Monday, August 20, 2007

పరమానందయ్య శిష్యుల కథ--1966::ఆభేరి::రాగం



సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,P.సుశీల

:: ఆభేరి రాగం ::


ఓహో...ఓహో..ఓ...ఓ..
నాలోని రాగం నీవే నడయాడు తీగనీవే
పవళించెలోన బంగారు వీణ పిలికించ నీవు రావె

నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే
చిరునవ్వులోన తొలిచూపులోన కరగించివేసి నావె
నెలరాజువైన నీవె

నీ నీడ సోకగానె నీ మేను తాకగానె
ము..అహ..ఆ..ఒహొ..ఆ..ముహు...
నీ నీడ సోకగానె నీ మేను తాకగానె
మరులేవొ వీచె మనసేమొపూచె విరివానలోన కురిసేనె
నెలరాజు..కరగించివేసి నావే..నెలరాజువైన నీవే!!

నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను
ఆ..అహ..ఆ..ఒహొ..ఆ..ముహు..
నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను
కనరాని వింత ఈ పులకరింత నను నిలువనీయదేమోయి
నాలోని..నీవు రావే..నాలోని రాగం నీవే

ఆహా...ఓహొ..మూహు..హు..

No comments: