Friday, August 03, 2007

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల, P. సుశీల

తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 


పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా

చరణం::1
ఈ వసంత యామినిలో...ఈ వెన్నెల వెలుగులలో..ఓ..ఓ
ఈ వసంత యామినిలో..ఈ వెన్నెల వెలుగులలో

జీవితమే పులకించగా...జీవితమే పులకించగా
నీ వీణను సవరించి...పాడవేల రాధికా

గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి

ఏ మూలనో పొంచి పొంచి...ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని ఎంచి....పాడవేల రాధికా 


చరణం::2
వేణుగానలోలుడు నీ వీణా మృదు రవము విని..నీ
వేణుగానలోలుడు నీ వీణా మృదు రవము విని

ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా

No comments: