Friday, August 17, 2007

రాజమకుటం--1960:::ఆభేరి::రాగం






















సంగీతం::మాష్టర్ వేణు
రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
గానం::P.లీల

Film Directed By::B.N.Reddi
తారాగణం::N.T.రామారావు,రాజసులోచన,రాజనాల,కన్నాంబ.
రాగం :: ఆభేరి



సడిచేయకో గాలి సడిచేయబోకె
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే
సడిచేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడిచేయకే

పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే

సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకో గాలి
0..ఆఆఆఆఆఆఆఆ..మ్మ్ మ్మ్
మ్మ్

No comments: