రచన: నాగరాజు.
సంగీతం::మాస్టర్ వేణు (జి.రజనీకాంత రావు)
గానం::ఘంటసాల, P.లీల.
Film Directed By::B.N.Reddi
తారాగణం::N.T.రామారావు,రాజసులోచన,రాజనాల,కన్నాంబ.
రాగం::: చారుకేశి :::
ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో ఓ...ఓ..
ఊరేది పేరేది ఓ చందమామ (2)
నిను చూసి నీలి కలువ పులకింపనేలా
ఓ..ఓ..జాబిల్లి నీలి కలువ విడరాని జంట
ఊరేల పేరేల ఓ కలువ బాల
ఊగెటి తూగెటి ఓ కలువ బాల
ఆ..ఆ..ఆ..
విరిసిన రేకుల చెలువనుర..ఆ..ఆ..
కురిసే తేనేల కలువనుర
దరిపి వెన్నెలెల దొర రారా ఆ..ఆ..ఆ..
మరుగెలనురా నెలరాజ
తెర తీయర చుక్కల రేడ
రావోయి రావోయి ఓ చందమామ
పరువములొలికే విరిబోణి(2)
స్వప్నసరసిలో సుమరాణి ఆ..ఆ..
కొలనంతా వలపున
తూగే అలలై పులకింతలు రేగే
నీవాడ నేగాన ఓ కలువ బాల
తరుణ మధుర మొహనా హిమచర
గరళ యవ్వనా మురాతి కనర
సురుచి రమన నా నివాళి ఇదిగో(2)
వలచిన నా హృదయమె గైకొనరార
1 comment:
చాలా చాలా గొప్ప పాట. వీలు అయినప్పుడల్లా ఈ పాటనే వింటాను. కొన్నిట్లో ఈ పాట రచయత శ్రీ దేవులపల్లి అని చదివాను. పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.
Post a Comment