సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి సుందర రామూర్తి
గానం::SP.బాలు,S.జానకి
Film Directed By::Vamshi
తారాగణం::రాజేంద్ర ప్రసాద్,భానుప్రియ,తులసి,కైకాల సత్యనారాయణ.
రాగం::శుద్ధ ధన్యాసి
:::::::::::
గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా
ముద్దూ కావాలా..ముద్దా కావాలా
ఆ విందా..ఈ విందా..నా ముద్దూ గోవిందా !
!! గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా !!
రాదారంత రాసలీలలు..అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు.. అలు అరు ఇణి
రాధా.. రాధా బాధితుణ్ణిలే..ప్రేమారాధకుణ్ణి లే
హ హ హా జారుపైట లాగనేలరా..
అహ అహఆరుబైట అల్లరేలరా..
అహాముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా
!! గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా !!
వెలిగించాలి నవ్వు మువ్వలూ..అలా అలా
తినిపించాలి మల్లె బువ్వలూ..ఇలా ఇలా ఇలా
రా రా..చూపే లేత శొభనం..మాటే తీపి లాంఛనం
అహా హ హా.. వాలు జళ్ళ ఉచ్చు వేసినా..
ఆహాకౌగిలింత ఖైదు చేసినా..
ఆహాముద్దు మాత్రం ఇచ్చుకుంటే ముద్దాయల్లె ఉండనా
!! గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా
ముద్దూ కావాలీ..ముద్దా కావాలీ
ముద్దూ కావాలీ..ముద్దా కావాలీ
ఆ విందూ..ఈ విందూ..నా ముద్దూ గోవిందా !!
No comments:
Post a Comment