Showing posts with label Lyricist::Arudra. Show all posts
Showing posts with label Lyricist::Arudra. Show all posts

Friday, June 10, 2016

ఏజెంట్ గోపి--1978




సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర్ రెడ్డి,జయమాలిని,హలం.

పల్లవి::

Agent..116..Enjoy..116 
ఓ పిల్ల కాచుకో..మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను..కొట్టేదాక పట్టే వదలనే..ఏఏఏఏ
Agent..116..Enjoy..116 

ఓ పిల్ల కాచుకో..మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను..కొట్టేదాక పట్టే వదలనే..ఏఏఏఏ
Agent..116..Enjoy..116 

చరణం::1

లా..లలలా..లలలాలలలా
కన్నేస్తేనే ఐసైపోతివే..నే చేయేస్తే ఇంకేమైపోదువే
కన్నేస్తేనే ఐసైపోతివే..నే చేయేస్తే ఇంకేమైపోదువే
సిగ్గూబిడియం చెరిపేస్తానే..అందంచందం దోచేస్తానే
దోచేస్తానే.. దోచేస్తానే..దోచేస్తానే 

ఓ పిల్ల కాచుకో..మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను..కొట్టేదాక పట్టే వదలనే  
Agent..116..Enjoy..116 

చరణం::2 

పిటపిటలాడే..పొంకం ఊపితే
నే గుటకలు వేస్తూ..కూర్చోలేనులే..ఏ..హేహేహే
పిటపిటలాడే..పొంకం ఊపితే
నే గుటకలు వేస్తూ..కూర్చోలేనులే
టక్కరిచుక్క..టెక్కులు చాలే
ఒంపులు తిప్పి..ఒళ్ళోవాలే
ఒళ్ళోవాలే..ఒళ్ళోవాలే..ఒళ్ళోవాలే

ఓ పిల్ల కాచుకో..మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను..కొట్టేదాక పట్టే వదలనే 
Agent..116..Enjoy..116 

Agent Gopi --1978
Music::Chellapilla Satyam
Lyrics::Arudra
Singer's::S.P.Baalu
Film Directed By::K.S.R.Daas
Cast::Krishna,Jayaprada,Padmanaabham,Prabhaakar Reddi,Jayamaalini,Halan.

:::::::::::::::::::::::

Agent..116..Enjoy..116 
O pilla kaachukO..mana debba choosukO
chikkani piTTanu..koTTEdaaka paTTE vadalanE..EEEE 
Agent..116..Enjoy..116 

O pilla kaachukO..mana debba choosukO
chikkani piTTanu..koTTEdaaka paTTE vadalanE..EEEE 
Agent..116..Enjoy..116 


::::1

laa..lalalaa..lalalaalalalaa
kannEstEnE aisaipOtivE..nE chEyEstE inkEmaipOduvE
kanEstEnE aisaipOtivE..nE chEyEstE inkEmaipOduvE
sigguubiDiyam cheripEstaanE..andamchandam dOchEstaanE
dOchEstaanE..dOchEstaanE..dOchEstaanE 

O pilla kaachukO..mana debba choosukO
chikkani piTTanu..koTTEdaaka paTTE vadalanE..EEEE 
Agent..116..Enjoy..116 

::::2 

piTapiTalaaDE..ponkam UpitE
nE guTakalu vEstuu..koorchOlEnulE..E..hEhEhE

piTapiTalaaDE..ponkam UpitE
nE guTakalu vEstuu..koorchOlEnulE..E..hEhEhE

Takkarichukka..Tekkulu chaalE
ompulu tippi..oLLOvaalE
oLLOvaalE..oLLOvaalE..oLLOvaalE

O pilla kaachukO..mana debba choosukO
chikkani piTTanu..koTTEdaaka paTTE vadalanE..EEEE 
Agent..116..Enjoy..116 

Thursday, June 02, 2016

గుఢాచారి 116--1966




సంగీతం::T.చలపతిరావు
రచక::ఆరుద్ర
గానం::ఘంటసాల గారు
Film Directed By::M.Mallikaarjuna Rao
తారాగణం::కృష్ణ,జయలలిత,ముక్కామల,రాజబాబు,గీతాంజలి,నెల్లూరుకాంతారావు.

పల్లవి::

ఓహో..హో..వాలు చూపుల..వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు..ఒక్కసారి

డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ

చెంప మీదా చిటికేస్తే..సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే..కోరి వస్తే 
హహహహహహహహహహ..ఓహో

డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ

చరణం::1

అందమైన దానివీ..ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ..వలచి వస్తే 
హహహహహహహహహహ..ఓహో

డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ

చరణం::2

చిలిపి చూపుల..కన్నులూ 
మొలక నవ్వుల..పెదవులూ
పలకరించే వన్నెలూ..పులకరిస్తే 
హహహహహహహహహహ..ఓహో

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

చరణం::3

నిన్న సంగతి..మరచిపో 
నేటి సుఖమే..తలచుకో
రేపు ఉండేదెక్కడో..ఇపుడు మాత్రం 
హహహహహహహహహహ..ఓహో

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

Gudhachaari116--1966
Music::T.Chalapati
Lyrics::Arudra
Singer's::ghanTasala gaaru
Film Directed By::M.Mallikaarjuna Rao
Cast::Krishna,Jayalalita,Mukkaamala,Rajababu,Geetaanjali,NellooriKanta Rao.

:::::::::::::::::::::

OhO..hO..vaalu choopula..vannelaaDi
ninnu choostEnE chaalu..okkasaari

DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee

chempa meedaa chiTikEstE..sompulannii SOdhistE
UhalennO UristE..kOri vastE 
hahahahahahahahahaha..OhO

DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee

::::1

andamaina daanivii..aaSa peTTE daanivii
paaDu siggoo dEnikii..valachi vastE 
hahahahahahahahahaha..OhO

DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee

::::2

chilipi choopula..kannuluu 
molaka navvula..pedavuluu
palakarinchE vanneluu..pulakaristE 
hahahahahahahahahaha..OhO

DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDee

::::3

ninna sangati..marachipO 
nETi sukhamE..talachukO
rEpu unDEdekkaDO..ipuDu maatram 
hahahahahahahahahaha..OhO

DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDeeeriDee

Monday, July 06, 2015

చంటబ్బాయి--1986



సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చిరంజీవి,సుహాసిని 

పల్లవి::

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే
ప్రేమ..ఊపిరే ప్రేమ

చరణం::1

నిన్ను చూడకా నిదురపోనీ..రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే..మౌన మంత్రాలు
నిన్ను తాకకా నిలవలేనీ..పంచ ప్రాణాలూ
కౌగిలింతలా గర్భగుడిలో..మూగ దీపాలు
ప్రేమ మహిమ..తెలుప తరమా
ప్రేమే..జీవన..మధురిమా
నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో..చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ..ఊపిరే ప్రేమ

చరణం::2

స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఓం..అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే
గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా
ప్రేమ మహిమ తెలియ తరమా
ప్రేమే..జీవన మధురిమా
నేను నీకై పుట్టినానని..నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో..చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ..ఊపిరే ప్రేమ

Sunday, June 28, 2015

ఎం.ఎల్.ఏ--1957



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,S.జానకి
తారాగణం::జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,గిరిజ,రమణమూర్తి,పెరుమాళ్ళు,నాగభుషణం

పల్లవి::

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

చరణం::1

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
తలచినది ఒకటైతే
జరిగినది వేరొకటి
తలచినది ఒకటైతే
జరిగినది వేరొకటి
చితికినది నీ మనసు
అతుకుటకూ..లేరెవరూ 

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

చరణం::2

గుండెలలో..గునపాలే
గుచ్చరే నీవాళ్ళు
గుండెలలో..గునపాలే
గుచ్చరే నీవాళ్ళు
కన్నులలో..గోదారి
కాలువలే కట్టినది

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

M.L.A--1957
Music::Pendyala NaagaeSvararaavu  
Lyrics::Arudra
Singer's::Ghantasaala,S.Janaki
Cast::Jaggayya,Gummadi,Saavitri,Girija,Ramanamoorti,Perumaallu,Naagabhushanam

::::

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

:::1

O O O O O O O O O O
talachinadi okaTaitE
jariginadi vErokaTi
talachinadi okaTaitE
jariginadi vErokaTi
chitikinadi nee manasu
atukuTakuu..lErevaroo 

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

:::2

gunDelalO..gunapaalE
guchcharE neevaaLLu
gunDelalO..gunapaalE
guchcharE neevaaLLu
kannulalO..gOdaari
kaaluvalE kaTTinadi

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

ఎం.ఎల్.ఏ--1957



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::P. సుశీల,మాధవపెద్ది సత్యం, బృందం
తారాగణం::జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,గిరిజ,రమణమూర్తి,పెరుమాళ్ళు,నాగభుషణం.

పల్లవి::

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

నిరంతరం మా హృదంతరంలో 
నిండి వెలుగుజ్యోతి..ఈ
నిత్యసత్యకాంతి..ఈ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

చరణం::1

ధర్మదేవత..నాల్గుపాదములు 
బ్రహ్మదేవుని..నాల్గువేదములు
ధర్మభూమిలో..మరల నిలిపి..ఈ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ధర్మభూమిలో..మరల నిలిపి..ఈ
నిర్మల బోధలు..చేసిన బాపూ..ఊఊఊఊ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

చరణం::2

నీవు తీసిన..బాటలు దాటి 
నీతిని విడచి..నిన్నే మరచి 
నీవు తీసిన..బాటలు దాటి 
నీతిని విడచి..నిన్నే మరచి
నీ అనుచరులే మారెదరేమో
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీ అనుచరులే మారెదరేమో
నిదురనుండి లేపూ..బాపూ..ఊఊఊ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

చరణం::3

ఆశయాలకై..అశువుల బాసిన 
అమరమూర్తివయ్యా..నీవు 
ఆత్మబలముతో..ఆదర్శాలు 
అవనిలోన నిలుపు బాపూ..ఊఊఊ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు
బాపూ..ఊఊఊఊఊఊ

M.L.A--1957
Music::Pendyala NaagaeSvararaavu  
Lyrics::Arudra
Singer's::P.Suseela,Maadhavapeddi Satyam,Brundam.
Cast::Jaggayya,Gummadi,Saavitri,Girija,Ramanamoorti,Perumaallu,Naagabhushanam

::::

namO namO..baapoo..UUU
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

namO namO..baapoo..UU
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

nirantaram maa hRdantaramlO 
ninDi velugujyOti..ee
nityasatyakaanti..ee

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

:::1

dharmadevata..naalgupaadamulu 
brahmadEvuni..naalguvEdamulu
dharmabhoomilO..marala nilipi..ee
aa..aa..aa..aa..aa..aa..aa
dharmabhoomilO..marala nilipi..ee
nirmala bOdhalu..chEsina baapoo..UUU

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

:::2

neevu teesina..baaTalu daaTi 
neetini viDachi..ninne marachi 
neevu teesina..baaTalu daaTi 
neetini viDachi..ninne marachi
nee anucharulE maaredaremO
O..O..O..O..O..O..O
nee anucharulE maaredaremO
niduranunDi lEpoo..baapoo..UUU

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

:::3

aaSayaalakai..aSuvula baasina 
amaramoortivayyaa..neevu 
aatmabalamutO..aadarSaalu 
avanilOna nilupu baapoo..UUU

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

baapoo..UUUUU

జేబు దొంగ--1975



సంగీతం::చక్రవర్తి 
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,మంజుల,రాజబాబు,రోజారమణి,సత్యనారాయణ,రమాప్రభ

పల్లవి:: 

రాధా..ఆ..అందించు నీ లేత పెదవి 
ఏహే..ఏ..లాలించు తీరాలి తనివి 

గోపీ..ఈ..నాలోని అందాలు నీవి..ఈ 
ఓహో..నీ రాగ బంధాలు నావి..ఈ 
సరే..పదా..ఇటూ
మనసు పొంగినది..మధువులూరినవి 
మమత గుండెలో..నిండి పోయినవి 
రాధా..ఆ..అందించు నీ లేత పెదవి 
గోపీ..ఈ..నాలోని అందాలు నీవి..ఈ 

చరణం::1 

చెంపల్లోనా..కెంపులున్నవి
ఒంపుల్లోనా..వలపులున్నవి 
ఇంపు సొంపు..మధుర మధురమాయే 
చెంపల్లోనా..కెంపులున్నవి
ఒంపుల్లోనా..వలపులున్నవి 
ఇంపు సొంపు..మధుర మధురమాయే 

నీ పేరే..తియ్యనైనది
నీ రూపే..కమ్మనైనది 
నీ మనసే..చల్లనైనది
నీ తోడే..వెచ్చనైనది 
హే..ఏఏఏ..సొగసు ఉయ్యాలలూగిందీ 
ఓఓఓఓఓ..వయసు వయ్యార మొలికిందీ 

రాధా..ఆ..నాలోని అందాలు నీవి..ఈ 
గోపీ..ఈ..అందించు నీ లేత పెదవి..ఈ 

చరణం::2

మేను మేను..వీణలైనవి
మెల్లగ చేతులు..మీటుతున్నవి 
ఏదో గానం..మోగుతున్నదోయి 
మేను మేను..వీణలైనవి
మెల్లగ చేతులు..మీటుతున్నవి 
ఏదో గానం..మోగుతున్నదోయి 

చెలరేగే చిలిపి..ఊహలు
పులకించే పడుచు..గుండెలు 
చిగురించే..కొత్త ఆశలు
పెనవేసే..రెండు తనువులు 

ఓఓఓఓఓ..వలపు కెరటాల మునగాలి 
ఆహా..ఆఆఆఆ..మధుర ప్రణయాల తేలాలి 

రాధా..ఆ..అందించు నీ లేత పెదవి 
గోపీ..ఈ..నాలోని అందాలు నీవి 
సరే..పదా..ఇటు 
మనసు పొంగినది..మధువులూరినవి 
మమత గుండెలో..నిండి పోయినది 
రాధా..ఆ..నాలోని అందాలు నీవి..ఈ 
గోపీ..ఈ..అందించు నీ లేత పెదవి..ఈ 
రాధా..ఆఆఆఆ
గోపీ..ఈఈఈఈ
రాధా..ఆఆఆఆ
గోపీ..ఈఈఈఈ


Tuesday, June 02, 2015

గుఢాచారి 116--1966




సంగీతం::T.చలపతిరావు
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల గారు
Film Directed By::M.Mallikaarjuna Rao
తారాగణం::కృష్ణ,జయలలిత,ముక్కామల,రాజబాబు,గీతాంజలి,నెల్లూరుకాంతారావు,రాజనాల,జగ్గయ్య,రమణారెడ్డి.


పల్లవి::

పడిలేచే..కెరటం చూడు
పడుచుపిల్ల..బింకం చూడు
తొంగి చూచు..సిగ్గులు చూడు
పొంగుతున్న..అందం చూడు

పడిలేచే..కెరటం చూడు
పడుచుపిల్ల..బింకం చూడు
తొంగి చూచు..సిగ్గులు చూడు
పొంగుతున్న..అందం చూడు 
పడిలేచే..కెరటం చూడు

చరణం::1

వెన్నెల...విరిసే వేళా
వన్నెలు...మెరిసే వేళా 
చందమామ..పరుగులు చూడూ
చల్లగాలి..ఆరడి చూడు
చందమామ..పరుగులు చూడూ
చల్లగాలి..ఆరడి చూడు
మిసమిసలా..చిన్నలు చూడూ
ఉసిగొలిపే..హృదయం చూడు

పడిలేచే..కెరటం చూడు
పడుచుపిల్ల..బింకం చూడు
తొంగి చూచు..సిగ్గులు చూడు
పొంగుతున్న..అందం చూడు 
పడిలేచే..కెరటం చూడు

చరణం::2

పరులెవరూలేని..చోటా
పరువాలు పూచే..చోటా
కరుగుతున్న కాలం..చూడు
పెరుగుతున్న ఆశలు..చూడు
కరుగుతున్న కాలం..చూడు
పెరుగుతున్న ఆశలు..చూడు
మరుగులేని మమతలు..చూడూ
మనసుంటే నన్నే..చూడు

పడిలేచే..కెరటం చూడు
పడుచుపిల్ల..బింకం చూడు
తొంగి చూచు..సిగ్గులు చూడు
పొంగుతున్న..అందం చూడు 
పడిలేచే..కెరటం చూడు

Gudhachaari116--1966
Music::T.Chalapati
Lyrics::Arudra
Singer's::Suseela gaaru
Film Directed By::M.Mallikaarjuna Rao
Cast::Krishna,Jayalalita,Mukkaamala,Rajababu,Geetaanjali,NellooriKanta Rao,Raajanaala.

:::::::::::::::::::::

paDilEchE..keraTam chuuDu
paDuchupilla..binkam chooDu
tongi choochu..siggulu chooDu
pongutunna..andam chooDu

paDilEchE..keraTam chuuDu
paDuchupilla..binkam chooDu
tongi choochu..siggulu chooDu
pongutunna..andam chooDu 
paDilEchE..keraTam chuuDu

::::1

vennela...virisE vELaa
vannelu...merisE vELaa 
chandamaama..parugulu chooDuu
challagaali..AraDi chooDu
chandamaama..parugulu chooDuu
challagaali..AraDi chooDu
misamisalaa..chinnalu chooDuu
usigolipE..hRdayam chooDu

paDilEchE..keraTam chuuDu
paDuchupilla..binkam chooDu
tongi choochu..siggulu chooDu
pongutunna..andam chooDu 
paDilEchE..keraTam chuuDu

::::2

parulevaroolEni..chOTaa
paruvaalu poochE..chOTaa
karugutunna kaalam..chooDu
perugutunna ASalu..chooDu
karugutunna kaalam..chooDu
perugutunna ASalu..chooDu
marugulEni mamatalu..chooDuu
manasunTE nannE..chooDu

paDilEchE..keraTam chuuDu
paDuchupilla..binkam chooDu
tongi choochu..siggulu chooDu
pongutunna..andam chooDu 
paDilEchE..keraTam chuuDu

Sunday, May 31, 2015

శ్రీమతి--1966




సంగీతం::శ్రీనిత్యానంద్ 
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల గారు,P.సుశీల గారు.
Film Directed By::Vijayaanand
తారాగణం::కాంతారావు,శారద,గీతాంజలి,వాసంతి,చలం,నిర్మల,మీనాకుమారి,అల్లురామలింగయ్య,సత్యనారాయణ,రామన్నపంతులు,

పల్లవి::

మ్రోగింది..గుడిలోని గంట
మురిసింది..హృదయాల జంట
నీలో నాలో..వెలిగే ప్రేమా
నింపింది..కిరణాల పంటా..ఆ

చరణం::1

నా మనసే ప్రియా..నీవుండే విడిధీ
నాలో పొంగింది..ఆనంద జలధి

వికసించే మనోభావాలు..కలిసే
వెండి పందిరిగా..లోకమె వెలసే

నీవే నేనుగా..ఒకటైన చోట
నీవే నేనుగా..ఒకటైన చోట
పూచే వలపుల..తోటా..ఆఆఆ 

మ్రోగింది..గుడిలోని గంట
మురిసింది..హృదయాల జంట
నీలో నాలో..వెలిగే ప్రేమా
నింపింది..కిరణాల పంటా..ఆ 

చరణం::2

ప్రేమించి..నిను సేవింతుగానా
ఇల్లాలినైనాను..ఈ ముహుర్తానా

దేవతలే చెలీ..దీవించినారూ..ఊ
ఇద్దరినొకటిగా..కావించినారూ..ఊ

ఎపుడు మనలో..ఎడబాటు లేక
ఎపుడు మనలో..ఎడబాటు లేక
బ్రతుకే పూవుల..బాటా..ఆఆఆ 

మ్రోగింది..గుడిలోని గంట
మురిసింది..హృదయాల జంట
నీలో నాలో..వెలిగే ప్రేమా
నింపింది..కిరణాల పంటా..ఆ

Sreemathi--1966
Music::Sreenityanand
Lyrics::Arudra
Singer's::Ghantasaala gaaru,P.Suseela gaaru.
Film Directed By::Vijayaanand 
Cast::KaantaRao,Sarada,Chalam,Vasanta,Geetaanjali,Nirmala,Meenaakumaari,Alluraamalingayya,Satyanarayana,Raamannapantulu,

::::::::::::::::::

mrOgindi..guDilOni ganTa
murisindi..hRdayaala janTa
neelO naalO..veligE prEmaa
nimpindi..kiraNaala panTaa..aa

::::1

naa manasE priyaa..neevunDE viDidhii
naalO pongindi..Ananda jaladhi

vikasinchE manObhaavaalu..kalisE
venDi pandirigaa..lOkame velasE

neevE nEnugaa..okaTaina chOTa
neevE nEnugaa..okaTaina chOTa
poochE valapula..tOTaa..aaaaaaaa 

mrOgindi..guDilOni ganTa
murisindi..hRdayaala janTa
neelO naalO..veligE prEmaa
nimpindi..kiraNaala panTaa..aa 

::::2

prEminchi..ninu sEvintugaanaa
illaalinainaanu..ii muhurtaanaa

dEvatalE chelii..deevinchinaaruu..uu
iddarinokaTigaa..kaavinchinaaruu..uu

epuDu manalO..eDabaaTu lEka
epuDu manalO..eDabaaTu lEka
bratukE poovula..baaTaa..aaaaaaaa 

mrOgindi..guDilOni ganTa
murisindi..hRdayaala janTa
neelO naalO..veligE prEmaa
nimpindi..kiraNaala panTaa..aa

Saturday, May 30, 2015

కలవారి కోడలు--1964




సంగీతం::T.చలపతిరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల గారు,జిక్కి గారు
Film Directed By::K.Hemaambharadhara Rao
తారాగణం::N.T.R. కృష్ణకుమారి,పద్మనాభం,గీతాంజలి,చలం.

పల్లవి::

ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ..ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ
ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ..ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ

దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ 
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా

దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా..మనసుపడిన చినవాడ

చరణం::1

ముచ్చటైన కురులుదువ్వి..మొగలిరేకులా జడనువేసి
ముచ్చటైన కురులుదువ్వి..మొగలిరేకులా జడనువేసి
మోజుతీర ముస్తాబుచేసి..మోమాటపడనేల ఓ చిన్నదాన

దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ 
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా

చరణం::2

కోరమీసాల మెలేసి..కోటిసరసాల కలేసి
కోరమీసాల మెలేసి..కోటిసరసాల కలేసి
చిలిపిసైగల పిలిచావుగాని..చెప్పేటి కబురేమి ఓ చిన్నవాడ

దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా..మనసుపడిన చినవాడ

చరణం::3

హంసలాగ నడచిరాగా..అందమంతా పొంగిపోగా
హంసలాగ నడచిరాగా..అందమంతా పొంగిపోగా
కోయిలల్లే గొంతెత్తి పాడ..గుండెల్లో గిలిగింతలయ్యేను పిల్ల 

దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ 
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా

చరణం::4

పూలతావుల చేరదీసి..గాలితీగలా ఓడగట్టి
పూలతావుల చేరదీసి..గాలితీగలా ఓడగట్టి
మత్తుదారుల కేరింతలాడి..మైమరచిపోదాము ఓ చిన్నవాడ

దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా..మనసుపడిన చినవాడ
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా
ఓహో..ఓఓఓఓఓఓ..ఓహో..ఓఓఓఓఓఓ..ఓహో..ఓఓఓఓఓఓ..ఓహో..ఓఓఓఓఓఓ

Kalavaari kOdalu--1970
Music::T.Chalapati Rao
Lyrics::Arudra
Singer's::Ghantasaala garu,Jikki Garu
Film Directed By::K.Hemaambharadhara Rao
Cast::N.T.R. Krishnakumari,Padmanabham,Geetaanjali,Chalam.

::::::::::::::::::::::::

OhO..OOOOOOO..OO..OhO..OOOOOOO..OO
OhO..OOOOOOO..OO..OhO..OOOOOOO..OO

donga choopulu choochii..dOravayasu dOchii
donga choopulu choochii..dOravayasu dOchii 
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa

donga choopulu choochii..dOravayasu dOchii
mattumandu chilikitivaa..manasupaDina chinavaaDa

::::1

muchchaTaina kuruluduvvi..mogalirEkulaa jaDanuvEsi
muchchaTaina kuruluduvvi..mogalirEkulaa jaDanuvEsi
mOjuteera mustaabuchEsi..mOmaaTapaDanEla O chinnadaana

donga choopulu choochii..dOravayasu dOchii 
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa

::::2

kOrameesaala melEsi..kOTisarasaala kalEsi
kOrameesaala melEsi..kOTisarasaala kalEsi
chilipisaigala pilichaavugaani..cheppETi kaburEmi O chinnavaaDa

donga choopulu choochii..dOravayasu dOchii
mattumandu chilikitivaa..manasupaDina chinavaaDa

::::3

haMsalaaga naDachiraagaa..andamantaa pongipOgaa
haMsalaaga naDachiraagaa..andamantaa pongipOgaa
kOyilallE gontetti paaDa..gunDellO giligintalayyEnu pilla 

donga choopulu choochii..dOravayasu dOchii 
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa

::::4

poolataavula chEradeesi..gaaliteegalaa ODagaTTi
poolataavula chEradeesi..gaaliteegalaa ODagaTTi
mattudaarula kErintalaaDi..maimarachipOdaamu O chinnavaaDa

donga choopulu choochii..dOravayasu dOchii
mattumandu chilikitivaa..manasupaDina chinavaaDa
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa
OhO..OOOOOO..OhO..OOOOOO..OhO..OOOOOO..OhO..OOOOOO

Friday, May 29, 2015

శ్రీ రామాంజనేయ యుద్ధం--1975



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,B.వసంత.
Film Directed By::Baapu
తారాగణం::నందమూరి తారక రామారావు,B.సరోజాదేవి,రాజశ్రీ,ముక్కామల,ధూళిపాళ,
జయంతి,కాంతారావు,అర్జా జనార్ధనరావు,హేమలత,శ్రీధర్,నాగరాజు (లవకుశలో లవుడు).

పల్లవి::

శ్రీయితమౌ శ్రీరామ పాదం..శ్రితజన మందారం
పావనమీ రఘురామ పాదం..పాప వినాశకరం

శ్రీయితమౌ శ్రీరామ పాదం..శ్రితజన మందారం
పావనమీ రఘురామ పాదం..పాప వినాశకరం

చరణం::1

కలుషమ్ముల ప్రక్షాళన చేసి..గంగ జనించిన పాదం
అసుర మదమ్మును పాతాళానికి..అణచివేసిన పాదం

రాతిని నాతిని చేసిన పాదం..అడవికి అందం పోసిన పాదం
ఈ చరణమ్మే శరణమ్మనగా..యిచ్చును పెన్నిధానం

శ్రీయితమౌ శ్రీరామ పాదం..శ్రితజన మందారం
పావనమీ రఘురామ పాదం..పాప వినాశకరం

చరణం::2

అవలీలగ జలధిని దాటిన మేటి..పవన కుమారుడు పట్టేపాదం
బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం..పరబ్రహ్మ పదానికి మూలం
తాను ధరించిన పాదుకలకు..ధర పట్టము కట్టిన పాదము
తమ్ముడు భరతుని తరతరాలకు..ధన్యుని చేసిన పాదం

శ్రీయితమౌ శ్రీరామ పాదం..శ్రితజన మందారం
పావనమీ రఘురామ పాదం..పాప వినాశకరం      

Shrii Ramanjaneya Yuddham--1975
Music::K.V.Mahaadevan
Lyrics::Arudra
Singer's::P.Suseela,B.Vasanta.
Film Directed By::Baapu
Cast::N,T,RaamaaRao,B.Sarojinidevi,Raajasri,Hemalatha,Jayanti,Mukkaamala,Sridhar,Dhulipaali,KaantaRao, Arjaa JanaardhanaRao,Naagaraaju (LavaKusa lO lavudu)

:::::::::::::::::::::::::::::::::::::::::::

Sreeyitamou Sreeraama paadam..Sritajana mandaaram
paavanamii raghuraama paadam..paapa vinaaSakaram

Sreeyitamou Sreeraama paadam..Sritajana mandaaram
paavanamii raghuraama paadam..paapa vinaaSakaram

::::1

kalushammula pashaaLana chEsi..ganga janinchina paadam
asura madammunu paataaLaaniki..aNachivEsina paadam

raatini naatini chEsina paadam..aDaviki andam pOsina paadam
ii charaNammE SaraNammanagaa..yichchunu pennidhaanam

Sreeyitamou Sreeraama paadam..Sritajana mandaaram
paavanamii raghuraama paadam..paapa vinaaSakaram

::::2

avaleelaga jaladhini daaTina mETi..pavana kumaaruDu paTTEpaadam
brahmEndraadulu kolichE paadam..parabrahma padaaniki moolam
taanu dharinchina paadukalaku..dhara paTTamu kaTTina paadamu
tammuDu bharatuni tarataraalaku..dhanyuni chEsina paadam

Sreeyitamou Sreeraama paadam..Sritajana mandaaram
paavanamii raghuraama paadam..paapa vinaaSakaram 

Saturday, May 09, 2015

జీవిత చక్రం--1971





సంగీతం::శంకర్-జైకిషాన్  
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి:: 

కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా
ఆశలూ దాచకూ..ఆశలూ దాచకూ
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా ఓ పిల్లా

చరణం::1

ఆడపిల్లా..పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా..పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి 
ఆడపిల్లా పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి..ఆహా     
అందమైన మగవాడు..పొందుకోరి వచ్చాడు 
ఎందుకలా చూస్తావు..ఓ పిల్లా
స్నేహమూ చేయవా..స్నేహమూ చేయవా....   
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది  
మూగమనసులో మాట..ఓ పిల్లా ఓ పిల్లా

చరణం::2

కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె 
కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి..ఆహా 
మెత్తనైన మనసు నీది..కొత్త చిగురు వేసింది 
మత్తులోన మునిగింది..ఓ పిల్లా..మైకమూ పెంచుకో 
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా..ఓ పిల్లా

చరణం::3

చెప్పలేని వింత వింత..అనుభవాలు విరగబూసె
చెప్పలేని వింత వింత..అనుభవాలు విరగబూసె , 
చెప్పలేని వింత వింత అనుభవాలు ఎదురుచూస్తున్నాయి..ఆహా
నువ్వు నన్ను చేరాలి..నేను మనసు యివ్వాలి 
ఎడము లేక వుండాలి..ఓ పిల్లా..ఆ 
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా..ఓ పిల్లా
వస్తావా..మురిపిస్తావా..వస్తావా..మురిపిస్తావా
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట..ఓ పిల్లా
వస్తావా..మురిపిస్తావా..వస్తావా..మురిపిస్తావా

Thursday, April 30, 2015

దొంగలకు దొంగ--1977




సంగీతం::సత్యం 
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పండరిబాయి,మోహన్‌బాబు,నాగభూషణం,జయమాలిని,రాజేశ్వరి.

పల్లవి::

ఎవరేమన్నను..తోడురాకున్నా..ఆ ఆ ఆ 
ఒంటరిగానే పోరా బాబు పో..ఓఓఓ
నీదారి,,ఈఈఈఈ..నీదే..ఏఏఏ 
సాగి పోరా నీ గమ్యం చేరుకోరా..ఆ
సాగి పోరా నీ గమ్యం చేరుకోరా..ఆ
ఓఓఓఓఓ..ఎవరేమన్నను..ఊ
ఎవరేమన్నను..తోడురాకున్నా 
ఒంటరిగానే పోరా బాబు పో..ఓఓ
నీదారి....నీదే.ఏ 
సాగి పోరా నీ గమ్యం చేరుకోరా..ఆ
సాగి పోరా నీ గమ్యం చేరుకోరా..ఆ

చరణం::1

నడిచిన కందే..పసి పాదాలు 
కోమలమైన...మీ దేహాలూ
వడివడిగా...తడబదకా..ఆ 
చేయాలెన్నో..మజిలీలు..ఊ
నడిచిన కందే..పసి పాదాలు 
కోమలమైన...మీ దేహాలూ
వడివడిగా....తడబదకా 
చేయాలెన్నో..మజిలీలు
దూరమెంతైనను..ఊ..దూరమెంతైనను 
భారమెంతైన ఆగకుండా..పోరా బాబు పో 
నీదారి నీదే సాగి పోరా నీ గమ్యం చేరుకోరా
సాగి పోరా నీ గమ్యం చేరుకోరా

చరణం::2

మదిలో జ్వాల..రగిలిన నాడు
లోకం చూపదు..నీపై జాలి
నీలో నీకు..నమ్మకముంటే 
జగతిని నీవే...మార్చాలి

మదిలో జ్వాల..రగిలిన నాడు
లోకం చూపదు..నీపై జాలి
నీలో నీకు..నమ్మకముంటే 
జగతిని నీవే..మార్చాలి
ఎంత బాధైనాను..ఊ..ఎంత బాధైనను 
వింత గాధైన..కన్నీరేల..పోరా బాబు పో 
నీదారి నీదే సాగి పోరా నీ గమ్యం చేరుకోరా

Dongalaku Donga--1977
Music::Chellapilla Satyam
Lyrics::Arudra
Singer::S.Jaanaki
Film Directed By::K.S.R.Daas
Cast::Krshna,Jayaprada,Pandaribaayi,Mohan^BaaBu,Naagabhooshanam,Jayamaalini,Raajeswari.

::::::::::::::::

evarEmannanu..tODuraakunnaa..aa aa aa 
onTarigaanE pOraa baabu pO..OOO
needaari..iiiii..needE..EEE 
saagi pOraa nee gamyam chErukOraa..aa
saagi pOraa nee gamyam chErukOraa..aa
OOOOO..evarEmannanu..uu
evarEmannanu..tODuraakunnaa 
onTarigaanE pOraa baabu pO..OO
needaari....needE.E 
saagi pOraa nee gamyam chErukOraa..aa
saagi pOraa nee gamyam chErukOraa..aa

::::1

naDichina kandE..pasi paadaalu 
kOmalamaina...mee dEhaaloo
vaDivaDigaa...taDabadakaa..aa 
chEyaalennO..majileelu..uu
naDichina kandE..pasi paadaalu 
kOmalamaina...mee dEhaaloo
vaDivaDigaa....taDabadakaa 
chEyaalennO..majileelu
dooramentainanu..uu..dooramentainanu 
bhaaramentaina aagakunDaa..pOraa baabu pO 
needaari needE saagi pOraa nee gamyam chErukOraa
saagi pOraa nee gamyam chErukOraa

::::2

madilO jwaala..ragilina naaDu
lOkam choopadu..neepai jaali
neelO neeku..nammakamumTE 
jagatini neevE...maarchaali

madilO jwaala..ragilina naaDu
lOkam choopadu..neepai jaali
neelO neeku..nammakamumTE 
jagatini neevae..maarchaali
emta baadhainaanu..uu..emta baadhainanu 
vimta gaadhaina..kanneeraela..pOraa baabu pO 

needaari needae saagi pOraa nee gamyam chaerukOraa

Monday, April 27, 2015

గోపాలరావు గారి అమ్మాయి--1980




సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,S.P.శైలజ 
Film Directed By::K.Vaasu
తారాగణం::రావుగోపాల్‌రావు,జయసుధ,చంద్రమోహన్,షావుకారు జానకి,
నాగభూషణం,మోహన్‌బాబు,చక్రవర్తి,సాక్షి రంగారావు,శరథ్,ఝాన్సి,కాకరాల.

పల్లవి::

సుజాతా..ఐ లవ్ యూ
సుజాతా..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ
ఐ లవ్ యూ..సుజాతా

సుజాతా..ఐ లవ్ యూ..సుజాతా
నిజంగా..ఐ లైక్ యూ..సుజాతా
సుజాతా..ఐ లవ్ యూ..సుజాతా
నిజంగా..ఐ లైక్ యూ..సుజాతా
ఐ లవ్ యూ..సుజాతా..aa
సుజాతా..సుజాతా..సుజాతా

సుజాతా..ఐ లవ్ యూ..సుజాతా
నిజంగా..ఐ లైక్ యూ..సుజాతా

చరణం::1 

వెచ్చగా నులివెచ్చగా..నే మెచ్చగా చేరవా
చల్లగా జాబిల్లిగా..మరుమల్లెగా మారనా
వెచ్చగా నులివెచ్చగా..నే మెచ్చగా చేరవా
చల్లగా జాబిల్లిగా..మరుమల్లెగా మారనా

కన్ను కన్ను కలిపిన నాడే..పున్నమి వెన్నెల కురిసింది
నిన్ను నన్ను కలిపిన వాడికి..ప్రేమకు అర్ధం తెలిసింది 
నీ..పేరే తపిస్తూ..జపిస్తూ..జపిస్తా..జపిస్తా..aa

సుజాతా..హహహా..ఐ లవ్ యూ..సుజాతా
నిజంగా..ఉమ్..ఉమ్..ఐ లైక్ యూ..సుజాతా

చరణం::2

కొంటెగా క్రీగంటితో..నా ఒంటిపై వాలకు
వెంటనే నీ జంటగా..జేగంటగా మ్రోగనా
కొంటెగా క్రీగంటితో..నా ఒంటిపై వాలకు
వెంటనే నీ జంటగా..జేగంటగా మ్రోగనా

నీలో ఏదో నాదం ఉంది..నన్నే గానం చెసింది
నీలో ఏదో బంధం ఉంది..నన్నే బంధించేసింది
నే..నిన్నే వరించా..వరించా..వరించి తరించా

సుజాతా..హహహా..ఐ లవ్ యూ..సుజాతా
నిజంగా..ఉమ్..ఉమ్..ఉమ్..ఐ లైక్ యూ..సుజాతా
ఐ లవ్ యూ సుజాతా..సుజాతా..సుజాతా..సుజాతా

సుజాతా..హహహా..ఐ లవ్ యూ..సుజాతా
నిజంగా..ఉమ్..ఉమ్..ఉమ్..ఐ లైక్ యూ..సుజాతా

Gopaalaraavu Gaari Ammaayi--1980
Music::Chakravarti
Lyrics::Arudra Gaaru
Singer's::S.P.Baalu,S.P.Sailaja
Film Directed By::K.Vaasu
Cast::Raavugopaal Rao,Jayasudha,Chandramohan,Shaavukaaru Jaanaki,
Naagabhooshanam,Mohanbaabu,Chakravarti,Saakshi RangaaRao,Sarath,Jhaansi,Kaakaraala.

::::::::::::::::

sujaataa..i love you
sujaataa..i love you..i love you
i love you..sujaataa

sujaataa..i love you..sujaataa
nijangaa..i like you..sujaataa
sujaataa..i love you..sujaataa
nijangaa..i like you..sujaataa
i love you..sujaataa..aa
sujaataa..sujaataa..sujaataa

sujaataa..i love you..sujaataa
nijangaa..i like you..sujaataa

::::1 

vechchagaa nulivechchagaa..nE mechchagaa chEravaa
challagaa jaabilligaa..marumallegaa maaranaa
vechchagaa nulivechchagaa..nE mechchagaa chEravaa
challagaa jaabilligaa..marumallegaa maaranaa

kannu kannu kalipina naaDE..punnami vennela kurisindi
ninnu nannu kalipina vaaDiki..prEmaku ardham telisindi 
nii pErE tapistoo..japistoo..japistaa..japistaa..aa

sujaataa..hahahaa..i love you..sujaataa
nijangaa..umm..umm..i like you..sujaataa

::::2

konTegaa kreeganTitO..naa onTipai vaalaku
venTanE nii janTagaa..jEganTagaa mrOganaa
konTegaa kreeganTitO..naa onTipai vaalaku
venTanE nii janTagaa..jEganTagaa mrOganaa

neelO EdO naadam undi..nannE gaanam chesindi
neelO EdO bandham undi..nannE bandhinchEsindi
nE ninnE varinchaa..varinchaa..varinchi tarinchaa

sujaataa..hahahaa..i love you..sujaataa
nijangaa..u..u..umm..i like you..sujaataa
i love you..sujaataa..sujaataa..sujaataa..sujaataa

sujaataa..hahahaa..i love you..sujaataa
nijangaa..u..u..umm..i like you..sujaataa

Friday, April 17, 2015

సంఘం చెక్కిన శిల్పాలు--1979



సంగీతం::రమేశ్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Film Directed By::Vijayanirmala 
తారాగణం::చంద్రమోహన్,గుమ్మడి,సూర్యకాంతం,అంజలీ దేవి,జయమాలిని, అల్లు రామలింగయ్య

పల్లవి::

పలికెను..ఏదో రాగం 
పలికెను..ఏదో రాగం
అలివేణి...కళ్యాణి
అలివేణి..ఓ..కళ్యాణి
నా లలిత..శృంగార 
మందారవనిలోనా

పలికెను..ఏదో రాగం 
పలికెను..ఏదో రాగం  

చరణం::1

నీ నయనాలే కాటుకకు 
నీలిమ నేర్పెనని..ఈ..ఈ 
నీ నయనాలే కాటుకకు నీలిమ నేర్పెనని

నీ నును పెదవి కెంపులకు 
అరుణిమ..సమకూర్చెనని
మలయపవనం తెలుపగా విని
ప్రభవించే నాలో ప్రణయ భావ ధుని

పలికెను..ఏదో రాగం
పలికెను..ఏదో రాగం

చరణం::2

నీ నగుమోమే కుంకుమకు 
నిగ్గులు తీర్చేనని..ఈ..ఈ 
నీ నగుమోమే కుంకుమకు నిగ్గులు తీర్చేనని


నీ పాదాలే పారాణికి నవ రూపం దిద్దేనని
వలచే నా హృది..తెలుపగా విని 
కల్యాణ భావన..కలిగెను విరిబోణి

పలికెను..ఏదో రాగం
పలికెను..ఏదో రాగం
అలివేణి...కళ్యాణి
అలివేణి..ఓ..కళ్యాణి
నా లలిత శృంగార..మందార వనిలోనా

పలికెను...ఏదో రాగం 
పలికెను...ఏదో రాగం 

Sangham Chekkina Silpalu--1979
Music::Ramesh Naiyudu
Lyrics::Arudra
Singer::S.P.Baalu
Film Directed By::Vijayanirmala
Cast::Chandramohan,Gummadi,Sooryakaantam,Anjalidevi,Jayamaalini,Alluraamalingayya.

::::::::::::

palikenu..EdO raagam 
palikenu..EdO raagam
alivENi...kaLyaaNi
alivENi..O..kaLyaaNi
naa lalita..SRngaara 
mandaaravanilOnaa

palikenu..EdO raagam 
palikenu..EdO raagam 

::::1

nee nayanaalE kaaTukaku 
neelima nErpenani..ii..ii 
nee nayanaalE kaaTukaku neelima nErpenani

nee nunu pedavi kempulaku 
aruNima..samakoorchenani
malayapavanam telupagaa vini
prabhavinchE naalO praNaya bhaava dhuni

palikenu..EdO raagam
palikenu..EdO raagam

::::2

nee nagumOmE kunkumaku 
niggulu teerchEnani..ii..ii 
nee nagumOmE kunkumaku niggulu teerchEnani


nee paadaalE paaraaNiki nava roopam diddEnani
valachE naa hRdi..telupagaa vini 
kalyaaNa bhaavana..kaligenu viribONi

palikenu..EdO raagam
palikenu..EdO raagam
alivENi...kaLyaaNi
alivENi..O..kaLyaaNi
naa lalita SRngaara..mandaara vanilOnaa

palikenu...EdO raagam
palikenu...EdO raagam 

Sunday, March 29, 2015

భక్త కన్నప్ప--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4017
సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,వాణిశ్రీ,శ్రీధర్,జయమాలిని,రావు గోపాలరావు,బాలయ్య,ప్రభాకరరెడ్డి

పల్లవి::

కండ గెలిచింది..కన్నె దొరికింది
గుండె పొంగిందిరా..ఆఆ..హోయ్‌
మాత పలికింది మనువు కలిపింది
మనసు గెలిచిందిరా..ఆఆఆ   
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు
తప్పెట్లో తాళాలో..బాజాలో జేజేలో                        
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు

చరణం::1

హ్హ హ్హ హ్హ హహహ హ్హ హ్హ హ్హ హహహ 
ఆ ఆ ఆ ఆ ఉయ్ ఉయ్ ఉయ్
ఆ ఆ ఆ ఆ ఉయ్ ఉయ్ ఉయ్ ఊయ్య్   

ధిమిం ధిమిం..ధిమి భేరీ ధ్వనులు
తెలిపెనురా...నా గెలుపునే..ఏఏఏఏఏ 
ఘలం ఘలల..చిరుగజ్జెల మోతలు
పలికెనురా...నా నా వలపునే..ఏఏఏ
ధిమిం ధిమిం..ధిమి భేరీ ధ్వనులు
తెలిపెనురా...నా గెలుపునే..ఏఏ
ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు
పలికెనురా నా వలపునే..ఏఏ 
అల్లె తాళ్ళ ఠంకారాలే..ఏఏ 
అల్లె తాళ్ళ ఠంకారాలే..ఏఏ 
జయందొరా..అని పడెనులే
నల్లత్రాచు..వాలు జడలే
ఆ పాటకూ..సయ్యడెనులే   
    
హోయ్..కండ గెలిచింది...కన్నె దొరికింది
గుండె పొంగిందిరా..ఓఓఓ..హోయ్‌
మాత పలికింది..మనువు కలిపింది
మనసు...గెలిచిందిరా..ఆఆఅ 
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు 

చరణం::2

నేరేడు చెట్టుకాడ నాఱేడు మాటేసి..ఉయ్ 
రేడు చెట్టుకాడ..నాఱేడు మాటేసి..హా హా   
చారెడేసి కళ్ళతోటి..బారెడేసి బాణమేసి
చారెడేసి కళ్ళతోటి..బారెడేసి బాణమేసి
బాణమేసి నా ప్రాణం..తోడేస్తుంటే..ఏఏఏఏ
బాణమేసి నా ప్రాణం..తోడేస్తుంటే
ఓయమ్మో...ఓలమ్మో ఓయబ్బో 
ఓయమ్మో..నీ ప్రాణం తోడేస్తుంటే

ఎంతా చక్కని కన్నూ..ఊ..ఎంతా చల్లని చూపూ..ఊ
ఎంతా చక్కని కన్నూ..ఎంతా చల్లని చూపూ
ఇంతకన్న...ఇంకేమి కావాలి  
నా బతుకంతా..ఇలా వుండిపోవాలి
  
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు
తప్పెట్లో తాళాలో..బాజాలో..జేజేలో                        
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు

Monday, March 23, 2015

అమెరికా అమ్మాయి--1976

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5512
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,S.జానకి  

పల్లవి:: 

ఓ టెల్ మి..టెల్ మి..టెల్ మి..వాట్
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..అఫ్ కోస్
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్ 

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి..అస్క్ మి బేబీ
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  సర్టె న్లీ స్వీట్ హార్ట్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్

చరణం::1

చాటు చేయ వద్దు నీ అందాలు..వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు
చాటు చేయ వద్దు నీ అందాలు..వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు  
చేయి చేయి కలుపు..నీ హయి ఏమొ తెలుపు
నీ మానసంతా..నా మీదే నిలుపు
కలసి చిందు లేద్దా౦..కవ్వించి నవ్వుకుందా౦
ఈ రేయి మనం..ఒళ్ళు మరచిపోదాం

ఓ టెల్ మి..టెల్ మి..టెల్ మి..ఊహు
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..నో
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్  బేబి..కమాన్

చరణం::2

వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
ఈ సిగ్గు నీకు వాద్దు..అహ లేదు మనకు హద్దు
ప్రతి వలపు జంట..లోకానికి ముద్దు
ఈ వయసు మరల రాదు..ఈ సుఖము తప్పుకాదు
ఈ సరదాలకు సరిసాటే లేదు

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..విత్ ప్లెషర్
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి 
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్

Friday, March 13, 2015

కీలు బొమ్మలు--1965




సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల 
Film Directed By::C.S.Rao 

తారాగణం::జమున,జగ్గయ్య,వాసంతి,గుమ్మడి,చలం,సూర్యకాంతం,రమణారెడ్డి,కన్నాంబ

పల్లవి::

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హహహహా

చరణం::1

చీటికి మాటికి చెలరేగే..నీ నోటికి తాళం వేస్తాడు
చీటికి మాటికి చెలరేగే..నీ నోటికి తాళం వేస్తాడు
వెక్కిరింతు నీ వెటకారాలకు..టక్కున కళ్ళెం వేస్తాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హాహా

చరణం::2

మిడిసిపాటు ఇంకెన్నాళ్ళులే..నీ మెడలు వంచి ముడివేస్తాడు
చెప్పిన మాటలు వినకుంటే..ఏఏ..చెప్పిన మాటలు వినకుంటే
నీ చెవులు పట్టి ఆడిస్తాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హాహా

చరణం::3

సిగ్గులతో తలవంచుకొనే..నీ బుగ్గమీద చిటికేస్తాడు
జరిగే కొలదీ ఎడమైతే..ఏఏ..జరిగే కొలది ఎడమైతే
నీ జడతో భరతం పడతాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు

మొగుడొస్తాడూ..ఊ..హాహాహా

Keelubommalu--1965
Music::S.P.Kodandapani
Lyrics::Arudra
Singer::P.Suseela
Film Directed By::C.S.Rao 
Cast::Jamuna,Jaggayya,Vasanti,Gummadi,Chalam,Sooryakaantam,Ramanareddi,Kannamba.

:::::::::::::::::::

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..hahahahaa

::::1

chiiTiki maaTiki chelarEgE..nee nOTiki taaLam vEstaaDu
chiiTiki maaTiki chelarEgE..nee nOTiki taaLam vEstaaDu
vekkirintu nee veTakaaraalaku..Takkuna kaLLem vEstaaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..haahaa

::::2

miDisipaaTu inkennaaLLulE..nee meDalu vanchi muDivEstaaDu
cheppina maaTalu vinakunTE..EE..cheppina maaTalu vinakunTE
nee chevulu paTTi ADistaaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..haahaa

::::3

siggulatO talavanchukonE..nee buggameeda chiTikEstaaDu
jarigE koladii eDamaitE..EE..jarigE koladi eDamaitE
nee jaDatO bharatam paDataaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu

moguDostaaDuu..uu..haahaahaa

Monday, March 09, 2015

శ్రీరామాంజనేయ యుద్ధం--1975



సంగీతం::K.V..మహాదేవన్  
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,B.వసంత
తారాగణం::N.T.రామారావు,అర్జా జనార్ధనరావు,కాంతారావు,B.సరోజాదేవి,జయంతి,రాజశ్రీ.

పల్లవి::

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

చరణం::1

దధిక్షీరమ్ములకన్నా ఎంతో
మధుర మధుర నామం
సదా శివుడు ఆ రజతాచలమున
సదా జపించే నామం
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రా..మరా..మరామ..రామ
రామ..రామ..రామ..రామ
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రాళ్లు నీళ్లపై చీల్చిన నామం
రక్కసి గుండెల శూల..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

చరణం::2

వేయి జపాల కోటి తపస్సుల
విలువ..ఒక్కనామం..మ్మ్
నిండుగ దండిగ వరములొసంగే
రెండక్షరముల..నామం
ఎక్కడ రాముని భజన జరుగునో
అక్కడ హనుమకు స్థానం
చల్లని నామం మ్రోగే చోట
చెల్లదు..మాయాజాలం
రామ..రామ..రామ..సీతా
రామ..రామ..రామ..రామ 
రామ..రామ..రామ..సీతా
రామ..రామ..రామ..రామ

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్


పల్లవి::
శ్రీయుతమౌ శ్రీరామ పాదం
శ్రీతజన మందారం
పావనమీ రఘురామ పాదం
పాపవినాశకరం
కలుషమ్ముల ప్రక్షాళన చేసే
గంగ చలించిన పాదం
అసురమదమ్మును పాతాళానికి
అణచివేసిన పాదం
రాతిని నాతిని చేసిన పాదం
అడవికి అందం పోసిన పాదం
నీ చరణమ్మే శరణమ్మనగా
ఇచ్చును పెన్నిధానం॥

చరణం::1

అవలీలగ జలధిని దాటిన మేటి
పవనకుమారుడు పట్టే పాదం
బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం
పరబ్రహ్మ పదానికి మూలం
తాను ధరించిన పాదుకలకు
దర పట్టము కట్టిన పాదం
తమ్ముడు భరతుని తరతరాలకు

ధన్యుని చేసిన పాదం..మ్మ్ 

Saturday, February 21, 2015

దాగుడుమూతలు--1964




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల    
Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద.

పల్లవి::

ఎంకొచ్చిందోయి మావా..ఎదురొచ్చిందోయ్ 
ఎదురొచ్చి నీకోసం..ఏదో తెచ్చిందోయ్

ఎంకొచ్చిందోయి మావా..ఎదురొచ్చిందోయ్ 
ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్

చరణం::1

గళ్ళకోక నువ్విస్తే..కట్టుకొన్నదోయ్
నువు కళ్ళతోను కవ్విస్తే..నవ్వుకొన్నదోయ్

గళ్ళకోక నువ్విస్తే..కట్టుకొన్నదోయ్
నువు కళ్ళతోను కవ్విస్తే..నవ్వుకొన్నదోయ్

నవ్వులన్ని నాగమల్లి..పూవులన్నదోయ్
నవ్వులన్ని నాగమల్లి..పూవులన్నదోయ్
ఈ నచ్చినోడికే మనసు..ఇచ్చుకొన్నదోయ్..మావ

ఎంకొచ్చిందోయి మావా..ఎదురొచ్చిందోయ్ 
ఎదురొచ్చి నీకోసం..ఏదో తెచ్చిందోయ్

చరణం::2

మావకూతురనుకొంటు..మనసుపడితివోయ్ 
నీవు మనసుపడ్డ..ఏషమే తానుకట్టేనోయ్

మావకూతురనుకొంటు..మనసుపడితివోయ్ 
నీవు మనసుపడ్డ..ఏషమే తానుకట్టేనోయ్

దోసలితో వలపు నువ్వు..దోచుకొంటివోయ్ 
దోసలితో వలపు నువ్వు..దోచుకొంటివోయ్ 
నీ ఆసికాలు నమ్ముకొని..ఆశపడ్డదోయ్..మావోయ్

ఎంకొచ్చిందోయి మావా..ఎదురొచ్చిందోయ్ 
ఎదురొచ్చి నీకోసం..ఏదో తెచ్చిందోయ్

చరణం::3

తగువులాడినా చాలు..తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ..నగలవంటివోయ్ 

తగువులాడినా చాలు..తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ..నగలవంటివోయ్ 

తాళిబొట్టు మాత్రమే..తక్కువన్నదోయ్
తాళిబొట్టు మాత్రమే..తక్కువన్నదోయ్
నీ తల్లో నాలుకమల్లే..తానుమెలుగునోయ్..మావా

ఎంకొచ్చిందోయి మావా..ఎదురొచ్చిందోయ్ 
ఎదురొచ్చి నీకోసం..ఏదో తెచ్చిందోయ్..మావోయ్

ఎంకొచ్చిందోయి మావా..ఎదురొచ్చిందోయ్ 
ఎదురొచ్చి నీకోసం..ఏదో తెచ్చిందోయ్

Daagudumootalu--1964
Music::K.V.Mahaadevan
Lyrics::Arudra
Singer::P.Suseela    
Film Directed By::Adoorti Subbaa Rao 
Cast::Nandamoori Taaraka RaamaaRao ,Padmanaabham,Gummadi,Alluraamalingayya,Ramanaa Reddi,Raavikondal Rao,Pekaata Sivaraam,Raadhaakumaari,Annapoorna,Naagayya,Sooryakaantam,B,SarOjineedevi,Saarada.

::::::::::::::::::::::::::::::::::::

enkochchindOyi maavaa..edurochchindOy 
edurochchi neekOsam..EdO techchindOy

enkochchindOyi maavaa..edurochchindOy 
edurochchi neekOsam EdO techchindOy

::::1

gaLLakOka nuvvistE..kaTTukonnadOy
nuvu kaLLatOnu kavvistE..navvukonnadOy

gaLLakOka nuvvistE..kaTTukonnadOy
nuvu kaLLatOnu kavvistE..navvukonnadOy

navvulanni naagamalli..poovulannadOy
navvulanni naagamalli..poovulannadOy
ii nachchinODikE manasu..ichchukonnadOy..maava

enkochchindOyi maavaa..edurochchindOy 
edurochchi neekOsam..EdO techchindOy

::::2

maavakooturanukonTu..manasupaDitivOy 
neevu manasupaDDa..EshamE taanukaTTEnOy

maavakooturanukonTu..manasupaDitivOy 
neevu manasupaDDa..EshamE taanukaTTEnOy

dOsalitO valapu nuvvu..dOchukonTivOy 
dOsalitO valapu nuvvu..dOchukonTivOy 
nee Asikaalu nammukoni..ASapaDDadOy..maavOy

enkochchindOyi maavaa..edurochchindOy 
edurochchi neekOsam..EdO techchindOy

::::3

taguvulaaDinaa chaalu..taniviteerunOy
nee vagalamaari maaTalannii..nagalavanTivOy 

taguvulaaDinaa chaalu..taniviteerunOy
nee vagalamaari maaTalannii..nagalavanTivOy 

taaLiboTTu maatramE..takkuvannadOy
taaLiboTTu maatramE..takkuvannadOy
nee tallO naalukamallE..taanumelugunOy..maavaa

enkochchindOyi maavaa..edurochchindOy 
edurochchi neekOsam..EdO techchindOy..maavOy

enkochchindOyi maavaa..edurochchindOy 
edurochchi neekOsam..EdO techchindOy

Monday, January 19, 2015

మాయామశ్చీంద్ర--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=323
సంగీతం::చెళ్ళపిళ్ళసత్య 
రచన::ఆరుద్ర
గానం::P.సుశీ
Film Directed By::Baabubhayi mistri
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,రామకృష్ణ,కాంతారావు,కాంచన,అర్జా జనార్ధన్ రావు,K.V.చలం.

పల్లవి::

మగరాయ..పంతామేలరా
నే మరుబారి..తాళజాలరా 
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా 
మగరాయ..పంతామేలరా
నే మరుబారి..తాళజాలరా

చరణం::1

చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే 
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే 
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా 
మగరాయ పంతామేలరా
నే మరుబారి తాళజాలరా

చరణం::2

నిను చూడగానే నా మేను పొంగే 
నిను చేర అందాల కెమ్మోవి ఊరే 
చెమరించె కన్నూ నన్నేల రారా 
అనురాగాల భోగాల లాలన శాయా 
మగరాయ పంతామేలరా 
నే మరుబారి తాళజాలరా

చరణం::3

మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే  
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే 
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా
మగరాయ పంతామేలరా 
నే మరుబారి తాళజాలరా 
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా 
ఓ మగరాయ పంతామేలరా 
నే మరుబారి తాళజాలరా..ఆఆఆ 

Maayaa MaSchiindra--1975 
Music::Satyam
Lyrics::Arudra
Singer's::P.Suseela
Film Directed By::Baabubhayi mistri
Cast::N.T.Ramarao,Vanisree,Ramakrishna,kaantaraavu,kaanchana,Arjaa Janaardhan Rao,K.V.Chalam.

::::::::::

magaraaya..pantaamElaraa
nE marubaari..taaLajaalaraa 
naa vannelu chinnelu ninnE kOreraa 
magaraaya..pantaamElaraa
nE marubaari..taaLajaalaraa

::::1

chiguraaku baakoo aa valaraaju doosE 
segalaaTi velugu aa nelaraaju kaasE 
eladETi manasoo dulichEnu raaraa
edamadanaagni rEgEnu maaraamulElaa 
magaraaya pantaamElaraa
nE marubaari taaLajaalaraa

::::2

ninu chooDagaane naa mEnu pongE
ninu chEra andaala kemmOvi oorE 
chemarinche kannoo nannEla raaraa 
anuraagaala bhOgaala laalana Saayaa 
magaraaya pantaamElaraa 
nE marubaari taaLajaalaraa

::::3

manakOsamEgaa E podarillu poochE  
aaa podarinTilOnaa viripaanpu vEsE 
valachindi vanitaa alusEla raa
neenagumOmu kanalEni naa batukElaa
magaraaya pantaamElaraa 
nE marubaari taaLajaalaraa 
naa vannela chinnelu ninnE kOreraa 
O magaraaya pantaamElaraa 
nE marubaari taaLajaalaraa..aaaaaa