Sunday, May 11, 2014

ఈ కాలపు పిల్లలు--1976















సంగీతం::సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::S.P.బాలు 
తారాగణం::రామకృష్ణ,ప్రభ,శ్రీదేవి కపూర్,కంతారావు,ప్రభాకర్‌రెడ్డి,జ్యోతిలక్ష్మీ,జయమాలిని. 

పాట పాడనా పాఠమే నేర్పనా
ఈ పాట ప్రతియేటా నీ యెదలో మ్రోగగా

చరణం::1

గలగలపారే సెలయేరులో పలికే రాగమే
జిలిబిలి నడకల చిరుగాలులలో చిలికే నాదమే
లలిత లలితముగ మధుర మధురముగ
గళములోన..సరిగమలై పలుకగ     
పాట పాడినా పాఠమే నేర్పనా
ఈ పాట ప్రతియేటా నీ యెదలో మ్రోగగా

చరణం::2

రామసుధారస పానము చేసి రంజిల్లిన త్యాగయ్యా 
గిరిధర వరగుణ గానము చేసి తరించిపోయిన మీరా
పలుకు పలుకులో పదము పదములో
పరవశించి...దీవన లందించగ   
పాట పాడినా పాఠమే నేర్పనా
ఈ పాట ప్రతియేటా నీ యెదలో మ్రోగగా

దొంగ మొగుడు--1987



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::చిరంజీవి,భానుప్రియ,మాధవి. 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో
నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే
ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే
ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా..ఆ..ఆ..ఆ
కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో

చరణం::1

కన్నెకుసుమం కన్ను గీటి నన్ను పిలిచిన వేళ
తేనె వానల తాన మాడగ తేటినై నే రానా..లలలలలా
కాటు వేసిన మోటు సరసం హాయి గురుతై పోగా
ఘుమ్ముఘుమ్ముగ కమ్ముకున్న మత్తు వరదై రాదా
ఓ..ఓహో..ఓ..ఓ..మారం చేసే ఆరలన్నీ తీరాలి ఈ వేళలో
ఓ..ఓహో..ఓ..ఓ..పందెం వేసే అందాలన్నీ ఊగాలి ఉయ్యాలలో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో

చరణం::2

వలపు వానా కురిసినాక వలపు వరదై పోదా
కోరికలతో ఏరువాక సాగు తరుణం రాదా..లలలలలా
కన్న కలలు కోతకొస్తే పుష్యమాసం రాదా
శోభనాల సంకురాతిరి సంబరాలే కాదా
అహ..హ..హా..అహా..హ..హా
తూనిగల్లే ఆనందాలే తేలాలి ఈ గాలిలో
ఓ..ఓ..ఓ..ఓ..తేనేగల్లే మకరందాలే తూలాలి ఈ పూలలో
కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో
నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే
ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే
ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా..ఆ..ఆ..ఆ