Friday, August 17, 2007
ఆస్తిపరులు--1966
సంగీతం::KV.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
చిట్టి అమ్మలూ..చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
ఎవరికెవరు వే శారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
నీకు నేను అమ్మనూ నాన్ననూ (2)
నాకు నీవే లోకాన సర్వమూ (2)
కన్న కడుపు తీయదనం కన్న
నీకు అన్న ఒడి వెచ్చదనం మిన్న
పదినాళ్ల పాపగానే ఒదిగావు (2)
హృదయమే ఊయలగా ఊగావు (2)
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్లే నీకింక నీ వాళ్లు (2)
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్లు
అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదను చీల్చి పాడుతున్న జోలలు (2)
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు (2)
Labels:
Hero::A.N.R,
Singer::Ghantasaala,
ఆస్తిపరులు--1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment