సంగీతం::S.రాజేశ్వర్ రావు
రచన::దాశరథి
గానం::P. సుశీల
రాగం::మోహన
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈ నాడే
!! మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే !!
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
!! మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే !!
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెర తాల వెలుగు చెంగలువా నెల రాజు పొందు కొరెను
అందల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను.
!! మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే !!
రాధ లోని అనురాగమంత మాధవునిదేలే
వేను లోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
!! మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే !!
No comments:
Post a Comment