Sunday, August 19, 2007

మనుషులు మారాలి--1969::చక్రవాకం::రాగం




సంగీతం::K.V.మహదేవన్
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల

చక్రవాకం::రాగం 

చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..

మనసున పెంచిన మమతలు పోయె
మమతలు పంచిన మనిషే పోయె
మనసున పెంచిన మమతలు పోయె
మమతలు పంచిన మనిషే పోయె
మనిషే లేని మౌనంలోన
మనుగడ చీకటి మయమైపోయె
లేరెవరూ..నీకెవరూ..
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..

జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చెరకువు నీవే
జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చెరకువు నీవే
జాలే లేని లోకంలోన
దారే లేని మనిషివి నీవే
లేరెవరూ..నీకెవరూ..
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..

No comments: