సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::భానుమతి
దులపర బుల్లొడో హోయ్ హోయ్
దులపర బుల్లొడొ
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కల్లతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
1,2,3 చెప్పి దులపర బుల్లొడో దుమ్ము దులపర బుల్లోడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లోడో హోయ్
సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
వరాల బొమ్మ..ముద్దుల గుమ్మ కాలేజికి కదిలిందంటే
వెకిలి వెకిలిగ వెర్రి వెర్రి గ వెంటపడే రౌడి ల పట్టుకొని..పట్టుకొని
తలాంగుతదిగిన తకతోం తోం అని
తలాంగుతదిగిన తకతోం తోం అని
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్
సంప్రదాయమగు చక్కని పిల్ల..సాయంకాలం సినిమా కొస్తే..వస్తే
సంప్రదాయమగు చక్కని పిల్ల సాయంకాలం సినిమా కొస్తే
ఇదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులొ బైటాయించుకొని ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్ళను ఒడిసి పట్టుకొని
చింత బరికను చేత బట్టుకొని
చింత బరికను చేత బట్టుకొని
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్
రోడ్ పట్టని కారులున్నవని..మూడంతస్తుల మేడలున్నవని
రోడ్ పట్టని కారులున్నవని..మూడంతస్తుల మేడలున్నవని
డబ్బు చూసి ఎటువంటి ఆడది
తప్పకుండ తమ వళ్ళో పడునని
ఈలలు వేసి..సైగలు చేసె..గోల చేయు సొగ్గాల్లను పట్టి..పట్టి
వీపుకు బాగా సున్నం బెట్టి
వీపుకు బాగా సున్నం బెట్టి
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్
మాయ మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరనాల్లకు పొతే..పొతే
జనం ఒత్తిడికి సతమతమవుతు దిక్కు తోచక తికమకపడితే..అయ్యయ్యొ
సందు చూసుకొని సరసాలకు దిగు గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమారమణ గోవిందా ఊ రమారమణ గోవిందా హారి
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హోయ్
No comments:
Post a Comment