మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో
చరణం::1
ముద్దుల మూటలు కట్టుకుని ముచ్చటలెన్నో మోసుకొని రవ్వలు కురిసే చిరునవ్వులతో ఎవ్వరికోసం వచ్చారో మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో
చరణం::2
చుక్కల పల్లకిలో సాగి మబ్బుల దారుల ఊరేగి ఏ చెలి కోసం తెచ్చారో మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో
సంగీతం::S.P.కోదండపాణి రచన::మైలవరపు గోపి గానం::S.P.కోదండపాణి, P.సుశీల తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జమున, ప్రభాకరరెడ్డి,B.సరోజాదేవి, జయసుధ, S.V.రంగారావు, రాజబాబు, పల్లవి:: ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు చరణం::1 నదిలో నావ ఈ బ్రతుకు దైవం నడుపును తన బసకు ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ నదిలో నావ ఈ బ్రతుకు దైవం నడుపును తన బసకు అనుబంధాలు ఆనందాలు తప్పవులేరా కడవరకు తప్పవులేరా కడవరకు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ చరణం::2 రాగం ద్వేషం రంగులురా భోగం భాగ్యం తళుకేరా ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాగం ద్వేషం రంగులురా భోగం భాగ్యం తళుకేరా కునికే దీపం తొణికే ప్రాణం నిలిచేకాలం తెలియదురా నిలిచేకాలం తెలియదురా ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
సంగీతం::K.V.మహాదేవన్ గారు రచన::ఆత్రేయ గారు గానం::S.P.బాలు తారాగణం::వినయ్ కుమార్, ఉమా భారతి పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పాడాలనే ఉన్నది..విని మెచ్చి మనసిచ్చే..మనిషుంటే పాడాలనే ఉన్నది..విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది చరణం::1 పాడాలంటే హృదయం ఉండాలి పాడాలంటే హృదయం ఉండాలి హృదయానికి ఏదో కదలిక రావాలి పాడాలంటే హృదయం ఉండాలి హృదయానికి ఏదో కదలిక రావాలి భావం పొంగాలి..రాగం పలకాలి దానికి జీవం పోయాలి భావం పొంగాలి..రాగం పలకాలి దానికి జీవం పోయాలి పాడాలనే ఉన్నది..విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది చరణం::2 పాడానంటే..రాళ్ళే కరగాలి ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి..కథలే చెప్పాలి పాడానంటే..రాళ్ళే కరగాలి ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి..కథలే చెప్పాలి ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి గదిలో దేవత కనుతెరవాలి..పాడాలనే ఉన్నది ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి గదిలో దేవత కనుతెరవాలి..పాడాలనే ఉన్నది పాడాలనే ఉన్నది..విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది..ఈ..
సంగీతం::S. రాజేశ్వరరావు రచన::దాశరధి గానం::మాధవపెద్ది,P.సుశీల బృందం తారాగణం::అక్కినేని, జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి, జానకి,గీతాంజలి,కృష్ణకుమారి పల్లవి:: ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర నీ హంగు చూసి పొంగిపోనులేరా ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర నీ హంగు చూసి పొంగిపోనులేరా నా సామిరంగ దండమోయీ..హోయ్..నా జోలికింక రాకోయీ హాయ్..హాయ్..ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా.. హోయ్..బోంగరాల బుగ్గలున్నదానా.. నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా హోయ్..బోంగరాల బుగ్గలున్నదానా.. నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా..హోయ్ హోయ్ నీవ్ ఖస్సుమంటే తాళలేనే..హోయ్..నీ పొందుకోరివచ్చినానే హాయ్..హాయ్..ఓ చెలియ ఓ చెలియ ఓ చెలియా.. చరణం::1 నీ కైపు కళ్ళతో నీ కోంటే నవ్వుతో..గారడి చేసావూ భలే..భలే..నీ తీపిమాటలూ నీళ్ళల్లోమూటలూ నిన్నింక నమ్మనోయీ నా సిలకా..హోయ్ హోయ్..నీ అలకా..హోయ్ హోయ్..తెచ్చిందిలే అందం నా కళ్ళు చూడవే ఈ బొమ్మ ఆడవే..మనసంత నీవేలే..ఏ.. పో పోవోయ్..ఓయ్ పిల్లోయ్..కిల్లాడిచాలులే.. హోయ్..బోంగరాల బుగ్గలున్నదానా.. నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా..హోయ్ హోయ్ నీవ్ ఖస్సుమంటే తాళలేనే..హోయ్..నీ పొందుకోరివచ్చినానే హాయ్..హాయ్..ఓ చెలియ ఓ చెలియ ఓ చెలియా.. చరణం::2 ముచ్చట్లు గాలితో మురిపాలు పూలతో..నటనలు నాతోనా సరసాల సుక్కతో సరదాలు మబ్బుతో..సైయ్యాట నాతోనా ఇటు సూడవే,,హోయ్ హోయ్..నీతోడులే..హాయ్ హాయ్.. దాసుడు నీవాడే..ఏ..నీవుంటే పక్కనా..మనసెంతో చల్లనా నారాణి నీవేలే ఓ రాజా..నారోజా..ఈ రోజు హాయ్..హాయ్.. ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర నీ హంగు చూసి పొంగిపోనులేరా ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర నీ హంగు చూసి పొంగిపోనులేరా నా సామిరంగ దండమోయీ..హోయ్..నా జోలికింక రాకోయీ హాయ్..హాయ్..ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా.. ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్ ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్ ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్ ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్ ఆ బలే బలే బలే..ఆ బలే బలే బలే హోయ్.........య్యా...
సంగీతం::S.రాజేశ్వరరావు రచన::సముద్రాల గానం::భానుమతి నిర్మాతలు:భానుమతి,రామకృష్ణరావు దర్శకత్వం::రామకృష్ణారావు తారాగణం::భానుమతి,నాగేశ్వరరావు సింధుబైరవి:::రాగం పల్లవి:: ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా చరణం::1 వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం నిన్నేలువాని లీలలేరా నిన్నేలువాని లీలలేరా కన్నార కనరా ఏలుకోరా కన్నార కనరా ఏలుకోరా ఓ ఓ ఓ ఓ ఓ ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా చరణం::2 అందరాని విందుపైన ఆశలేలా అందరాని విందుపైన ఆశలేలా పొందుదుకోరు చిన్నదాని పొందనేలా అందాలరాయా అందరారా అందాలరాయా అందరారా అనందమిదియే అందుకోరా అనందమిదియే అందుకోరా ఓ ఓ ఓ ఓ ఓ ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా
సంగీతం::S.P.కోదండపాణి రచన:: కొసరాజు గానం::పద్మనాభం , L. R. ఈశ్వరి Film Directed By::K.HemaambharadhgaraRao తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి. పల్లవి:: మా ఊరు మదరాసు నా పేరు రాందాసు మా ఊరు మదరాసు నా పేరు రాందాసు కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు మథనపడి మనసుచెడి వచ్చానే అమ్మాయి మా ఊరు మదరాసు నా పేరు రాందాసు మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి చరణం::1 రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్ రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్ దేవుడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్ మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మాయి మా ఊరు మదరాసు నా పేరు రాందాసు క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా ఇంటిముందు లానుందా నిదురబోను ఫ్యానుందా కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదుకదా మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి మా ఊరు మదరాసు నా పేరు రాందాసు చరణం::2 ఊరు తిరగ బస్సుంది ప..పాయ్ ప..పాయ్ ఉండను ప్లాట్ఫారముంది ఊరు తిరగ బస్సుంది..ఉండను ప్లాట్ఫారముంది కడుపునిండా నీరుత్రాగ కార్పొరేషన్ టాపుంది ఏమున్నా లేకున్నా..ఏమున్నా లేకున్నా మిన్నయైనదొకటుంది..మిన్నయైనదొకటుంది ఏముంది ప్రేమించే హృదయముంది అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి..అహా అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి హ్యాపీగా తాపీగా..హ్యాపీగా తాపీగా బ్రతుకు పరుగు తీయాలి..బ్రతుకు పరుగు తీయాలి మా ఊరు మదరాసు నా పేరు రాందాసు మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
సంగీతం::అద్దెపల్లి రచన::దేవులపల్లి గానం::A.M.రాజ,P.సుశీల తారాగణం::S.V. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత పల్లవి:: ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జీవన మధువనిలో..పచ్చని తీగల ఉయ్యాల..ఆఆ జీవన మధువనిలో..పచ్చని తీగల ఉయ్యాల..ఆఆ ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల చరణం::1 బ్రతుకే ఎలమావితోట..మదిలో మకరందపు తేట బ్రతుకే ఎలమావితోట..మదిలో మకరందపు తేట అడుగడుగున పువ్వులబాట..అని చాటే కోయిలపాట ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అలనల్లన నా మదిలోన..పలికే బంగారు వీణ అలనల్లన నా మదిలోన..పలికే బంగారు వీణ నులిమెత్తని అంగుళిహాని..ఈ తీగలు మీటెను గాని నులిమెత్తని అంగుళిహాని..ఈ తీగలు మీటెను గాని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::పింగళి గానం::ఘంటసాల,P.సుశీల Film Directed By::Kadiri Venkata Reddy తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల పల్లవి:: అతడు::- నీవు లేక నిముసమైన నిలువ జాలనే ఆమె::- నీవు లేక నిముసమైన నిలువ జాలనే అతడు::- నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ ఆమె::- నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ అతడు::- ఈ..ఈ..ఈ..విరియ జేసినదీ ఆమె::- ఈ..ఈ..ఈ..విరియ జేసినదీ నీవు లేక నిముసమైన నిలువ జాలనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::1 అతడు::- లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా ఆమె::- లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా అతడు::- మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా ఆమె::- మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా ఆ..మదిని పూసెనుగా నీవు లేక నిముసమైన నిలువ జాలనే చరణం::2 అతడు::- ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా ఆమె::- ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా అతడు::- వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా ఆమె::- వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా ఆ..ఆ..కూడి ఉందుముగా.. నీవు లేక నిముసమైన నిలువ జాలనే నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ ఈ..ఈ..విరియ జేసినదీ
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::పింగళి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల పల్లవి:: వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా హోయ్ వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం::1 వనమునేలు బాలరాణి ఎవరో అంటూ నగరునేలు బాల రాజు చూడరాగా వనమునేలు బాలరాణి ఎవరో అంటూ నగరునేలు బాల రాజు చూడరాగా కోకిలమ్మ పాట పాడా నెలిమి పిట్ట ఆటలాడా సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం::2 కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ పండు వంటి చిన్నవాడు నిండు గుండె వన్నెకాడు చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం::3 కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే వాణ్ణి చూసి నా మనసు వళ్లె వళ్లే వళ్లే యనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా
సంగీతం::J.V. రాఘవులు రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ పల్లవి:: పది మాసాలు..మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు..బాధలను ఇన్ని మోసిన..నిన్ను మోసే వాళ్ళు..లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము..ఎంతవరకీ బంధము చరణం::1 కడుపుచించుకు..పుట్టిందొకరు కాటికి నిన్ను..మోసేదొకరు తలకు కొరివి..పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు..ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము చరణం::2 మమతే మనిషికి..బందిఖానా భయపడి తెంచుకు పారిపొ్యినా తెలియని పాశం..వెంటపడి రుణం తీర్చుకో..మంటుందీ తెలియని పాశం..వెంటపడి రుణం తీర్చుకో..మంటుందీ నీ భుజం మార్చుకో..మంటుంది ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము..ఎంతవరకీ బంధము చరణం::3 తాళి కట్టిన మగడు..లేడని తరలించుకుపోయే..మృత్యువాగదు ఈకట్టెను కట్టెలు..కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు..చితి మంటలారవు ఈ మంటలు ఆ గుండెను..అంటక మానవు ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము..ఎంతవరకీ బంధము
సంగీతం::చక్రవర్తి రచన::వేటూరి గానం::S.P.బాలు,వాణీజయరాం తారాగణం::రామకృష్ణ,చంద్రమోహన్,చంద్రకళ,ప్రభ,రాజేశ్వరీ పల్లవి:: నీలగిరి చల్లన..నీ వడి వెచ్చన నీలగిరి చల్లన..నీ వడి వెచ్చన నువ్వు నేను ఒకటైతే..నూరేళ్ళు పచ్చన నీ మది కోవెల..అన్నది కోయిల నీ జత నేనుంటే..బ్రతుకే ఊయల నీలాల...మబ్బులలో..ఓ..ఓ..ఓ తేలి తేలి పోదామా..సోలి సోలి పోదామా ప్రియతమా..ప్రియతమా..ఓ..ఓ..ఓ నీలగిరి చల్లన..నీ వడి వెచ్చన నీ మది కోవెల..అన్నది కోయిల చరణం::1 నీ లేడి కన్నులలో..ఓ..మెరిసే తారకలు నీ లేత నవ్వులలో..ఓ..విరిసే మల్లికలు నీ మాట వరసలలో..వలపే వెల్లువగా నీ పాట తోటలలో..పిలుపే వేణువుగా పులకించిన నా మదిలో..పలికించిన రాగాలు చెలరేగిన వయసులో..తీయని అనురాగాలు ఇదే ఇదేలే జీవితం..లలా..లలా జీవితంలో వసంతం..ఆ..ఆ..ఆ..ఆ ఇదే ఇదేలే..జీవితం..అహ అహ అహ జీవితంలో..వసంతం
నీలాల మబ్బులలో..ఓ..ఓ..ఓ తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా చరణం::2 ఈ ఏటి తరగలలో..ఓ..గలగలలే నీ గాజులుగా ఈ కొండగాలులలో..హా ఆ..గుసగుసలే నీ ఊసులుగా ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో ఇదే ఇదేలే..జీవితం లలా..లలా జీవితంలో వసంతం..ఆ..ఆ..ఆ..ఆ ఇదే ఇదేలే జీవితం..ఓహో..ఓహో జీవితంలో..వసంతం నీలాల మబ్బులలో..నీలాల మబ్బులలో తేలి తేలి పోదామా......
సంగీతం::T.చలపతిరావు రచన::దాశరథి గానం::P.సుశీల తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య పల్లవి:: అందే అందాలు..తమలపాకు తోడిమే పదివేలు..నేనేదింక కోరేదిక లేదు అందరివోలే అడిగేదాన్ని కాను కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను ఓ మావ..మావ..మావ..మావ..మావ ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా చరణం::1 ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది..మావా..మావా ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది ముద్దుటు౦గరం కుదువాబెట్టీ..ముద్దుటు౦గరం కుదువాబెట్టీ ముక్కుకు చక్కని ముక్కెర తేరా..మావా..మావా అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు చరణం::2 నడుమా వడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది మావా..మావా..మావా..మావా నడుమా వడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది నడుమూ...చిన్నబోయినాది నాణ్యమైన దాన్యం అమ్మీ..నడుముకు వడ్డాణ౦ తేరా నాణ్యమైన దాన్యం అమ్మీ..నడుముకు వడ్డాణ౦ తేరా..మావా అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు...నేనేదింక కోరేదిక లేదు అందరివోలే..అడిగేదాన్ని కాను కొ౦దరి వోలే..కొసరేదాన్ని కాను ఓ మావ..మావ..మావ..మావ..మావ ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా చరణం::3 కాళ్లాకు కడియాలు లేక కాళ్ళు చిన్నబోయినాయి..మావా..మావా కాళ్లాకు కడియాలు లేక..కాళ్ళు చిన్నబోయినాయి కాడి ఎద్దుల నమ్ముకోని కాడి ఎద్దుల నమ్ముకోని కాళ్లాకు కడియాలు తేరా..మావా అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు చరణం::4 పట్టెమంచం పరుపు లేక..మనసూ చిన్నబోయినాది మావా..మావా..మావా..మావా పట్టెమంచం పరుపు లేక..మనసూ చిన్నబోయినాది మనసూ...చిన్నబోయినాది పంట భూములమ్ముకోని..పట్టెమంచం పరుపూ తేరా పంట భూములమ్ముకోని..పట్టెమంచం పరుపూ తేరా..మావా అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు..నేనేదింక కోరేదిక లేదు అందరివోలే అడిగేదాన్ని కాను..కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను ఓ మావ..మావ..మావ..మావ..మావ ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
పాల బుగ్గల చినదాన్నీ పెళ్ళికాని కుర్రదాన్ని రాజ
పాల బుగ్గల చినదాన్నీ పెళ్ళికాని కుర్రదాన్ని రాజ
ఓరకంట చూడవద్దు..ఒంటిపైచేయ్ వేయవద్దు
తల్లిచాటు పిల్లనయ్యా..అల్లరిపాలూ ఔదునయ్యా
కోడె వయసు చిన్నవాణ్ణీ జోడుకోరి ఉన్నావాణ్ణీ
చదువు ఉందీ సరదాఉందీ సంపాదించే ఛాన్స్ ఉంది
తల్లి తండ్రి కాదన్నా నిను పెళ్ళియాడే ధమ్ము ఉంది
కోడె వయసు చిన్నవాణ్ణీ జోడుకోరి ఉన్నావాణ్ణీ
చరణం::1
బావయ్యో పోవయ్యో..
చదువుకొన్నా చేసేది ఏముంది
గుమాస్తవైతే ఒరిగేది ఏముంది
చదువుకొన్నా చేసేది ఏముంది
గుమాస్తవైతే ఒరిగేది ఏముంది
నీకు వచ్చే నెలజీతాలు సోకులాకే చాలవయ్యా
పాల బుగ్గల చినదాన్నీ పెళ్ళికాని కుర్రదాన్ని
చరణం::2
దొంగచాటు వ్యాపారం కనిపెట్టనే
టాక్స్ లేని డబ్బు బాగా కూడబెట్టానే
లైలానుచీరలు..పౌడర్లు..వాచీలు
లైలానుచీరలు..పౌడర్లు..వాచీలు
బంగారు బిస్కేట్లు..బ్రాందీలు..విస్కీలు
కొల్ల కొల్లగ చేరవేస్తా..చూడుపిల్లా నా తడాక
కోడె వయసు చిన్నవాణ్ణీ జోడుకోరి ఉన్నావాణ్ణీ
పోవయ్యో..దేవయ్యో..
తాగినప్పుడు జల్సాగ ఉంటుంది
దొరికిపోతే జైలే రమ్మంటాది
తాగినప్పుడు జల్సాగ ఉంటుంది
దొరికిపోతే జైలే రమ్మంటాది
దొంగ బ్రతుకు చాలునోయి
తప్పుకోవోయ్ దగులుబాజి
పాల బుగ్గల చినదాన్నీ
పెళ్ళికాని కుర్రదాన్ని
చరణం::3
కల్లాకపటం లేని రైతు బిడ్డనూ
నా కష్టంతో దేశాన్ని బ్రతికిస్తానూ
దేశానికి ప్రానమిచ్చు????----
భరతభూమి పరువు నిలుపు సూరజవాను
జైజవాన్ జైకిసాన్..జైజవాన్ జైకిసాన్
ఇద్దరిద్దరే మొనగాళ్ళు మీరు
మీర్లేనిదే దేశమ్ములేదు
పసిడి పంటలు పండించదవు నీవు
మన స్వతంత్రము నిలబెట్టదవు నీవు
జాతికెల్లా అన్నదాతవు నీవు
మాత్రు భూమికి ప్రాణదాతవు నీవు
వీర పుత్రుని వరింతునయ్యా
వీరపత్నిగ గర్వింతునయ్యా
సంగీతం::చక్రవర్తి రచన::ఆచార్య ఆత్రేయ గానం::జి.ఆనంద్, సుశీల పల్లవి:: మల్లెల వేళ..అల్లరి వేళ మల్లెల వేళ..అల్లరి వేళ మదిలో మన్మధ..లీల నీవు నేనైన..వేళ వుండిపోవాలి..ఇలా ఇలా మల్లెల వేళ..అల్లరి వేళ మదిలో మన్మధ..లీల నీవు నేనైన..వేళ వుండిపోవాలి..ఇలా ఇలా చరణం::1 ఒక మధుర మురళి మ్రోగింది యమునా తటిలో మురళీ రవళి ఒక రాగమేదొ జుమ్మంది ఒక రాధ మనసు జల్లంది బృందావనిలో అందాలొలికే ఆ రాధా మాధవ రాస క్రీడలే రసడోలలూగించు వేళ మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మధ లీల చరణం::2 ఒక నింగి వలచి చేరింది ఒక నేల ముద్దులాడింది నింగీ నేల ఉరిసీ మెరిసీ ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది అది పెళ్ళి మేళమయ్యింది దివిలో మేళం భువిలో తాళం ఆ మేళ తాళాల మేళవింపులో జగమెల్ల దీవించు వేళ మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మధ లీల నీవు నేనైన వేళ వుండిపోవాలి ఇలా ఇలా మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మధ లీల