సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P. సుశీల
రాగం:::ఆభేరి
ఓ..చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింతలేని పులకింత
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళు నీ హొయలు చూసాను
నా యదలోనే పదిలంగా దాచాను వేచాను
ఓ.. చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింతలేని పులకింత !!!
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి గిగిరావా
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి గిగిరావా
నీ మనసే పానుపుగా వలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచాను వలచానుఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
No comments:
Post a Comment