Thursday, December 17, 2009

పదహారెళ్ళ వయసు--1978



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

Film Directed By::K.Raghavendra Rao
Cast::Chandramohan,Sreedevi,Mohanbabu,Nirmalamma

:::::::::::::::::
పంట చేలో పాలకంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ

::::1


శివ గంగ తిరణాళ్ళలో
నెలవంక తానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికళ్లతో
గొరవంక గుడి గంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా
నే కొండ పిండికొట్టాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
ఓహోహోయ్

::::2


గోదారి పరవళ్ళలో
మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్ళకూ
మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా
నీ మాట బాట కావాల
నా పాట ఊరు దాటాల
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లే నిద్దుర లేవాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే


పంట చేలో పాలకంకి నవ్విందీ..అహహా..
పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ..అహహా..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా..ఓహోహోయ్
లేత పచ్చ కోనసీమ ఎండల్లా..అహాహ్హా..


అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే

పదహారెళ్ళ వయసు--1978



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

Film Directed By::K.Raghavendra Rao
Cast::Chandramohan,Sreedevi,Mohanbabu,Nirmalamma
::::::::::


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కట్టుకధలు సెప్పినేను కవ్విస్తే..నవ్విస్తే
బంగారు పాలపిచ్చుకా..మా మల్లి
నవ్వాల పకా పకా మల్లీ మల్లీ నవ్వాల పకాపకా..2

::::1


అనగనగా ఒక అల్లరి పిల్లోడు
ఒకనాడా పిల్లాణ్ణీ చీమ కుట్టిందీ..
సీమ కుట్టి సిల్లోడు ఏడుస్తుంటే..
సీమా..సీమా..ఎందుకు నువ్ కుట్టావంటే..?..2
పుట్టలో ఏలెడితే కుట్టనా..నా పుట్టలో..ఏలెడితే కుట్టనా
నేనూ కుట్టనా..అంటా కుట్టనా అన్నదీ..
అదివిన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు..2
కుయ్యో..మొర్రో..కుయ్యో..మొర్రో..కుయ్యో..మొర్రో..

కట్టుకధలు సెప్పినేను కవ్విస్తే..నవ్విస్తే
బంగారు పాలపిచ్చుకా..మా మల్లి
నవ్వాల పకా పకా మల్లీ మల్లీ నవ్వాల పకాపకా

::::2


పల్నాటి పడుచుపిల్లా..కోటిపల్లి రేవుదాటి
హ్హ..బంగారు మావకోసం..గోంగూరచేనుకొస్తే..
ఆహ్గా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఎన్నెలంటి నావోడు సందురూడా..ఎండదెబ్బ తీశాడు సందురూడా
బుగ్గమీద నావోడు సందురూడా..ముద్దరేసి పోయాడు సందురూడా
పోయినోడు పోకుండ రాత్రే నా కల్లోకొచ్చాడు..
సిన్ననాటి ముచ్చటే సిలకపచ్చనా..
ఒకనాటి మాటైన నూరేళ్ళ ముచ్చట..నూరేళ్ళ ముచ్చట
అహ్హాహ్హాహ్హాహ్హా అహ్హాహ్హాహ్హా

::::3


నీలాంటి రేవులో నీడల రాగం..సాకిరేవులో ఉతుకుడు తాళం..2
తదరిన తా.. తదరిన తా..ఆ ఆ ఆ
ఆ ఆ ఆ తదరిన తదరిన తదరిన తదరిన తదరిన
తదరిన తదరిన తదరిన తదరిన తదరిన
ఆ..ఆ..ఆ.ఆఆ..ఆఆఆ........

జీవనపోరాటం--1986

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::K.J.జేసుదాస్


మరచిపో..నేస్తమా..హౄదయముంటే సాధ్యమా
మరచిపో..నేస్తమా..హౄదయముంటే సాధ్యమా
జ్ఞాపకాల నీడలో..తీపిచేదు బాసలూ..
నీ గుండెలో..చెరిపేసుకో..నీకోసమే..తుడిచేసుకో
గుడ్డిప్రేమల్లో..మూగసాక్షాలూ..
ఇక వినుపించునా...కనుపుంచునా..
వినుపించునా...కనుపుంచునా..
మరచిపో..నేస్తమా..హౄదయముంటే సాధ్యమా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నీ కంటిపాపతో..ఓ...ఓ...
నీ కంటిపాపతో కన్నీరు చల్లకూ పన్నీట వెన్నెల్లు జల్లుకో
కొత్త ఆశలే తీగలల్లుకో..మన్నిస్తున్నాలే..మాజీప్రేయసీ
పచ్చని సిరులు వెచ్చని మరులు నచ్చి నూరేళ్ళు నీతోడుగా వర్ధిల్లగా
నీతోడుగా వర్ధిల్లగా..
మరచిపో..నేస్తమా..హౄదయముంటే సాధ్యమా

ఆకాశవీధిలో..ఓ.. ఆకాశవీధిలో..
ఏ తారనడిగినా..చెపుతుందిలే ప్రేమగాధలూ
భగ్న జీవులా..గుండె కోతలూ..
గెలుపే నీదమ్మా..జోహారందుకో..
పగిలిన హౄదయం..చిలికిన రక్తం
కుంకుమ తిలకం ఈనాడూ..
నీ శోభలై..వర్ధిల్లగా..నీ శోభలై...వర్ధిల్లగా

మరచిపో..నేస్తమా..హౄదయముంటే సాధ్యమా
జ్ఞాపకాల నీడలో..తీపిచేదు బాసలూ..
నీ గుండెలో..చెరిపేసుకో..నీకోసమే..తుడిచేసుకో
గుడ్డిప్రేమల్లో..మూగసాక్షాలూ..
ఇక వినుపించునా...కనుపుంచునా..
వినుపించునా...కనుపుంచునా..

జీవనపోరాటం--1986



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


హ్హా..హా..హ్హా..హా..హా..ఆ..ఆ..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
ఈ...మధుమాసం..మనకోసం..
ప్రేమ పల్లవించి పూలుపూసే..కౌగిలింతలో..
సంతకాలు చేసిపోయే జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం

ఆమని తేనెలు పోంగేవేళల్లో..ప్రేమని కోయిల పాడేవేళల్లో
పోంగే..గంధాలు..పూసి..నాలో ప్రాణాలుపోసి
కుంకుమ వీణల సంధ్యరాగమే..పండిన ప్రేమకు తాంబూలమై
మూగచూపులల్లుకొంది...రాగమిప్పుడే..
కన్నెగుండె చేరుకొంది...తాళమెప్పుడో
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం

రేపటి చల్లటి వెలుగు నీడల్లో..
నిన్నటి సన్నటి వెన్నల జాడల్లో
నీవే..నేనైన వేళా..మాటే..మూగైన వేళా..
తోటకి వేసవి రానే రాదులే..పాటా..పల్లవి..నీవూ నేనులే
జాజిపూల మాలలంటి జ్ఞాపకాలలో..
పూవులార దూసుకొన్న జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
ఈ...మధుమాసం..మనకోసం..
ప్రేమ పల్లవించి పూలుపూసే..కౌగిలింతలో..
సంతకాలు చేసిపోయే జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
హ్హా..హా..హ్హా..హా..హ్హా...హ్హా..హా..ఆ..ఆ..