శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం::B. విఠలాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, P. సుశీల.
తారాగణం::N.T. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ
పల్లవి::
ఆమె: నాలో నీవై నీలో నేనై
అతడు: నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!! ఆమె: నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము !!
చరణం::1
ఆమె: పడమటి సూర్యుడు కన్నుమూసె
తూర్పున చంద్రుడు తొంగి చూసె
కారు చీకటి దారి లోనే
కాంతి విరబూసె
ఆమె: ఆ....
పెంచిన తోట మాలిని వీడి
పెరిగిన తోట తల్లిని వీడి
కన్నె మనసే తీగ లాగా
కాంతుని పెనవేసె, ప్రియ
కాంతుని పెనవేసె
!! ఆమె:నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము !!
చరణం::2
ఆమె: నీలాకాశం నీడ లోన
నిండు మమతల మేడ లోన
గాలి లాగా పూల లాగా చేరి పోదాము
అతడు: ఆహ .... ఓహో ...
వలపులోన మలుపులు లేక
బ్రతుకులోన మెలికలు లేక
వాగులున్నా వంకలున్నా
సాగి పోదాము
అతడు, ఆమె: చెలరేగి పోదాము
!! ఆమె:నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము !!
No comments:
Post a Comment