ముందు అందరూ నన్ను క్షమించండి __/\__
కవితలంటే నాకు కాస్తపిచ్చే అనుకోండి
అప్పుడప్పుడు నాకూ రాయాలనే ఆవేశం కలుగుతూవుండేది
కాని ధైర్యం చాలక..రాసినవి పిచ్చిగా వుంటే????
ఇలాంటి భయాలతో రాసుకొన్నవన్నీ...
బుక్కులోనే పదిలపరుచుకొనేదాన్ని...!!!
ఎప్పుడో.....రాసిన ఒక కవిత ఇవాల దైర్యం చేసి
మీముందు వుంచబోతున్నాను తప్పులున్నా క్షమించమని ప్రాథన...
నవ ఉగాది...
సముద్రములోని కడలిలా...
పున్నమి జాబిల్లిలా...
నవ వధువు హంస నడకలా..
కదలికదలి వస్తుంది ఉగాది..
ఓరచూపుల లేతవన్నెల చిరువేపాకుతో..
నునుసిగ్గుల దోరవలపు పుల్లదనంతో..
చిరునవ్వుల ధరహాసపు తీయదనంతో..
కలబోసిన నవరుచుల నవయవ్వనంతో..
చిగురించిన ప్రకృతికి సరికొత్త పులకింతలురేపుతూ
గగన తారలా కాంతుల్ని విరజిమ్ముతూ..
వసంత ౠతువు కోయిలల శ్రావ్య గానాలతో
కదలి కదలి వస్తుంది ఉగాది..
పోయిన ఏడు తీరని ఆశయాలకు నాందిపలుకుతూ...
కొత్తసంవత్స్సరం కోటి కోర్కెలతో చెప్పాలి మనం ..
ఉగాదికి స్వాగతం...సుస్వాగతం....


