Showing posts with label Music Director::S.Rajeswara Rao. Show all posts
Showing posts with label Music Director::S.Rajeswara Rao. Show all posts

Thursday, February 16, 2017

మిస్సమ్మ--1955::శుద్ధసావేరి::రాగం




సంగీతం::S.రాజేశ్వరరావు
రచన:: పింగళి నాగేంద్రరావు 
గానం::A.M.రాజ,P.సుశీల
Film Directed By::L.V.Prasaad
తారాగణం::N.T.R.,రేలంగి,A.N.R.,రమణారెడ్డి,S.V.రంగారావు,అల్లురామలింగయ్య,బాలకృష్ణ,గుమ్మడి,ఋష్యేద్రమణి,జమున,సావిత్రి,మీనాక్షీ,  

శుద్ధసావేరి::రాగం
{హిందుస్తాని::దుర్గా} 

పల్లవి::

బృందావనమది..అందరిది
గోవిందుడు అందరి..వాడేలే
బృందావనమది..అందరిది
గోవిందుడు అందరి..వాడేలే
ఎందుకే రాధా..ఈశునుసూయలు
అందములందరి..ఆనందములే
ఎందుకే రాధా..ఈశునుసూయలు
అందములందరి..ఆనందములే
బృందావనమది..అందరిది
గోవిందుడు అందరి..వాడేలే

చరణం::1

పిల్లన గ్రోవిని పిలుపులు..వింటె
ఉల్లము ఝల్లున..పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు..వింటె.. ఉల్లము ఝల్లున..పొంగదటే
రాగములో అనురాగము..చిందిన
జగమే..ఊయలలూగదటే
రాగములో అనురాగము..చిందిన 
జగమే..ఊయలలూగదటే

బృందావనమది..అందరిది
గోవిందుడు అందరి..వాడేలే

చరణం::2

రాసక్రీడల రమణుని..గాంచిన 
ఆశలు మోశులు..వేయవటే
రాసక్రీడల రమణుని..గాంచిన 
ఆశలు మోశులు..వేయవటే
ఎందుకే రాధా..ఈశునుసూయలు
అందములందరి..ఆనందములే 

బృందావనమది..అందరిది
గోవిందుడు అందరి..వాడేలే
గోవిందుడు అందరి..వాడేలే

Missamma--1955
Music::S.Raajeswara Rao
Lyrics::Pingali Naagendra Rao 
Singer's::A.M.Raaja,P.Suseela
Film Directed By::L.V.Prasaad
Cast::N.T.R.,Relangi,A.N.R.,Ramanaa Reddi,S.V.Rangaa Rao,
Alluraamalingayya,Baalakrshna,Gummadi,Rshyedramani,Jamuna,Saavitri,Meenaakshii,  

::::::::::::::::::::::::::::::::

bRndaavanamadi..andaridi
gOvinduDu andari..vaaDElE

bRndaavanamadi..andaridi
gOvinduDu andari..vaaDElE

endukE raadhaa..iiSunusooyalu
andamulandari..aanandamulE

endukE raadhaa..iiSunusooyalu
andamulandari..aanandamulE

bRndaavanamadi..andaridi
gOvinduDu andari..vaaDElE

::::1

pillana grOvini pilupulu..vinTe
ullamu jhalluna..pongadaTE
pillana grOvini pilupulu..vinTe
ullamu jhalluna..pongadaTE
raagamulO anuraagamu..chindina
jagamE..uuyalaloogadaTE
raagamulO anuraagamu..chindina 
jagamE..uuyalaloogadaTE

bRndaavanamadi..andaridi
gOvinduDu andari..vaaDElE

::::2

raasakreeDala ramaNuni..gaanchina 
ASalu mOSulu..vEyavaTE
raasakreeDala ramaNuni..gaanchina 
ASalu mOSulu..vEyavaTE
endukE raadhaa..iiSunusooyalu
andamulandari..aanandamulE 

bRndaavanamadi..andaridi
gOvinduDu andari..vaaDElE
gOvinduDu andari..vaaDElE

Wednesday, February 15, 2017

మిస్సమ్మ--1955::సింధు భైరవి::రాగం




సంగీతం::S.రాజేశ్వరరావు
రచన:: పింగళి నాగేంద్రరావు 
గానం::P.లీల
Film Directed By::L.V.Prasaad
తారాగణం::N.T.R.,రేలంగి,A.N.R.,రమణారెడ్డి,S.V.రంగారావు,అల్లురామలింగయ్య,బాలకృష్ణ,గుమ్మడి,ఋష్యేద్రమణి,జమున,సావిత్రి,మీనాక్షీ,  

సింధు భైరవి::రాగం 

పల్లవి::

ఏమిటో..నీ మాయ..ఆ..ఓఓఓ
చల్లని రాజా..వెన్నెల రాజా
ఏమిటో..నీ మాయ..ఆ..ఓఓఓ
చల్లని రాజా..వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ..ఆ

చరణం::1

వినుటయే కాని..వెన్నెల మహిమలు 
వినుటయే కాని..వెన్నెల మహిమలు 
అనుభవించి..నే నెరుగనయా 
అనుభవించి..నే నెరుగనయా 
నీలో వెలసిన..కళలూ కాంతులు  
నీలో వెలసిన..కళలూ కాంతులు 
లీలగా ఇపుడే..కనిపించెనయా 

ఏమిటో...నీ మాయ
ఓ చల్లని రాజా..వెన్నెల రాజా
ఏమిటో...నీ మాయ 

చరణం::2

కనుల కలికమిది..నీ కిరణములే
కనుల కలికమిది..నీ కిరణములే
మనసును..వెన్నగా చేసెనయా
మనసును..వెన్నగా చేసెనయా
చెలిమి కోరుతూ..యేవో పిలుపులు
చెలిమి కోరుతూ..యేవో పిలుపులు
నాలో నాకే..వినిపించెనయా 

ఏమిటో...నీ మాయ
ఓ చల్లని రాజా..వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

Missamma--1955
Music::S.Raajeswara Rao
Lyrics::Pingali Naagendra Rao 
Singer's::P.Leela
Film Directed By::L.V.Prasaad
Cast::N.T.R.,Relangi,A.N.R.,Ramanaa Reddi,S.V.Rangaa Rao,
Alluraamalingayya,Baalakrshna,Gummadi,Rshyedramani,Jamuna,Saavitri,Meenaakshii,  

::::::::::::::::::::::::::::::::

EmiTO..nii maaya..aa..OOO
challani raajaa..vennela raajaa
EmiTO..nii maaya..aa..OOO
challani raajaa..vennela raajaa
EmiTO nii maaya..aa

::::1

vinuTayE kaani..vennela mahimalu 
vinuTayE kaani..vennela mahimalu 
anubhavinchi..nE neruganayaa 
anubhavinchi..nE neruganayaa 
neelO velasina..kaLaluu kaantulu  
neelO velasina..kaLaluu kaantulu 
leelagaa ipuDE..kanipinchenayaa 

EmiTO...nii maaya
O challani raajaa..vennela raajaa
EmiTO...nii maaya 

::::2

kanula kalikamidi..nii kiraNamulE
kanula kalikamidi..nii kiraNamulE
manasunu..vennagaa chEsenayaa
manasunu..vennagaa chEsenayaa
chelimi kOrutoo..yEvO pilupulu
chelimi kOrutoo..yEvO pilupulu
naalO naakE..vinipinchenayaa 

Wednesday, March 30, 2016

విప్రనారాయణ--1954



సంగీతం::S.రాజేశ్వర్‌రావు  
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.భానుమతి,బృందం
Film Directed bY::Ramakrishna
తారాగణం::అక్కినేని,పి.భానుమతి,రేలంగి,వి.శివరాం,సంధ్య,అల్లు రామలింగయ్య,
ఆర్.నాగేశ్వరరావు

పల్లవి::

రంగ రంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
విరజానదియే శ్రీకావేరి పరమపదమ్మే శ్రీరంగం
విరజానదియే శ్రీకావేరి పరమపదమ్మే శ్రీరంగం
శ్రీరంగడే పరమాత్ము దేవుడు శరణను మోక్షమునొసగే దేవుడు

రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
శ్రీరంగా శ్రీరంగా శ్రీరంగా

రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార

Monday, September 21, 2015

భక్త ప్రహ్లాద--1967



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::సముద్రాలరాఘవాచారి
గానం::P.సుశీల
తారాగణం::హరినాథ్,S.V.రంగారావు,అంజలిదేవి,బేబిరోజారమణి రమణారెడ్డి,

పల్లవి::

ఆదుకోవయ్యా..ఓ..రమేశా..ఆ..ఆదుకోవయ్యా
పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవ
భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా..ఆ
ఆదుకోవయ్యా

బృందం:: 

సర్వలోకకారణా..సకలశోక వారణా
జన్మజన్మకారణా..జన్మబంధ మోచనా..ఆ
దుష్టగర్వ శిక్షణా..శిష్ట శాంతి రక్షణా..శాంతి రక్షణా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవే కదా 

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు 
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ 

నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా

హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీపద యుగళీ సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా ..పన్నగశయనా నారాయణా
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

భవజాధినిబడి తేలగలేని..జీవులబ్రోచే పరమపురుషా 
నను కాపాడి నీ బిరుదమునూ..నిలుపుకొంటివా శ్రితమందారా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

విశ్వమునిందీ వెలిగే నీవే..నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగ్నేలా..విషధర శయనా విశ్వపాలనా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా దేవా

Sunday, September 20, 2015

మిస్సమ్మ--1955::కాపీ::రాగం



సంగీతం::సాలూరిరాజేశ్వరరావు
రచన::పింగళినాగేద్రరావు
గానం::A.M.రాజ
Film Directed By::L.V.Prasad
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,జమున,రేలంగి,ANR,S.V.రంగారావురమణారెడ్డి.
కాపీ::రాగం 

పల్లవి::

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

చరణం::1

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మరియాదగా పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

చరణం::2

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

Missamma--1955
Music::Saluri Rajeshwar rao
Lyrics::PingalinagendraRao
Singer::A.M.Raja
Film Directed By::L.V.Prasad
Cast::NT Rama Rao, Akkineni Nageshwar Rao, Savitri
kaapii::raagam

:::::::::

avunanTE kAdanilE kAdanTE avunanilE
avunanTE kAdanilE kAdanTE avunanilE
ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE

::::1

aligi tolagi nilichinachO
aligi tolagi nilichinachO
chelimi jEya rammanilE
chorava chEsi rammanuchO
chorava chEsi rammanuchO
mariyAdagA pommanilE

ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE

::::2

visigi nasigi kasirinachO
visigi nasigi kasirinachO
vishayamasalu ishTamulE
tarachi tarachi UsaDigina
tarachi tarachi UsaDigina
sarasamiMka chAlanilE

ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE
avunanTE kAdanilE kAdanTE avunanilE
avunanTE kAdanilE kAdanTE avunanilE
ADuvAri mATalaku ardhAlE vErulE
ardhAlE vErulE ardhAlE vErulE

Tuesday, September 01, 2015

ప్రేమ-పగ--1978::కల్యాణి::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::దాశరథి
గానం::S.P.బాలు,వాణీజయరాం
Film Directed By::B.V.Prasaad 
తారాగణం::బాలయ్య,మురళీమోహన్,రూప,లత,సావిత్రి,శారద,ప్రభాకరరెడ్డి,కైకాలసత్యనారాయణ.

కల్యాణి::రాగం 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలిసిన హృదయాలలోన
కలిసిన హృదయాలలోన
పలికెను అనురాగ వీణ..ఆఆఅ 
కలిసిన..హృదయాలలోన 
పలికెను..అనురాగ వీణ..ఆఆఆ

చరణం::1

మధుర మనోహర మోహన గీతం 
మధుర మనోహర మోహన గీతం 
మదిలో మెదిలే మమతల సారం 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మధుర మనోహర మోహన గీతం 
మదిలో మెదిలే మమతల సారం
రమ్మని పిలిచే యమునా తీరం 
రమ్మని పిలిచే యమునా తీరం 
రాధా మాధవ రాగ తాళ భావ గీతిలో
కలిసిన హృదయాలలోన 
పలికెను అనురాగ వీణ..ఆఆఆ
కలిసిన హృదయాలలోన

చరణం::2

పమగరిగా..పమగరిగా
నిదపమపా..నిదపమపా
మమదదనినినిరీరీగరిస
మమదదనీనీరీరీగరిస
నిరినిదా..దనిదమా..మదమగ..ఆ 

తేనెలు చిలికే..సుందర కుసుమం
ఝుమ్మని పలికే..అల్లరి భ్రమరం 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తేనెలు చిలికే సుందర కుసుమం 
ఝుమ్మని పలికే అల్లరి భ్రమరం
కలిసిన నాడే కలుగును ప్రణయం 
కలిసిన నాడే కలుగును ప్రణయం
కవితా లలితా తోడు నీడ లేక నిలుచునా
కలిసిన హృదయాలలోన..పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన..ఆ ఆ ఆ ఆ ఆ

Prema-Paga--1978 
Music::Saaloori RaajesvaraRao 
Lyrics::Dasarathi
Singer's::S.P.Baalu,Vanijayaram
Film Directed By::B.V.Prasaad 
Cast::Balayya,Muralimohan,Latha,Roopa,Saavitri,Sarada,KaikalaSatyanarayaNa,PrabhakarReddi.

::::::::::::::::::::::::::::


aa aa aa aa aa aa aa aa aa aa aa
kalisina hRdayaalalOna
kalisina hRdayaalalOna
palikenu anuraaga veeNa..aaaaa 
kalisina..hRdayaalalOna 
palikenu..anuraaga veeNa..aaaaaa

::::1

madhura manOhara mOhana geetam
madhura manOhara mOhana geetam 
madilO medilE mamatala saaram 
aa aa aa aa aa aa aa
madhura manOhara mOhana geetam 
madilO medilE mamatala saaram
rammani pilichE yamunaa teeram 
rammani pilichE yamunaa teeram 
raadhaa maadhava raaga taaLa bhaava geetilO
kalisina hRdayaalalOna 
palikenu anuraaga veeNa..aaaaaa
kalisina hRdayaalalOna

::::2

pamagarigaa..pamagarigaa
nidapamapaa..nidapamapaa
mamadadanininiriiriigarisa
mamadadaniiniiriiriigarisa
nirinidaa..danidamaa..madamaga..aa 

tEnelu chilikE..sundara kusumam
jhummani palikE..allari bhramaram
aa aa aa aa aa aa aa aa
tEnelu chilikE sundara kusumaM 
jhummani palikE allari bhramaram
kalisina naaDE kalugunu praNayam 
kalisina naaDE kalugunu praNayam
kavitaa lalitaa tODu neeDa lEka niluchunaa
kalisina hRdayaalalOna..palikenu anuraaga veeNa
kalisina hRdayaalalOna..aa aa aa aa aa

Friday, July 17, 2015

మిస్సమ్మ--1955::ఆనందభైరవి::రాగం




సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::P.లీల
Film Directed By::L.V.Prasaad
తారాగణం::నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రి,S.V.రంగారావు,జమున,రేలంగి వెంకటరామయ్య,ఋష్యేంద్రమణి,
రమణారెడ్డి,అల్లు రామలింగయ్య,గుమ్మడి వెంకటేశ్వరరావు.

ఆనందభైరవి::రాగం 

పల్లవి::

శ్రీ జానకీ దేవీ..సీమంతమలరే
మహలక్ష్మి సుందర..వదనము గనరే
శ్రీ జానకీ దేవి..సీమంతమలరే

చరణం::1

పన్నీరు గంధాలు..సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు..చదివించరమ్మా
పన్నీరు గంధాలు..సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు..చదివించరమ్మా
మల్లే మొల్లల తరులు..సఖి జడను సవరించీ
ఎల్లా వేడుకలిపుడూ..చేయించరమ్మా
శ్రీ జానకీ దేవీ..సీమంతమలరే
మహలక్ష్మి సుందర..వదనము గనరే
శ్రీ జానకీ దేవి..సీమంతమలరే

చరణం::2

కులుకుచూ కూచున్న..కలికిని తిలకించి
అలుక చెందగనీక..అలరించరమ్మా
కులుకుచూ కూచున్న..కలికిని తిలకించి
అలుక చెందగనీక..అలరించరమ్మా
కులమెల్ల దీవించు..కొమరూని గనుమంచు
ఎల్లా ముత్తైదువులు..దీవించరమ్మా
శ్రీ జానకీ దేవీ..సీమంతమలరే
మహలక్ష్మి సుందర..వదనము గనరే
శ్రీ జానకీ దేవి..సీమంతమలరే

Thursday, May 07, 2015

శ్రీ వినాయక విజయం--1979



సంగీతం::S రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి
గానం::P.సుశీల
Film Directed By::Kamalaakara KaameswaraRao
తారాగణం::కృష్ణంరాజు,G.రామకృష్ణ,K.R.విజయ,వాణిశ్రీ,K.సత్యనారాయణ,ప్రభ.

పల్లవి::

ఎవరవయ్యా..ఎవరవయ్యా
ఏ దివ్య భువి నుండి దిగీ
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ
ఎవరవయ్యా..ఎవరవయ్యా
ఏ దివ్య భువి నుండి దిగీ
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ
ఎవరవయ్యా

చరణం::1

ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో
వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో 
పూజలలో మొదటి పూజ నీదేనేమో 

ఎవరవయ్యా..ఎవరవయ్యా
ఏ దివ్య భువి నుండి దిగీ
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ
ఎవరవయ్యా

చరణం::2

చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో
ఎన్నెన్ని వింతలో
ఎన్నెన్ని కోరికలు నిండి నే కన్న
ఎన్నెన్నో స్వప్నాలు పండి
చిన్నారి ఈ మూర్తివైనావో
ఈరేడు లోకాలు ఏలేవో
ఈరేడు లోకాలు ఏలేవో

ఎవరవయ్యా..ఎవరవయ్యా
ఏ దివ్య భువి నుండి దిగీ
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ
ఎవరవయ్యా..ఎవరవయ్యా
ఎవరవయ్యా..ఎవరవయ్యా

Sree Vinaayaka Vijayam--1979
Music::S. RaajeswaraRao
Lyrics::Devulapalli
Singer's::P.Suseela
Film Directed By::Kamalaakara KaameswaraRao
Cast::Krshnamraaju,G.Raamakrshna,K.R.Vijaya,Vanisree,K.Satyanaraayana,Prabha.

:::::::::::::::::::::::

evaravayyaa..evaravayyaa
E divya bhuvi nunDi digii
ii amma oDilOna odigii
evaravayyaa..evaravayyaa
E divya bhuvi nunDi digii
ii amma oDilOna odigii
evaravayyaa

::::1

aa kanula veligEvi E jyOtulO gaani
aa kanula veligEvi E jyOtulO gaani
aa navulu palikEvi E vEda mantraalO
vElpulandarilOnaa toli vElpuvO EmO
poojalalO modaTi pooja needEn EemO 
poojalalO modaTi pooja needEn EmO 

evaravayyaa..evaravayyaa
E divya bhuvi nunDi digii
ii amma oDilOna odigii
evaravayyaa

::::2

chiTTipoTTi naDakaloo jilibili palukuloo
chiTTipoTTi naDakaloo jilibili palukuloo
intalO auraura ennenni vidyalO
ennenni vintalO
ennenni kOrikalu ninDi nE kanna
ennennO svapnaalu panDi
chinnaari ii moortivainaavO
iireDu lOkaalu ElEvO
iirEDu lOkaalu ElEvO

evaravayyaa..evaravayyaa
E divya bhuvi nunDi digii
ii amma oDilOna odigii
evaravayyaa..evaravayyaa
evaravayyaa..evaravayyaa

Sunday, May 03, 2015

శ్రీవేంకటేశ్వర వైభవం--1971



సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్  
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల గారు

పల్లవి::

ఏడుకొండల శ్రీనివాసా..ఆఆఅ 
ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా  
ఏడేడు జన్మల పాపముల..ఎడబాపి బ్రోచే వేంకటేశా..ఆ  

చరణం::1

కోటికీ పడగెత్తినా..ధనవంతుడూ
కోటికీ పడగెత్తినా..ధనవంతుడూ
నీ గుడి ముంగిటా..సామాన్యుడూ
కూటి కోసం శ్రమపడే..నిర్భాగ్యుడూ
కూటి కోసం శ్రమపడే..నిర్భాగ్యుడూ
నీ కృపకెప్పుడూ..సమపాత్రుడూ..ఊఊ 

చరణం::2

మమకారాలూ..ఉండరాదనీ
మా తలనీలాలూ..తీసుకొందువూ
నీది నాదని...ఏది లేదని
నిలువు దోపిడి..వొలుచుకొందువూ
వెళ్ళునపుడూ..వెంటరాదని
ముడుపులన్నీ..ఊడ్చుకుందువూ
అడుగడుగునా..అడుగడుగునా
వేదాంతమున్నది..నీ ఆరాధనలో సాధనున్నదీ
ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా 

చరణం::3

ఆ శేతు శీతాచలము నీవే దైవమూ..ఆ ఆ ఆ ఆ
ఆ బాల గోపాలమ్ము నిన్నే కొలుతుమూ..ఆ ఆ ఆ ఆ
నీ దివ్య మంగల రూపమూ..ఆ ఆ ఆ ఆ
మా నిత్య దర్శన తేజమూ..ఆ ఆ ఆ ఆ
నీ పాద పద్మ యుగళమూ..ఆ ఆ ఆ ఆ 
సంసార సాగర...తరణమూ 
ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా  

Saturday, May 02, 2015

ఇదెక్కడి న్యాయం--1977



సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::V.రామకృష్ణ , P.సుశీల
Film Directed By::Daasari Naaraayana Rao
తారాగణం::మురళిమోహన్,మోహన్‌బాబు,జయసుధ,ప్రభ,జయమాలిని,నరసింహరాజు,నిర్మలమ్మ 

పల్లవి::

అందాలన్ని..అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి..మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి..మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా..అదిగో పొదా..ప్రియసుధ 
ప్రియసుధ..జయసుధా..హా

అందాలన్ని..అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి..మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి..మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా..ఇదిగో సుధా ప్రియసుధ
ప్రియసుధ..జయసుధా..ఆ

చరణం::1

నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి
నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి
మదిలోన కోరికల జడి వాన కురిసేది..జడివాన కురిసేది
చేప్పాలంటే..పెదవులు ఆగేవి తడబడి
ఎప్పుడు చూడూ నాలో ఉప్పెనలాంటి అలజడి 
పద పదా..అదిగో పొదా..ప్రియసుధ
ప్రియసుధ..జయసుధా..హా

అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి

చరణం::2

ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది 
ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది  
చిరు సిగ్గు తెరలోన అది కాస్త అణిగేది..అది కాస్త అణిగేది
ఎవరేమన్నా..మనది ఎదురులేని పరవడి 
ఇద్దరి జంటా..వలచే పడుచు వాళ్ళకు ఒరవడి
పద పదా..ఇదిగో సుధా..ప్రియసుధ
ప్రియసుధ.. జయసుధా..ఆ

అందాలన్ని..అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా..అదిగో పొదా..ప్రియసుధ
ప్రియసుధ..జయసుధా..హా 

అందాలన్ని..అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా..ఇదిగో సుధా..ప్రియసుధ
ప్రియసుధ..జయసుధా..ఆ 

Rudranetra--1977
Music::Saaloori RajeswaraRao
Lyrics::D.C.NaaraayanaReddi
Singer's::V.Ramakrishna,P.Suseela
Film Directed By::Daasari NaaraayanaRao
Starring::Muralimohan,Mohanbaabu,Jayasudha,Prabha,Jayamaalini,Narasimharaaju,Nirmalamma 

::::::::::

andaalanni..andaalanni neelOnE daagunnaayi
avi sandaDi chEstoo nannE raa rammanaayi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
pada padaa..adigO podaa..priyasudha 
priyasudha..jayasudhaa..haa

andaalanni..andaalanni neelOnE daagunnaayi
avi sandaDi chEstoo nannE raa rammanaayi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
pada padaa..idigO sudhaa priyasudha
priyasudha..jayasudhaa..aa

::::1

naa kaLLu innaaLLu nee chuTTE tirigEvi
naa kaLLu innaaLLu nee chuTTE tirigEvi
madilOna kOrikala jaDi vaana kurisEdi..jaDivaana kurisEdi
chEppaalanTE..pedavulu aagEvi taDabaDi
eppuDu chooDoo naalO uppenalaanTi alajaDi 
pada padaa..adigO podaa..priyasudha
priyasudha..jayasudhaa..haa

andaalanni neelOnE daagunnaayi
avi sandaDi chEstoo nannE raa rammanaayi

::::2

edureduru nuvvunTE E merupO merisEdi 
edureduru nuvvunTE E merupO merisEdi  
chiru siggu teralOna adi kaasta aNigEdi..adi kaasta aNigEdi
evarEmannaa..manadi edurulEni paravaDi 
iddari janTaa..valachE paDuchu vaaLLaku oravaDi
pada padaa..idigO sudhaa..priyasudha
priyasudha.. jayasudhaa..aa

andaalanni..andaalanni neelOnE daagunnaayi
avi sandaDi chEstoo nannE raa rammanaayi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
pada padaa..adigO podaa..priyasudha 
priyasudha..jayasudhaa..haa

andaalanni..andaalanni neelOnE daagunnaayi
avi sandaDi chEstoo nannE raa rammanaayi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
bittara choopulu maaneyyi..mettani cheyyi andiyyi
pada padaa..idigO sudhaa priyasudha

priyasudha..jayasudhaa..aa

Sunday, March 08, 2015

ఈనాటి బంధం ఏనాటిదో--1977



సంగీతం:::S.రాజేశ్వరరావు
రచన::M.బాలయ్య 
గానం::L.R.ఈశ్వరి,S.P.బాలు బృందం
Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ యం.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ.

పల్లవి::

అరెరెరెరెరె..అమ్మమ్మమ్మమ్మో 
అరెరెరె గోతిలో పడ్డడడే
అబ్బబ్బబ్బా..బోల్తా కొట్టడె
అయ్యయ్యయ్యయ్యో..అమ్మమ్మమ్మో 
ర్రాలుగాయి చిన్నవాడి..రంగుతేలేనే
అయ్యయ్యయే..

అరెరెరెరెరె..అమ్మమ్మమ్మమ్మో 
అరెరెరె గోతిలో పడ్డడడే..ఏయ్
అబ్బబ్బబ్బా..బోల్తా కొట్టడె..కొట్టనంటేనా
అయ్యయ్యయ్యయ్యో..అమ్మమ్మమ్మో 
ర్రాలుగాయి చిన్నవాడి..రంగుతేలేనే
అయ్యయ్యయే..అరెరెరె గోతిలో పడ్డడడే

చరణం::1

దొంగచాటు..ఏషాలు ఏసినాడే
గుడ్డి గుర్రమెక్కి..దౌడు తీసినాడే
అహా..దొంగచాటు..ఏషాలు ఏసినాడే
గుడ్డి గుర్రమెక్కి..దౌడు తీసినాడే 
కాళ్ళుఇరగ పడ్డాడు..కళ్ళుతేల ఏసాడు
అబ్బో..అమ్మా..అయ్యో..ఆహా
కాళ్ళుఇరగ పడ్డాడు..కళ్ళుతేల ఏసాడు
ఏమితెలవనోడు..గుర్రమెక్కాడే ఎందుకెక్కాడే

అరెరెరె గోతిలో పడ్డడడే..ఏహై 
అబ్బబ్బబ్బా..బోల్తా కొట్టడె..అరే
అయ్యయ్యయ్యయ్యో..అమ్మమ్మమ్మో 
ర్రాలుగాయి చిన్నవాడి..రంగుతేలేనే
అయ్యయ్యయే..

చరణం::2

ఏమిచేతగాని వట్టి..ఎదవను కానూ
మీ కొంటే గాయ కూతలంటే..లెక్కచేయనూ
ఆహా..లెక్కే చేయనూ
మీసమున్న మొనగాణ్ణి..రోషమున్న కుర్రోణ్ణి
ఏహే..ఏ..ఏ..మీసమున్న మొనగాణ్ణి..రోషమున్న కుర్రోణ్ణి
ఎనకముందు చూడకుండ..వాగుతుంటావూ
ఈ రౌడీరంగడు అంటే..ఏమనుకొన్నావు
అహా..ఓహో..అహా..ఓహో..అహా..ఓహో

ఓయమ్మో..లేచడమ్మ లేచాడే..మగధీరుడు
పెళ్ళి ఊసులెత్తగానే..భుస్సుమంటాడే..హ్హ
లేచడమ్మ లేచాడే..మగధీరుడు..ఆహ్హా
పెళ్ళి ఊసులెత్తగానే..భుస్సుమంటాడే..బుస్..బుస్
టక్కరి టిక్కరి పిల్లోడు..ఉక్కిరి బిక్కిరి అయ్యాడు
టక్కరి టిక్కరి పిల్లోడు..ఉక్కిరి బిక్కిరి అయ్యాడు
టక్కరి టిక్కరి పిల్లోడు..ఉక్కిరి బిక్కిరి అయ్యాడు
పట్టబోతె చిక్కకుండ..పిక్కబలం సుపుతాడు

అరెరెరె గోతిలో పడ్డడడే..ఏయ్ 
అబ్బబ్బబ్బా..బోల్తా కొట్టడె..ఏయ్
అయ్యయ్యయ్యయ్యో..ఆగండీ..అరె ఆగండి..అమ్మమ్మమ్మో..ఏయ్ 
ర్రాలుగాయి చిన్నవాడి..రంగుతేలేనే..ఏ...య్..
అయ్యయ్యయే..అరెరెరె గోతిలో పడ్డడడే..ఏఏఏ

Enaati Bandham Enatido--1977
Music::S.Rajeswara Rao
Lyrics::M.Balayya
Singer's::L.R.Iswarii,S.P.Baalu
Film Directed By::K.S.R.Daas
Cast::Krishna,Jayaprada,Pandaribaay,Naagabhushanam,Alluraamalingayya,Saaksheerangaaraavu,sattendrakumaar^ M.Baalayya,Jayalakshmi,Jhaansee,Raadhaakumaari,Lakshmeekaantamma,Pushpa,Saroja.

::::::::::::

arerererere..ammammammammO 
arerere gOtilO paDDaDaDE
abbabbabbaa..bOltaa koTTaDe
ayyayyayyayyO..ammammammO 
rraalugaayi chinnavaaDi..rangutElEnE
ayyayyayE..

arerererere..ammammammammO 
arerere gOtilO paDDaDaDE..Ey
abbabbabbaa..bOltaa koTTaDe..koTTananTEnaa
ayyayyayyayyO..ammammammO 
rraalugaayi chinnavaaDi..rangutElEnE
ayyayyayE..arerere gOtilO paDDaDaDE

::::1

dongachaaTu..Eshaalu EsinaaDE
guDDi gurramekki..douDu teesinaaDE
ahaa..dongachaaTu..Eshaalu EsinaaDE
guDDi gurramekki..douDu teesinaaDE 
kaaLLuiraga paDDaaDu..kaLLutEla EsaaDu
abbO..ammaa..ayyO..aahaa
kaaLLuiraga paDDaaDu..kaLLutEla EsaaDu
EmitelavanODu..gurramekkaaDE endukekkaaDE

arerere gOtilO paDDaDaDE..Ehai 
abbabbabbaa..bOltaa koTTaDe..arE
ayyayyayyayyO..ammammammO 
rraalugaayi chinnavaaDi..rangutElEnE
ayyayyayE..

::::2

EmichEtagaani vaTTi..edavanu kaanuu
mee konTE gaaya kootalanTE..lekkachEyanuu
aahaa..lekkE chEyanuu
meesamunna monagaaNNi..rOshamunna kurrONNi
EhE..E..E..meesamunna monagaaNNi..rOshamunna kurrONNi
enakamundu chUDakunDa..vaagutunTaavuu
ii rouDiirangaDu anTE..Emanukonnaavu
ahaa..OhO..ahaa..OhO..ahaa..OhO

OyammO..lEchaDamma lEchaaDE..magadhiiruDu
peLLi UsulettagaanE..bhussumanTaaDE..hha
lEchaDamma lEchaaDE..magadhiiruDu..aahhaa
peLLi UsulettagaanE..bhussumanTaaDE..bus..bus
Takkari Tikkari pillODu..ukkiri bikkiri ayyaaDu
Takkari Tikkari pillODu..ukkiri bikkiri ayyaaDu
Takkari Tikkari pillODu..ukkiri bikkiri ayyaaDu
paTTabOte chikkakunDa..pikkabalam suputaaDu

arerere gOtilO paDDaDaDE..Ey 
abbabbabbaa..bOltaa koTTaDe..Ey
ayyayyayyayyO..AganDii..are aaganDi..ammammammO..Ey 
rraalugaayi chinnavaaDi..rangutElEnE..E...y..
ayyayyayE..arerere gOtilO paDDaDaDE..EEE

Saturday, March 07, 2015

ఈనాటి బంధం ఏనాటిదో--1977



సంగీతం:::S.రాజేశ్వరరావు
రచన::M.బాలయ్య 
గానం::P.సుశీల
Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ M.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ.


Enaati Bandham Enatido--1977
Music::S.Rajeswara Rao
Lyrics::M.Balayya
Singer::P.suSeela
Film Directed By::K.S.R.Daas
Cast::Krishna,Jayaprada,Pandaribaay,Naagabhushanam,Alluraamalingayya,Saaksheerangaaraavu,sattaeMdrakumaar^ M.Baalayya,Jayalakshmi,Jhaansee,Raadhaakumaari,Lakshmeekaantamma,Pushpa,Saroja.

::::::::::::

Tuesday, February 10, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా

చరణం::1

కనులు చేపలై గంతులు వేసె
మనసు తోటలో మల్లెలు పూసె
దోసిట వలపుల పూవులు నింపీ
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా

చరణం::2

చల్ల గాలితో కబురంపితిని 
చల్ల గాలితో కబురంపితిని
చందమామలో వెదకితి నోయీ
తార తారనూ అడిగితి నోయీ
దాగెద వేలా? రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా 

చరణం::3

నల్లని మేఘము జల్లు కురియగా 
నల్లని మేఘము జల్లు కురియగా 
ఘల్లున ఆడే నీలినెమలినై 
నిను గని పరవశమందెద నోయీ
కనికరించి ఇటు రావోయీ

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా

Tuesday, January 20, 2015

కోటి దీప ప్రభలతో స్వామి కోనేటి నీటి అలలలో


సంగీత::సాలూరు రాజేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
శతకోటి భక్తుల నయనమ్ములలో 
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా..ఆ ఆ ఆ ఆ

కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
శతకోటి భక్తుల నయనమ్ములలో..ఓఓఓ 
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా..ఆ

చరణం::1

దశకంటు దునుమాడి ధరణియను చేకొనీ
పురమునకు అరుదెంచు పురుషొత్తమా..రామా..ఆ ఆ
దశకంటు దునుమాడి ధరణియను చేకొనీ
పురమునకు అరుదెంచు పురుషొత్తమా
ఆనాటి పుష్పకము ఈ నాడు కనులారా
ఆనాటి పుష్పకము ఈ నాడు కనులారా
కాంచు తున్నామయా కరువుదీరా

కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా

చరణం::2

కాళింది మడుగునా కాళీయు శిరమునా 
చిందులనూ వేసినా చిన్ని తాండవ కృష్ణా
రేపల్లెలో నాటి దీపావళిని నేడు
రేపల్లెలో నాటి దీపావళిని నేడు
కాంచుచున్నామయా కరువు తీరా

చరణం::3

శృష్టి స్థితి లయ కారణ కార్యా
శృష్టి స్థితి లయ కారణ కార్యా
సకల మతాచార సారాచార్యా
భవభయ పాప విమోచన భౌర్యా
ధినకర ఆత్రేయ తేజోవీర్యా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా 
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా 
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద 
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

Sunday, January 18, 2015

పవిత్ర బంధం--1971















సంగీతం::S.రాజేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::.P.సుశీల,ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య 

పల్లవి::

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ  
సగం సగం..నిజం నిజం 
నీవో సగం..నేనో సగం 
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే 
జగానికే ఒక..నిండుదనం
నిజం నిజం నిజం నిజం ఫిఫ్టీ..ఫిఫ్టీ
  
చరణం::1
          
నీవే నాదం..నేనే గీతం 
నీవే నాదం..నేనే గీతం 
నీ నా కలయిక..సంగీతం 
నీ నా కలయిక..సంగీతం
నీవే నింగి..నేనే నేల 
నీవే నింగి..నేనే నేల
నిండు విలీనమే..ఈ భువనం 
నీవే కుసుమం..నీవే భ్రమరం
పువ్వూ తుమ్మెద..ఒకటైపోతే 
జగానికే ఒక..కమ్మదనం
నిజం నిజం..నిజం నిజం 

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ  
సగం సగం..నిజం నిజం 
నీవో సగం..నేనో సగం 
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే 
జగానికే ఒక..నిండుదనం
నిజం నిజం నిజం నిజం 
ఫిఫ్టీ..ఫిఫ్టీ

చరణం::2

రాధ సగం..మాధవుడు సగం 
రాధ సగం..మాధవుడు సగం 
రాసవిహారమే..ప్రణయమయం
రాసవిహారమే..ప్రణయమయం
గౌరి సగం..శివుడు సగం 
గౌరి సగం..శివుడు సగం
అర్ధనారీశ్వరమే..అఖిల జగం 
అవినాభావం..అమృతరావం
అభేద రూపం..స్థిరమైపోతే 
జగానికే ఒక..అమర పథం 
నిజం నిజం..నిజం నిజం 
ఫిఫ్టీ...ఫిఫ్టీ
సగం సగం..నిజం నిజం  
నీవో సగం..నేనో సగం 
సగాలు రెండూ..ఒకటైపోతే 
జగానికే..ఒక నిండుదనం 
ఫిఫ్టీ..ఫిఫ్టీ

Tuesday, January 13, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత..ఆ
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత

ఏదో..ఏదో..ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..కంపించె తనువంత

చరణం::1

వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..ఏ..ఏ
అహ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే..ఏ..ఏ

ఏదో..ఏదో

కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే..ఏ..ఏ..ఏ
ఏదో..ఏదో

చరణం::2

గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే

ఏదో..ఏదో

నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే..ఏ..ఏ

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత
ఏదో..ఏదో

Thursday, January 08, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

నగుమోము చూపించవా..గోపాలా
నగుమోము చూపించవా..గోపాలా
మగువల మనసుల..ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

చరణం::1

ఎదుట..ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట 
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఇక సైపలేను నీవే నా..ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా 

చరణం::2

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల 
నగుమోము చూపించవా గోపాలా  

చరణం::3

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య
నగుమోము చూపించవా గోపాలా 

నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

Thursday, December 04, 2014

భారతంలో ఒక అమ్మాయి--1975



సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
Film Directed By::Dasari Narayana Rao
గానం::S.P.బాలు
తారాగణం::మురళిమోహన్,చంద్రమోహన్,రాజసులోచన,సావిత్రి,రాజబాబు,కాంతారావు,ఎం ప్రభాకర్ రెడ్డి,కైకాల సత్యనారాయణ,జయమాలిని.

పల్లవి::

నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ
నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ 
నిన్ను విడనాడి..జీవించలేనూ
పెళ్ళాడలేనూ..ప్రేమ్మించలేనూ    
అందాలు...అందించగలనూ
నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ        

చరణం::1

ఆడేపాడే అమ్మాయ౦టే..సరే సరే
తోడూ నీడా అన్నావంటే..హరే హరే
ఆడేపాడే అమ్మాయ౦టే..సరే సరే
తోడూ నీడా అన్నావంటే..హరే హరే
సరదాల సరసాల..జలసాలలోన
మునగాలి తేలాలి..ఈ వయసులోన
ఐ లైక్ యూ..ఐ వాంట్ యూ
చిలిపిదనం...కమ్మదనం
కలుసుకోనే...వయసు ఇదే
నిషా కుషీ మజా..హుషారు
నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ
నిన్ను విడనాడి..జీవించలేనూ
పెళ్ళాడలేనూ..ప్రేమ్మించలేనూ
అందాలు...అందించగలనూ
నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ        

చరణం::2

ఉమరు ఖయ్యం విధానమే..సుఖం సుఖం
తేగించితే నీవే కదా..బృఒ౦దావనం
ఉమరు ఖయ్యం విధానమే..సుఖం సుఖం
తేగించితే నీవే కదా..బృఒ౦దావనం
వసివాడి పోతుంది మరునాడు..పువ్వు
విరితేనే కావాలి..ఈనాడు నువ్వు
ఐ లైక్ యు..ఐ వాంట్ యు
మనసు వృధా..మమత వృధా
వయసు నిజం..సొగసు నిజం
ఇదే సుమా..సుఖాల సారం
నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ
నిన్ను విడనాడి..జీవించలేనూ
పెళ్ళాడలేనూ..ప్రేమ్మించలేనూ
అందాలు...అందించగలనూ
నిన్ను ఏనాడు..ప్రేమించలేనూ  
లాలలలాల..హే..ఏఏఏ..యేహేహే 

BharatamlO Oka Ammaayi--1975
Music::SaalooriRajeswara Rao
Lyrics::Arudra
Film Directed By::Dasari Narayana Rao
Singer::S.P.Baalu
Cast::Murali Mohan,Chandramohan,Rajasulochana,Savithri,Rajababu,Kantharao,M Prabhakar Reddy,Kaikala Sathyanaryana,Jayamaalini.

::::::::: 

ninnu EnaaDu..prEminchalEnoo
ninnu EnaaDu..prEminchalEnoo
ninnu viDanaaDi..jeevinchalEnoo
peLLaaDalEnoo..prEmminchalEnoo
andaalu...andinchagalanoo
ninnu EnaaDu..prEminchalEnoo         

::::1

aaDEpaaDE ammaayanTE..sarE sarE
tODoo neeDaa annaavanTE..harE harE
aaDEpaaDE ammaayanTE..sarE sarE
tODoo neeDaa annaavanTE..harE harE
saradaala sarasaala..jalasaalalOna
munagaali tElaali..E vayasulOna
I Like You..I Want You
chilipidanam...kammadanam
kalusukOnE...vayasu idE
nishaa kushee majaa..hushaaru

ninnu EnaaDu..prEminchalEnoo
ninnu viDanaaDi..jeevinchalEnoo
peLLaaDalEnoo..prEmminchalEnoo
andaalu...andinchagalanoo
ninnu EnaaDu..prEminchalEnoo         

::::2

umaru khayyam vidhaanamE..sukham sukham
tEginchitE neevE kadaa..brundaavanam
umaru khayyam vidhaanamE..sukham sukham
tEginchitE neevE kadaa..brundaavanam
vasivaaDi pOtundi marunaaDu..puvvu
viritEnE kaavaali..eenaaDu nuvvu
I Like You..I Want You
manasu vrudhaa..mamata vrudhaa
vayasu nijam..sogasu nijam
idE sumaa..sukhaala saaram

ninnu EnaaDu..prEminchalEnoo
ninnu viDanaaDi..jeevinchalEnoo
peLLaaDalEnoo..prEmminchalEnoo
andaalu...andinchagalanoo
ninnu EnaaDu..prEminchalEnoo  
laalalalaala..hE..EEE..yEhEhE    

Sunday, November 30, 2014

భారతంలో ఒక అమ్మాయి--1975



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::శ్రీశ్రీ 
గానం::వాణిజయరాం
Film Directed By::Dasari Narayanarao
తారాగణం::మురళి మోహన్,చంద్రమోహన్,రాజసులోచన,సావిత్రి,రాజబాబు,కాంతారావు,M. ప్రభాకర్ రెడ్డి,కైకాల సత్యనారాయణ,జయమాలిని.

పల్లవి::

భారతంలో..మనభారతంలో
ఈభారతంలో..ఒక అమ్మాయి
యుగయుగాలుగా..తరతరాలుగా 
జరిగే కధలే..చెపుతోంది
భారతంలో..ఒక అమ్మాయి

చరణం::1

కీర్తి కోసమని నడిబజారులో..సతినే అమ్మాడొకరాజు 
ప్రజల మెప్పుకై పరమసాద్వినే..అడవికి తరిమాడింకొకరాజు 
తన వ్యసనానికి సొంతభార్యనే..పందెంకాసాడొకరాజు 
పెళ్ళి చేసుకొని పెళ్ళానివి..నువుకాదన్నడింకొకరాజు
భారతంలో..మనభారతంలో
ఈభారతంలో..ఒక అమ్మాయి

చరణం::2

ధనదాహంతో భార్యలమార్చే..దగాకోరులే ఈనాడు
పెనుకామంతో పడతులచెరిచే..ఖుషీదారులే ఈనాడు
పదవికి పడతిని పాచికచేసే..బడాచోరులే ఈనాడు
చేరదీసి శీలం బలికోరే..దురాచారులే ఈనాడు
భారతంలో..మనభారతంలో
ఈభారతంలో..ఒక అమ్మాయి

చరణం::3

జగం మారినా..యుగం మారినా 
మారలేదు..అమ్మాయి కధా 
తీరలేదు..అమ్మాయి వ్యధా 
ఈ మారని తీరని..కధలకు వ్యధలకు 
అంతం లేనే..లేదు 
వాడిన వనితల..మోడు బ్రతుకులకు 
వసంతకాలం రానేరాదు..వసంతకాలం రానేరాదు
భారతంలో..ఒక అమ్మాయి
భారతంలో..ఒక అమ్మాయి 
యుగ యుగాలుగా..తర తరాలుగా
యుగ యుగాలుగా..తర తరాలుగా
జరిగే కథలే..చెబుతోంది
భారతంలో..ఒక అమ్మాయి

Bharatamlo Oka Ammayi--1975
Music::Saluri Rajeswara Rao
Lyrics::Sri Sri
Singer's::Vanijayaram
Film Directed By::Dasari Narayanarao
Cast:: Murali Mohan,Chandramohan,Rajasulochana,Savithri,Rajababu,Kantharao,M Prabhakar Reddy,Kaikala Sathyanaryana,Jayamalini.

:::::::::

bhaaratamlO..manabhaaratamlO
ii bhaaratamlO..oka ammaayi
yugayugaalugaa..tarataraalugaa 
jarigE kadhalE..cheputOndi
bhaaratamlO..oka ammaayi

::::1

keerti kOsamani naDibajaarulO..satinE ammaaDokaraaju 
prajala meppukai paramasaadvinE..aDaviki tarimaaDinkokaraaju 
tana vyasanaaniki soNtabhaaryanE..pandemkaasaaDokaraaju 
peLLi chEsukoni peLLaanivi..nuvukaadannaDinkokaraaju
bhaaratamlO..manabhaaratamlO..ii bhaaratamlO..oka ammaayi

::::2

dhanadaahamtO bhaaryalamaarchE..dagaakOrulE iinaaDu
penukaamamtO paDatulacherichE..khusheedaarulE iinaaDu
padaviki paDatini paachikachEsE..baDaachOrulE iinaaDu
chEradeesi Seelam balikOrE..duraachaarulE iinaaDu
bhaaratamlO..manabhaaratamlO..ii bhaaratamlO..oka ammaayi

::::3

jagam maarinaa..yugam maarinaa 
maaralEdu..ammaayi kadhaa 
teeralEdu..ammaayi vyadhaa 
ii maarani teerani..kadhalaku vyadhalaku 
antam lEnE..lEdu 
vaaDina vanitala..mODu bratukulaku 
vasantakaalam raanEraadu..vasantakaalam raanEraadu
bhaaratamlO..oka ammaayi..bhaaratamlO..oka ammaayi 
yuga yugaalugaa..tara taraalugaa..yuga yugaalugaa tara taraalugaa
jarigE kathalE..chebutOndi..bhaaratamlO..oka ammaayi

Wednesday, October 29, 2014

భలే అమ్మాయిలు--1957



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::సదాశివబ్రహ్మం
గానం::M.L.వసంతకుమారి,P.లీల
సినిమా దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,గిరిజ,రేలంగి,జగ్గయ్య,పేకేటి శివరాం,C.S.R. ఆంజనేయులు.

పల్లవి::


గోపాల జాగేలరా..ఆ
బాలగోపాల జాగేలరా..ఆ
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా..ఆ
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా దరిజేర చలమేలరా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దరిజేర చలమేలరా..ఆ
నన్ను దయజూడ విధియేమిరా..ఆ
దరిజేర చలమేలరా..ఆఆఅ 
నన్ను దయజూడ విధియేమిరా..ఆ
మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర 
గోపాల జాగేలరా..ఆ

కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి 
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి
కనుగొని ప్రేమించి నిను జేరినా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనుగొని ప్రేమించి నిను జేరినా..ఆ
చనువున నేనెంతో బ్రతిమాలినా 
కనుగొని ప్రేమించి నిను జేరినా..ఆ
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలరా
మురళీధర కరుణాకర గిరిధర 
గోపాల జాగేలరా..ఆ

సరిగపద..గోపాల జాగేలరా..ఆ
సదపగరి సరిగపద..గోపాల జాగేలరా..ఆ
పగరిసదా సరిగపద..గోపాల జాగేలరా..ఆ
దాసరి పాదస పా సరిగపద..గోపాల జాగేలరా..ఆ
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద..గోపాల జాగేలరా..ఆ
సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద..గోపాల జాగేలరా..ఆ
రీగ రిగ రీరీ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని..గోపాల జాగేలరా..ఆ
నిస్సనినిసా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని..గోపాల జాగేలరా..ఆ
గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ..గోపాల జాగేలరా..ఆ
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద..గోపాల జాగేలరా..ఆ
రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని..గోపాల జాగేలరా..ఆ
గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా..గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ..ఈ
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా..రిరిసారిరిదా సదవ గపదా
గరిసదగరీ..సదపగసదా..సదసపదగా..గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద..గోపాల జాగేలరా..ఆ