Friday, August 03, 2007

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::రాజేశ్వరరావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీలతారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 

పల్లవి::

మ్మ్...మ్మ్...ఆహా..హా..
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా
వసంతవేళలా పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా


చరణం::1

అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే
అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా


చరణం::2


ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా
నివాళి అందుకో ఈవేళ పండుగా
సదా సుధా తరంగాల తేలిపోదమా
ఓహొ ఓహొ నిన్నే కోరితి
కుహుకుహు అనీ పాడితి

 ఆ హా హా ఆ..హా హా హా

No comments: