Friday, August 03, 2007

ఇద్దరు మిత్రులు--1961

సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల

తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 

పల్లవి::

చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే

ఉక్కిరి బిక్కిరి అయిపోతానే...

టక్కరిబావా కిక్కురుమనకు..ఇక్కడిమాట ఇతరులువింటే
ఉక్కిరి బిక్కిరి అయిపోతావే...

చరణం::1
అల్లరిపిల్లా ఆపవేలా..పుల్లవిరుపు మాటలు
అల్లరిపిల్లా ఆపవేలా..పుల్లవిరుపు మాటలు
పెళ్ళాం కనపడితే..ప్రేమే కలిగిందా..
పెళ్ళాం కనపడితే..ప్రేమే కలిగిందా..
పెళ్ళాం అంటే బెల్లమూ..తల్లీ తండ్రీ అల్లము
పెళ్ళాం అంటే బెల్లమూ..తల్లీ తండ్రీ అల్లము

టక్కరిబావా కిక్కురుమనకు..ఇక్కడిమాట ఇతరులువింటే
ఉక్కిరి బిక్కిరి అయిపోతావే...

చరణం::2

ముద్దులగుమ్మ మోహమాయే..పొద్దు చాలా పోయేనే
ముద్దులగుమ్మ మోహమాయే..పొద్దు చాలా పోయేనే
పెద్దలు గర్జిస్తే..పెడసరమవుతావా
పెద్దలు గర్జిస్తే..పెడసరమవుతావా
పెద్దల గొడవ ఎందుకే..ఇద్దరమొకటై ఉందామే

చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే...

చరణం::3

మీ నాయనగారి మీసమూ..చూస్తే సన్యాసమూ
మీ నాయనగారి మీసమూ..చూస్తే సన్యాసమూ
అబ్భా..అబ్భబ్భా..నీ మాటలు కొరడాదెబ్బలూ
అబ్భా..అబ్భబ్భా..నీ మాటలు కొరడాదెబ్బలూ
సూటిగ పెళ్ళాడీ..చాటుగ రానేలా
సూటిగ పెళ్ళాడీ..చాటుగ రానేలా
చేయకు నన్ను దూరమూ..తీయకు మీనా ప్రాణమూ
చేయకు నన్ను దూరమూ..తీయకు మీనా ప్రాణమూ

టక్కరిబావా కిక్కురుమనకు..ఇక్కడిమాట ఇతరులువింటే
ఉక్కిరి బిక్కిరి అయిపోతావే...
చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే

No comments: