Sunday, August 19, 2007

చిట్టి చెల్లెలు--1970






సంగీతం::S.రాజేశ్వరరావు
రచన:D.సినారె
గానం::S.P.బాలు. P.సుశీల

పల్లవి::

ఈ రేయి తీయనిదీ
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిదీ
ఇంతకుమించి ఏమున్నది

ఏవేవో కోరికలు
ఎదలోఝుమ్మని అంటున్నవి
ఆ..కొంటె మల్లికలూ..
అల్లనదాగి వింటున్నవి

చరణం::1


పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియా
అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

!! ఏవేవో కోరికలూ
ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ..కొంటె మల్లికలు
అల్లనదాగి వింటున్నవి
ఆ....ఆ....ఆ....ఆ...ఆ..
ఆ....ఆ....ఆ....ఆ...అహ..హా..హా..!!

చరణం::2


పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నినుచేరుకోగా నునుమేని తీగ
పులకించిపోయేను తొలకరి వలపుల

!! ఈ రేయి తీయనిదీ
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిదీ
ఇంతకుమించి ఏమున్నది !!

చరణం::3


ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో...
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో...
నిను నన్ను కలిపే
నీ నీడ నిలిపే
అనురాజ సీమల అంచులుదొరికే

!! ఈ రేయి తీయనిదీ
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిదీ
ఇంతకుమించి ఏమున్నది
మ్మ్మ్...మ్మ్మ్...మ్మ్మ్...మ్మ్మ్...!!

No comments: