Wednesday, July 23, 2008

మనుషులంతా ఒక్కటే--1976























సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::కోసరాజు
గానం::SP.బాలు,P.సుశీల


ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ..ఆ..లా..లా..లా..
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ

చలమయ్య వస్తాను
ఆపైన చూస్తాను
చలమయ్య వస్తాను
ఆపైన చూస్తాను
తొందర పడితె..
లాభం లేదయా..అ..ఆ..ఆ..

:::1


నీ జారుపైట ఊరిస్తువుందీ..మ్మ్..
నీకొంటే చూపు కొరికేస్తువుందీ..
నీ జారుపైట..ఊరిస్తువుందీ..అబ్బా..
నీకొంటే చూపు కొరికేస్తువుందీ..
కన్ను కన్ను ఎపుడో కలిసింది..హా..హా..

అయ్యో..ఏందయ్య గోలా
సిగ్గేమి లేదా..నాకెందుకు?
ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా..
ఏందయ్య గోలా..ఛీ..ఛీ..
సిగ్గేమిలేదా..పోదుబడాయ్..
ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా..
నిన్ను నన్ను చూస్తే నా మరదా..
ఆ..ఓ..ఆ..ఆ..మ్మ్..
ముత్యలు..ఆ..వస్తావా..మ్మ్..
అడిగింది..అబ్బో..ఇస్తావా..
ఊర్వశిలా ఇటురావే వయ్యారీ..

:::2


పర్మినెంటుగాను..ఆ..
నిన్ను చేసుకొంటాను..అబ్బో
ఉన్నదంత ఇచ్చేసి..అయ్యో..
నిన్ను చూసుకోంటాను
ఇంట బయట పట్టుకునుంటాను..
ను..హు..హు..అహా..అహా..ఎ..హె..హె..


ఏరుదాటిపోయాక
తెప్ప తగలవేస్తేనూ..
..అమ్మామ్మా..
ఊరంత తెలిసాక
వదిలిపెట్టిపోతేనూ..
బండకేసి నిను బాదేస్తానయ్యో..
ఓ..హో..ఓ..అహా..హా..
రేవులోన నిను ముంచేస్తానయ్యో
..హో..అహా...మ్మ్..ఒహో..
ముత్యాలూ..ఆ..
వస్తావా..మ్మ్..
అడిగిందీ..అయ్యో..
ఇస్తావా..
ఊర్వశిలాఇటురావే
వయ్యారీ..ఇ..హీ..ఈ..ఓ..
చలమయ్యా ..ఆ..
వస్తానూ..అబ్బో..
ఆపైనా..చూస్తాను..అయ్యో..
తొందరపడితే లాభన్
లేదయ్యా..డ..డా..డా..లా..
ముత్యాలు..ఆ..
వస్తావా..మ్మ్..
అడిగిందీ..ఆ..
ఇస్తావా..??

Saturday, July 19, 2008

భక్తపోతన--1942




సంగీతం::నాగయ్య
రచన::సముద్రాల సీనియర్
గానం::నాగయ్య

పల్లవి::

పావన గుణ రామా హరే..పావన గుణ రామా హరే
రామాహరే..పావన గుణ రామా హరే
పరమదయా నిలయా హరే..పరమదయా నిలయా హరే
పావన గుణ రామా హరే..రామా హరే

చరణం::1

మాయా మానుషరూపా..మాయాతీతా మంగళ దాతా
మాయా మానుషరూపా..మాయాతీతా మంగళ దాతా
వేదాంత వధూ హృదయ విహారా..వేదాంత వధూ హృదయ విహారా
వేదమయా పరమానందరూపా..వేదమయా పరమానందరూపా
పావన గుణ రామా హరే..రామా హరే

చరణం::2

కరుణారసభర నయనా..దరహాస మనోహర వదనా
కరుణారసభర నయనా..దరహాస మనోహర వదనా
నవతులసీదళ మాలాభరణా..నవతులసీదళ మాలాభరణా
నానా జీవన నాటకకారణ..నానా జీవన నాటకకారణ
పావన గుణ రామా హరే..రామా హరే
పరమదయా నిలయా హరే..పరమదయా నిలయా హరే
పావన గుణ రామా హరే..రామా హరే

Friday, July 11, 2008

అన్నదమ్ముల అనుబంధం--1975
























సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల,V.రామక్రిష్ణ, బౄందం.


లాలలాల లాలలాల లలాలలా
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
ఓ..వెళ్ళేసరికి గదిలో ఏదో అలికిడీవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో అలజడి అవుతున్నదీ

.....యా......హా......హా......బ....బ....బా......

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ

లాల లాల లాల లలలలా
లాల లాల లాల లలలలా
అందమైన పిల్లవాదు రమ్మన్నాడు
జూ..జూ..జూ..జు...
సందెవేళ అందమంత తెమ్మన్నడు
ఆ..హా..హా..హా..హా..
వెళ్ళేసరికి..గాజులగలగలా
వెళ్ళేసరికి గాజుల గలగల
గదిలో వినిపించిందీ
గలగల వింటే మదిలో ఏదో
అలజడి చెలరేగిందీ..యా


అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
వెళ్ళేసరికి గదిలో ఏదో అలికిడీవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో అలజడి అవుతున్నదీ..యా

కన్నెపిల్ల కారులోన కనిపించిందీ
లాల లలలా
కన్నుగీటి నన్ను నేడు బులిపించిందీ
లా లా లా లలా..
కన్నెపిల్ల కారులోన కనిపించిందీ
కన్నుగీటి నన్ను నేడు బులిపించిందీ
చూపులలోనే..కైపులలోనా..
చూపులలోనే..కైపులలోనా..ఊయల ఊగించిందీ
ఎన్నడులేని ఏన్నో ఆశలు నాలో ఊరించిందీ..య్య


అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
వెళ్ళేసరికి గదిలో ఏదో అలికిడీవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో అలజడి అవుతున్నదీ..య్యా

అన్నదమ్ముల అనుబంధం--1975

























సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల



గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే...
ఇలాంటి వేళ ఆడాలి జతగా..
ఇలాగె మనము వుండాలిలే...
మనసు దోచి..మాయజేసీ..
చెలినే మరచిపోవొద్దోయిరాజ..రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే...

వసంత రాణి నీకోసమే కుషిగ వచ్చింది
చలాకి నవ్వు చిందించుచు ఉషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారి లాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచీ...మమతపెంచీ
విడిచిపోనని మాటివ్వాలి రాజ..రాజా...

గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే...


మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేనూ..
యుగాలకైనా నాదానవై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే స్మరించుకొంటాను
మనసు నీదే..మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే సోనీ..

గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే..
.
ఇలాంటివేళ ఆడాలి జతగా
ఇలాగె మనము వుండాలిలే..
లాలలా..లాలలా..లాలలా..

అన్నదమ్ముల అనుబంధం--1975









సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,V.రామకృష్ణ

తారాగణం::N.T.రామారావు, మురళిమోహన్, బాలకృష్ణ,జయమాలిని, కుమారి లత, కాంచన
:::

ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే


ఏటేటా మన ఇంటా ఈ పండగే జరగాలీ
ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలీ
ఏటేటా మన ఇంటా ఈ పండగే జరగాలీ
ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలీ
వెలుతురైనా..చీకటైనా..విడిపోదు ఈ అనుబంధం
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే


తారకలే..దిగివచ్చీ తారంగం ఆడాలీ
వెన్నెలలే..ముంగిటిలో..వేణువులై..పాడాలి
తారకలే..దిగివచ్చీ తారంగం ఆడాలీ
వెన్నెలలే..ముంగిటిలో..వేణువులై..పాడాలి
ఆటలాగా..పాటలాగా..సాగాలి మనజీవితం
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే

అన్నదమ్ముల అనుబంధం--1975

















ఇక్కడ పాట వినండి
సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు,బౄందం.


కౌగిలిలో ఉయ్యలా కన్నులలో జంపలా
కౌగిలిలో ఉయ్యలా కన్నులలో జంపలా
కలిసి ఊగాలిలే..కరిగిపోవాలిలే..
తనివితీరాలిలే....య్య..
కౌగిలిలో ఉయ్యలా కన్నులలో జంపలా..య్య

హ్హా..హ్హా...హ్హా..హ్హా...హ్హా..
నీ..బుగ్గలపై..ఆ ఎరుపూ..
నీ..పెదవులపై..ఆ మెరుపూ..
వెలుతురులో..చీకటిలో..వెలిగిపోయేనులే..
హే..హే..నన్ను కోరేనులే..
అ..హహా..హ్హా..హా..నా..పెదవులపై
ఈ..పిలుపు..హ్హా..హ్హా..ఓ..నా..హౄదయంలో..
నీ..తలపూ..హ్హా..హ్హా..ఆ...వెలుతురులో..ప్పా..ప్పా..ప్పా..
చీకటిలో..డూ..డూ..డూ..
వెలుతురులో..చీకటిలో..నిలిచివుండేనులే..
నిన్ను కోరేనులే..హే..హే..హే..
కౌగిలిలో ఉయ్యలా కన్నులలో జంపలా
కలిసి ఊగాలిలే..కరిగిపోవాలిలే..
తనివితీరాలిలే....య్య..


హ్హా..హ్హా...హ్హా..హ్హా...హ్హా..
గులాబీలా..విరబూసే..నీ..సొగసూ..
సెలయేరై..చెలరేగే..నీ వయసూ..
అందరిలో..ఎందుకనో..ఆశరేపేనులే..హే..హే..
అల్లరి చేసేనులే..హ్హా..హ్హా..హ్హా..కసిగా
కవ్వించే..జు..జు..జు..నీ..చూపూ..హ్హ..హ్హా..
హ్హ..ఆ..జతగా..కదిలించే..నీ..ఊపూ..ఆ..
రేఅయినా..పగలైనా..బబబ్బబ్బాబ్బా..
రేఅయినా..పగలైనా..నన్ను మురిపించులే..మేను మరిపించులే..హే..హే..
కౌగిలిలో ఉయ్యలా కన్నులలో జంపలా
కలిసి ఊగాలిలే..కరిగిపోవాలిలే..
తనివితీరాలిలే....య్య
....

Thursday, July 10, 2008

బుల్లెమ్మా బుల్లోడు --1972







సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::దాశరధి
గానం::SP.బాలు,P.సుశీల


::::::::::::::::::::::::::::


అతడు::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
అతడు::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
మమతల మూటా

దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు..అమ్మ అన్నదీ
ఆమె:...ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
మమతల మూటా

అతడు::అమ్మంటే అంతులేని సొమ్మురా
ఆమె::అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అతడు::అమ్మ మనసు అమృతమే చిందురా
ఆమె::అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా..ఉందిరా..
ఇద్దరూ::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా..
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా..మమతల మూట

ఆమె::అంగడిలో దొఱకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
ఆమె::అంగడిలో దొఱకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అతడు::అమ్మ ఉన్న ఇంటిలో లేనిది యేదీ
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది యేదీ
అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ..నాదీ..
ఇద్దరూ::అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా..మమతల మూటా..

బుల్లెమ్మా బుల్లోడు --1972





















సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ 


రాజా..రాజా..
రాజా పిలుపు నాదెను రా
నీ నీడ గా నీ తొడుగా
నీవెంట ఉంటనురా
నినువీడి పొలేనురా
రాజా పిలుపు నాదెను రా
నీ నీడ గా నీ తొడుగా
నీవెంట ఉంటనురా
నినువీడి పొలేనురా
రాజా...రాజా..


నీ ముందు నే నిలిచినా
నిను చేరుకొలెనురా
ఈ చోట నేనున్నా
నీ కొసమె నేనురా
మరుజన్మ లొ నైన
నీదాననౌవాతాను రా
ఈ బంధము అనుబంధము
కడలెని కధ రా దొరా
కడలెని కధ రా దొరా

రాజా పిలుపు నాదెను రా
నీ నీడ గా నీ తొడుగా
నీవెంట ఉంటనురా
నినువీడి పొలేనురా
రాజా...రాజా..


పల్లవి లేని పాటను రా
పగలే చూడని రేయిని రా
కరిగిన కల నేను రా
కదలని శిలనయితి రా
పల్లవి లేని పాటను రా
పగలే చూడని రేయిని రా
కరిగిన కల నేను రా
కదలని శిలనయితి రా
ఈ బంధము అనుబంధము
కడలెని కధ రా దొరా
కడలెని కధ రా దొరా

రాజా పిలుపు నాదెను రా
నీ నీడ గా నీ తొడుగా
నీవెంట ఉంటనురా
నినువీడి పొలేనురా
రాజా...రాజా..

Monday, July 07, 2008

శ్రీవారి ముచట్లు--1981




సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SPబాలు,S.జానకి

Film DirecTed By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల.
పల్లవి::
ఆ...ఆ...ఆ...ఆ...
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో
పాడిందీ...ఒక రాధికా
పలికిందీ...రాగమాలికా
ఇదే..ఇదే..ఇదే..నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో...

సరిసరిసరిసరి మమమమ
సరిసరిసరిసరి..ససససస
రిరిరిరిరిరి..రీరీరీరీరీ
గగరిరిగగరిరిగగరిరి..సనిస
స..నినినిని..స..ససససస..
నిసనిసనిస..గగరిరిసనిస..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ......

కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పునాట్యాలు నాట్యభారతి పాదాలా పారాణి అద్దగా
కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పునాట్యాలు నాట్యభారతి పాదాలా పారాణి అద్దగా
అడుగున అడుగిడి స్వరముల ముడివడి
అడుగే పైపడి మనసే తడబడి
మయూరివై కదలాడగా వయ్యారివై...
నడయాడగా..ఇదే ఇదే ఇదే నా అభినందనగీతికా..
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో...

సనిసరి దని సరిసా...మదనిరిసా
సనిసరి దని సగరీ...దని సగరీ
సరిమపనిపమరినిపమపమరి నపమరి
దనిసరిసరి..దనిసరిసరిసా..ఆ..
నిసనిసరీ..నిసనిసరీ..నిసరిమరిమరిసరి
సనిస దనిసరిసా.. మదనిసగమగమనిదమ

పయనించు మేఘాలు నిదురించుసౄష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా..
పయనించు మేఘాలు నిదురించుసౄష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా..
స్వరముల స్వరమై పదముల పదమై
పదమే స్వరమై స్వరమే వరమై దేవతవై..అగుపించగా..
జీవితమే..అర్పించగా...
ఇదే ఇదే ఇదే...నా అభినందన గీతికా..

ఉదయకిరణ రేఖలో..ఆ
హౄదయ వీణ తీగలో..ఆ
ఉదయకిరణ రేఖలో..ఆ
హౄదయ వీణ తీగలో..ఆ
పాడిందీ...ఒక రాధికా..ఆ..ఆ
పలికిందీ...రాగమాలికా..ఆ..ఆ
ఇదే..ఇదే..ఇదే..నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో..ఆ
హౄదయ వీణ తీగలో...ఆ..ఆ..లో...

Sunday, July 06, 2008

కలెక్టర్ జానకి--1972







సంగీతం::V.కుమార్
రచన::C.నారాయణ రెడ్డిగానం:: SP.బాలు

పాట ఆగిందా ఒక సీటు గోవిందా
సీటు పోయిందా ఒకరి ఆట గోవిగా
పాట ఆగిందా ఒక సీటు గోవిందా
సీటు పోయిందా ఒకరి ఆట గోవిగా

కాసులపేరుల రవ్వలగాజుల కాంతమ్మగారు
అయ్యోరామ అంతలోనే ఔటైపోయారు
కాసులపేరుల రవ్వలగాజుల కాంతమ్మగారు
అయ్యోరామ అంతలోనే ఔటైపోయారు
ఆరుగురూమ్మలు వున్నారు అంగలు వేస్తూ వున్నారు
పాట వింటూవున్నారు పోటీపడుతువున్నారు
జీవితమే..ఒక ఆట అది వెలుగు నీడల సయ్యాట
పాట ఆగిందా ఒక సీటు గోవిందా
సీటు పోయిందా ఒకరి ఆట గోవిగా..ఓ..


బాబ్డుహేరు బ్రౌన్ గౌను బాలమ్మగారు
ఓమైగాడ్ ఇంతలోనే ఔటైపోతారు
బాబ్డుహేరు బ్రౌన్ గౌను బాలమ్మగారు
ఓమైగాడ్ ఇంతలోనే ఔటైపోతారు
ముగ్గురు అమ్మలు వున్నారు ముందుకు దూకుతు ఉన్నారు
అందరు చూస్తూవున్నారు కొందరు కులుకుతు వున్నారు
జీవితమే ఒక ఆట అది వెలుగు నీడల సయ్యాటా..
పాట ఆగిందా...


నీలి నీలి పూల చీర చిన్నమ్మగారూ
అయ్యోపాపం ఆకరిదశలో ఔటైపోయారు
నీలి నీలి పూల చీర చిన్నమ్మగారూ
అయ్యోపాపం ఆకరిదశలో ఔటైపోయారు
ఇద్దరు అమ్మలె వున్నారు ఒకరిని మించినవారొకరు
ఇద్దరిలో గెలుపెవ్వరిది ఇపుడే తేలిపోతుంది
జీవితమే ఒక ఆట అది వెలుగు నీడల సయ్యాటా..
పాట ఆగిందా ఒక సీటు గోవిందా
..???

ప్రేమాభిషేకం --- 1981




సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SP.బాలు,P.సుశీల


దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా


నీకై జపించి జపించి తపించు తపించు భక్తునిపైనా..
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా
దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా

మౌన భంఘమూ మౌన భంఘము
భరియించదు ఈ దేవి హౄదయము
ప్రేమ పాఠము ప్రేమ పాఠము
వినకూడదు ఇది పూజా సమయము
దేవి హౄదయము విశాలమూ
భక్తుని కది కైలాసమూ
హే..దేవి హౄదయము విశాలమూ
భక్తునికది కైలాసమూ..
కోరిక కోరుట భక్తుని వంతు..
అడగక తీర్చుట దేవత వంతు
ధూపం వేయుట భక్తుని వంతు
పాపం మోయుట దేవుని వంతు
పాపానికి మోక్షం ధూప దర్శనం
ఈ పాణికి మోక్షం నామస్మరణం..నీ..నామస్మరణం
దేవీ...దేవీ...దేవీ...దేవీ...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా

నీకై జపించి జపించి తపించు తపించు భక్తునిపైనా..హా...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా

స్వామి విరహము అహోరాత్రము
చూడలేదు ఈ దేవి హౄదయము
దేవీ స్తోత్రము నిత్యకౄత్యము
సాగనివ్వదు మౌన వ్రతము...
స్వామి హౄదయము ఆకాశమూ..
దేవికి మాత్రమే అవకాశమూ..
అ..హా..హ..హా..
స్వామి హౄదయము ఆకాశమూ..
దేవికి మాత్రమే అవకాశమూ..
అర్చన చేయుట దాసుని వంతు
అనుగ్రహించుట దేవత వంతు..
కోపం తాపం మా జన్మహక్కు
పుష్పం పత్రం అర్పించి మొక్కు
నా హౄదయం..ఒక పూజా పుష్పం
నా అనురాగం ఒక ప్రేమ పత్రం..
నా...ప్రేమ పత్రం...

దేవీ...దేవీ...దేవీ...దేవీ...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
నీకై జపించి జపించి తపించు తపించు భక్తునిపైనా..హా...
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా
దేవీ కోపమా...శ్రీదేవీ కోపమా...

Saturday, July 05, 2008

ప్రేమాభిషేకం --- 1981



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SP.బాలు,P.సుశీల


నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హౄదయం చెపుతుందీ...
నువ్వు ప్రేమించావని..నన్ను ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని..నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని

నింగి నేల కలపాలి..నీకు నాకు ప్రేమనీ
ఊరు వాడ చెప్పాలి..నీకు నాకు పెళ్ళనీ
నింగి నేల తెలపాలి..నీకు నాకు ప్రేమనీ
ఊరువాడ చెప్పాలి..నీకు నాకు పెళ్ళనీ
ప్రేమనే పెళ్ళనీ..ఈ పెళ్ళే..ప్రేమనీ
ప్రేమా..పెళ్ళి..జంటనీ..నూరేళ్ళ పంటనీ
నూరేళ్ళ పంటనీ...

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని

కన్నులు చూడని పెదవులు పలకని హౄదయం చెపుతుందీ...
నువ్వు ప్రేమించావని..నన్ను ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని..నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని


గుండెను గుండే చేరాలీ..మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ..తీపికి తీపే చెలిమని...
గుండెను గుండే చేరాలీ..మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ..తీపికి తీపే చెలిమని...
తోడంటే నేననీ..చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ...నూరేళ్ళ పంటనీ..
నూరేళ్ళ పంటనీ...

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని

కన్నులు చూడని పెదవులు పలకని హౄదయం చెపుతుందీ...
నువ్వు ప్రేమించావని..నన్ను ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని..నన్నే ప్రేమించావనీ


నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని