో. డెభ్బయ్యవ దశకంలోనే వచ్చిన మరెన్నో సినిమాలు సూపర్‌ 

 హిట్‌ అయి అక్కినేనిని ఎవర్‌గ్రీన్‌ హీరోగా నిలబెట్టాయి. భక్తతుకారాం,

అందాల రాముడు, ప్రేమలు పెళ్ళిళ్లు వంటి సినిమాల్లో అక్కినేని నటనకు 

మంచి పేరు వచ్చింది.

భగ్న ప్రేమికుడిగా ఏఎన్నార్‌ నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్సే.

  ప్రేమాభిషేకం, ప్రేమమందిరం, లైలా మజ్ను, దేవదాసు అనార్కలి.. వంటి 

సినిమాలు అక్కినేని కెరీర్‌ను ఆకాశానికెత్తేశాయి.

ఎన్టీఆర్‌, గుమ్మడి, ఎస్వీరంగరావు వంటి ఆనాటి అగ్రనటులుతో ఏఎన్నార్‌


 కలిసి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ మాయాబజార్. అభిమన్యుడిగా


అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. కలర్‌లోనూ వచ్చిన 

 ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది.

ఏఎన్నార్ తన తనయుడు నాగార్జునతో పోటీపడి 'రామదాసు' చిత్రంలో 


నటించారు.

ఈ రోజు మనం ఆయన పాటల తోటలో విహరిద్దామా మరి..



 Rachana::Aruna Ramesh








































Thursday, September 19, 2013

చెంచులక్ష్మి--1958




సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,జిక్కి

పల్లవి::

కానగరావా ఓ శ్రీహరి రావా
కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

చరణం::1

బాస చేసి మరిచావా ఓ చెంచితా
బాస చేసి మరిచావా ఓ చెంచితా
వేచి వేచి కనులేమో కాయలుకాచె
వేచి వేచి కనులేమో కాయలుకాచె
నీవులేక క్షణమైనా నిలువ జాలనే 
ఏ..ఏ..ఏ.ఏ..ఏ..ఏ.
నీవులేక క్షణమైనా నిలువ జాలనే
జాలమాయె తాళలేను ఏలగరావే..నన్నేలగరావే
కానగరావా ఓ చెంచిత రావా

చరణం::2

కంటినీరు చెరువాయే కథలే మారే
కంటినీరు చెరువాయే కథలే మారే
శాంతమొంది నరసింహా..చెంతకు రావా
శాంతమొంది నరసింహా..చెంతకు రావా
జీవితాన అంతులేని చీకటులాయె
జీవితాన అంతులేని చీకటులాయె
దేవదేవ ఈ వియోగ మెన్ని దినాలో..ఇంకెన్ని దినాలో

కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

మాయాబజార్--1957::దేశ్::రాగ



సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్ర రావ్
గానం::M.L.వసంతకుమారి  బృందం 
తారాగణం::N.T. రామారావు,అక్కినేని, S.V. రంగారావు,రేలంగి, R. నాగేశ్వరరావు, 

C. S. R. ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి

దేశ్::రాగం
{దేశ దేశి} 
{కేదారగౌళ కర్ణాటకకు చేరువ}  

శ్రీకరులు..దేవతలు శ్రీరస్తులనగా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా
వర్ధిల్లు..మా తల్లి..వర్ధిల్లవమ్మా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా

సకల సౌభాగ్యవతి రేవతీ దేవి
తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ
సకల సౌభాగ్యవతి రేవతీ దేవి
తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ
అడుగకే వరములిడు బలరామ దేవులె
జనకులై కోరినా వరములీయగనూ
వర్ధిల్లు..మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి..శశి రేఖ..వర్ధిల్లవమ్మా

శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
అఖిల మహిమలు గలుగు కృష్ణ పరమాత్ములే 
పినతండ్రియై సకల రక్షణలు శాయ
వర్ధిల్లు..మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ..వర్ధిల్లవమ్మా

ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ
ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి 
మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ
పాండవా యువరాజు బాలుడభిమన్యుడే 
బావయై నీ రతన లోకమని మురియా
వర్ధిల్లు..మా తల్లి..వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ..వర్ధిల్లవమ్మా
చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా

చెంచులక్ష్మి--1958::మారుబిహాగ్::రాగం





సంగీతం::S రాజేశ్వరరావు 
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల

మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )

పల్లవి::

నీలగగనఘనశ్యామా..ఘనశ్యామా దేవ
నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
దేవ నీలగగన...ఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను
హాని కలిగితే అవతారాలను..పూని బ్రోచునది నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::1

చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::2

కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కావా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చరణం::3

సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము
సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము
పెండ్లికొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకో..హే! జగదీశా

నీలగగనఘనశ్యామా..నీలగగనఘనశ్యామా
ఘనశ్యామా దేవ..నీలగగనఘనశ్యామా

చెంచులక్ష్మి--1958::ద్విజావంతి::రాగ ( జై జై వంతి)






సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, జిక్కి

ద్విజావంతి::రాగ

( జై జై వంతి) 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

ఆనందమాయే అలి నీలవేణి
ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ
ఆనందమాయే అలి నీలవేణి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అనువైన వేళా అనురాగ శోభా
అది ప్రేమపూజ నా భాగ్యమాయే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అలనాటి నోము కల నేడు పండే
అరుదైన హాయి నాలోన నిండే

ఆనందమాయే అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయే అసమాన తేజా

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ..సొగసైన రూపే సోలింత చూపే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సగమైన కనులా సంతోషమిటులే
నగుమోముపైన నడయాడు కళలే
అగుపించగానే మధులూరు నాలో

ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ
ఆనందమాయే అలి నీలవేణి

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎనలేని స్వామీ నిను చేరబోతే
నునులేత ప్రేమా నను సాగనీదే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తనువేమొ నీకై తపియించి నిలచే 
మనసేమొ నీలో మునుపే కలిసే

ఆనందమాయే అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా

ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ
ఆనందమాయే అలి నీలవేణి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Wednesday, September 18, 2013

మంగమ్మగారి మనుమడు--1984




















మంగమ్మగారి మనుమడు--1984 
సంగీతం::k.v.మహదేవన్ గారు 
రచన::C.నారాయణరెడ్డి
గానం::శ్రీమతి భానుమతి రామకృష్ణగారు,వాణీజయరాం


పల్లవి::

శ్రీ సూర్యనారాయణ మేలుకో..మేలుకో
మా చిలకమ్మ బులపాటను చూసిపో..చూసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో..మేలుకో
మా చిలకమ్మ బులపాటను చూసిపో..చూసిపో

తెల్లావారకముందే ఇల్లాంతా పరుగుల్లు
చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు
ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో..ఎంత విడ్డూరమో

శ్రీ సూర్యనారాయణ మేలుకో..మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో..చూసిపో

చిట్టి మనవడిరాక చెవిలోన పడగానే
ముసిముసి చీకట్లో..ముసలమ్మ రాగాలు
ఏమి జాగారమో..ఓ..ఎంత సంబరమో..ఓ..ఎంత సంబరమో

చరణం::1

సరిగంచుపైట సవరించుకున్నా
మరి మరి జారుతోంది..ఓసోసి మనవరాలా ఏంజరిగింది
ఓసోసి మనవరాలా ఏంజరిగింది
తాతయ్యనీ నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
తాతయ్యనీ నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
నాకంతే జరిగింది జరిగిందో అమ్మమ్మ
అమ్మదొంగ..రంగ రంగ..అమ్మదొంగ..రంగ రంగ

శ్రీ సూర్యనారాయణ మేలుకో..మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో..చూసిపో

చరణం::2

కోడిని కోడితే సూర్యుడ్ని లేపితే
తెల్లారిపోతుందా..ఓ పిల్ల..పెళ్ళి ఘడియవస్తుందా
ఓ పిల్ల పెళ్ళి ఘడియ వస్తుందా
దిగివచ్చి బావను క్షణమైన ఆపితే
దేవుడ్ని నిలదీయనా ఓయమ్మో
కాలాన్ని చుట్టేయనా
నాపిచ్చి తల్లి..ఓ బుజ్జితల్లి
నీమనసే బంగారం..నూరేళ్ళు నిలవాలి ఈమురిపెం
నూరేళ్ళు నిలవాలి ఈమురిపెం
అమ్మమ్మ మాట..ముత్యాల మూట
ఆ విలువ..నేరెరుగనా
ఏనాడూ అదినాకు తొలిదీవెనా

శ్రీ సూర్యనారాయణ మేలుకో..మేలుకో
మా చిలకమ్మ బులపాటము చూసిపో..చూసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో..మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో..చూసిపో


Mgammagaari ManumaDu--1984 
Music::k.v.mahadaevan 
Lyrics::C.naaraayaNa ReDddi
Singer's::Sreemati bhaanumati raamakRshNagaaru,vaaNeejayaraaM  


:::

Sree sooryanaaraayaNa maelukO..maelukO
maa chilakamma bulapaaTanu choosipO..choosipO
Sree sooryanaaraayaNa maelukO..maelukO
maa chilakamma bulapaaTanu choosipO..choosipO

tellaavaarakamuMdae illaaMtaa parugullu
cheekaTlO muggullu chekkiTlO siggullu
aemi vayyaaramO eMta viDDooramO..eMta viDDooramO

Sree sooryanaaraayaNa maelukO..maelukO
maa ammamma aaraaTamu choosipO..choosipO

chiTTi manavaDiraaka chevilOna paDagaanae
musimusi cheekaTlO..musalamma raagaalu
aemi jaagaaramO..O..eMta saMbaramO..O..eMta saMbaramO

:::1

sarigaMchupaiTa savariMchukunnaa
mari mari jaarutOMdi..OsOsi manavaraalaa aeMjarigiMdi
OsOsi manavaraalaa aeMjarigiMdi
taatayyanee nuvvu talachina tolinaaDu
neekaemi jarigiMdO ammamma
taatayyanee nuvvu talachina tolinaaDu
neekaemi jarigiMdO ammamma
naakaMtae jarigiMdi jarigiMdO ammamma
ammadoMga..raMga raMga..ammadoMga..raMga raMga

Sree sooryanaaraayaNa maelukO..maelukO
maa ammamma aaraaTamu choosipO..choosipO

:::2

kODini kODitae sooryuDni laepitae
tellaaripOtuMdaa..O pilla..peLLi ghaDiyavastuMdaa
O pilla peLLi ghaDiya vastuMdaa
digivachchi baavanu kshaNamaina aapitae
daevuDni niladeeyanaa OyammO
kaalaanni chuTTaeyanaa
naapichchi talli..O bujjitalli
neemanasae baMgaaraM..nooraeLLu nilavaali eemuripeM
nooraeLLu nilavaali eemuripeM
ammamma maaTa..mutyaala mooTa
aa viluva..naereruganaa
aenaaDoo adinaaku tolideevenaa

Sree sooryanaaraayaNa maelukO..maelukO
maa chilakamma bulapaaTamu choosipO..choosipO
Sree sooryanaaraayaNa maelukO..maelukO
maa ammamma aaraaTamu choosipO..choosipO

Tuesday, September 17, 2013

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం--1960

 


సంగీతం::.G.లింగప్ప

రచన::సముద్రాల

గానం::జానకి

Directed by::B.R.Pantulu   

తారాగణం::శివాజిగణేషన్ B.R..పంతులు,M.V.రాజమ్మా,రాజనాల,రమణారెడ్డి,కాంచన.


పల్లవి::


ఆఆఅ ఆఆఆఆ ఆఆఅ 

నగవు చిలుకుమా..ఆఆ 

నగవు చిలుకుమా..నగవు చిలుకుమా

చిన్నారి రాజా..నా మది చల్లగా

నగవు చిలుకుమా..ఆఆఆ 


చరణం::1


రాతి బొమ్మలా..నిలవ కారణమేమో

నీదు సిరులన్నీ..నిలువు దోపులాయెనా

రాతి బొమ్మలా..నిలవ కారణమేమో

నీదు సిరులన్నీ..నిలువు దోపులాయెనా

అలుకా మౌన యోగమా..అభినవ రాజ ఠీవియా

అలుకా మౌన యోగమా..అభినవ రాజ ఠీవియా

తరితీపి విరితేనె..విందులు సేతురా

నగవు చిలుకుమా..ఆఅఆఆఆఅ 

నగవు చిలుకుమా..ఆఆఅ


చరణం::2


నవ్విన ముత్యాలు..ధరను రాలునా

చివురు కెమ్మోవి..చిలుక కొరికి వేయునా

నవ్విన ముత్యాలు..ధరను రాలునా

చివురు కెమ్మోవి..చిలుక కొరికి వేయునా

తరుగని ఉదర శూలయో..ననుగని పగలు పోయెదో

తరుగని ఉదర శూలయో..ననుగని పగలు పోయెదో

అంజూర దానిమ్మ..కానుక సేతురా


నగవు చిలుకుమా..ఆఅ..నగవు చిలుకుమా

నగవు చిలుకుమా..చిన్నారి రాజా

నా మది చల్లగా..నగవు చిలుకుమా

Saturday, September 07, 2013

అనురాగ సంగమం--1986


సంగీతం::ఇళయరాజా
రచన::గోపీ
గానం::గానం::S.P.బాలు,S.జానకి Film Directed By::Maniratnam
తారాగణం::మోహన్,రాధ,అంబిక,కపిల్‌దేవ్.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాగమల్లి తోటలలో..నీ వలపు బాటలలో
నాగమల్లి తోటలలో..నీ వలపు బాటలలో
నాటి నీ పాటలనే..నా మనసు పాడినది
నాటి నీ పాటలనే..నా మనసు పాడినది
నాగమల్లి తోటలలో..ఓఓఓఓఓఓఓ

చరణం::1

నా హృదయ కోవెలలో..దేవతగ వెలిసావే
ప్రతి ఘడియ నా బ్రతుకు..స్వర్గమని పించావే
నా హృదయ కోవెలలో..దేవతగ వెలిసావే
ప్రతి ఘడియ నా బ్రతుకు..స్వర్గమని పించావే
ఆ నాటి వెన్నెలలో..నను నే మరిచానే 
ఆ నాటి వెన్నెలలో..నను నే మరిచానే 
ఈ నాడు నా గతమే..శాపమై మిగిలేనే

నాగమల్లి తోటలలో..నీ వలపు బాటలలో
నాగమల్లి తోటలలో..నీ వలపు బాటలలో
నాటి నీ పాటలనే..నా మనసు పాడినది
నాగమల్లి తోటలలో..ఓఓఓఓఓఓఓ

చరణం::2

ఆ ఆఆ ఆఆఅ ఆ ఆ ఆ ఆ
ఆఆఆ
ఈ కొండ ఈ కోనా..ఆ నాడు పులకించే
నువు లేని ఈ వేళా..అణువణువు విలపించే
ఈ కొండ ఈ కోనా..ఆ నాడు పులకించే
నువు లేని ఈ వేళా..అణువణువు విలపించే
నువ్‌వెళ్ళి పోగానే..చిరునవ్వు మరిచానే
నువ్‌వెళ్ళి పోగానే..చిరునవ్వు మరిచానే
నట్ట నడి సంద్రంలో..నావనై ఉన్నానే
నాగమల్లి తోటలలో..నీ వలపు బాటలలో
నాగమల్లి తోటలలో..నీ వలపు బాటలలో
నాటి నీ పాటలనే..నా మనసు పాడినది
నాటి నీ పాటలనే..నా మనసు పాడినది
నాగమల్లి తోటలలో..ఓఓఓఓఓఓఓ

Anuraaga Sangamam--1986
Music::iLayaraaja
Lyrics::Gopi
Singer's::S.Jaanaki,S.P.Baalu.
Film Directed By::Maniratnam
Cast::Mohan,Raadha,Ambika,Kapildev.

::::::::::::::::::::::::::::::::::::

aa aa aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa aa aa 
naagamalli tOTalalO..nee valapu baaTalalO
naagamalli tOTalalO..nee valapu baaTalalO
naaTi nee paaTalanE..naa manasu paaDinadi
naaTi nee paaTalanE..naa manasu paaDinadi
naagamalli tOTalalO..OOOOOOO

::::1

naa hRdaya kOvelalO..dEvataga velisaavE
prati ghaDiya naa bratuku..swargamani pinchaavE
naa hRdaya kOvelalO..dEvataga velisaavE
prati ghaDiya naa bratuku..swargamani pinchaavE
A naaTi vennelalO..nanu nE marichaanE 
A naaTi vennelalO..nanu nE marichaanE 
I naaDu naa gatamE..Saapamai migilEnE

naagamalli tOTalalO..nee valapu baaTalalO
naagamalli tOTalalO..nee valapu baaTalalO
naaTi nee paaTalanE..naa manasu paaDinadi
naagamalli tOTalalO..OOOOOOO

::::2

aa aaaaaa aaaaaaa aa aa aa aa
aaaaaaaa
ii konDa ii kOnaa..aa naaDu pulakinchE
nuvu lEni ii vELaa..aNuvaNuvu vilapinchE
ii konDa ii kOnaa..aa naaDu pulakinchE
nuvu lEni ii vELaa..aNuvaNuvu vilapinchE
nuv^veLLi pOgaanE..chirunavvu marichaanE
nuv^veLLi pOgaanE..chirunavvu marichaanE
naTTa naDi sandramlO..naavanai unnaanE
naagamalli tOTalalO..nee valapu baaTalalO
naagamalli tOTalalO..nee valapu baaTalalO
naaTi nee paaTalanE..naa manasu paaDinadi
naaTi nee paaTalanE..naa manasu paaDinadi
naagamalli tOTalalO..OOOOOOO