అన్నానా భామిని! ఏమని?
సంగీతం: ఘంటసాల.
రచన: సముద్రాల
గానం: ఘంటసాల, P.లీల.
రాగం::రాగేశ్రీ::
అన్నానా భామిని! ఏమని? ఎపుడైనా...(2)
అరవిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని - ఊ!
అరవిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
మాటవరసకెపుడైన అన్నాన భామిని ఎపుడైన
అన్నానా మోహన! ఏమని? ఎపుడైనా...(2)
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని - ఆహ!
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా అన్నాన మోహన ఎపుడైన
లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని(2)
మాటవరసకెపుడైన అన్నాన భామిని ఎపుడైన
నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమని ఆహ! అహహ(నవ్వు)...
ఆదమరచి ఎపుడైనా అన్నానా మోహన ఎపుడైన
అన్నాన మోహన ఎపుడైన
ఆ...ఆ...ఆ..
****************************************
No comments:
Post a Comment