Friday, September 21, 2007

ఆత్మీయులు--1969


సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::దాశరధి
గానం::P.సుశీల

స్వాగతం ఓహో..చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనుల సైగచేస్తే ఆగలేని దొరగారు


కొంగుతగిలిందా పొంగిపోతారూ
కోరి రమ్మంటే బిగిసిపోతారూ
ఎందుకు ఎందుకు ఈ బింకమూ..
అలిగినకొలది అందము అబ్బాయ్గారి కోపము
పిలిచినప్రేయసికి ఇదేన కానుక
మీ కానుకా బెట్టు చాలును దొరగారు
స్వాగతం ఓహో..చిలిపినవ్వుల శ్రీవారు!!

అందమంతా విందుచేస్తే అదిరిపడతారే
పొందుకోరి చెంతచేర బెదిరిపోతారే
సరసమో విరసమో ఈ మౌనమూ..
అందిన చిన్నది చులకనా..
అందనిదెంతో తీయనా..
అవతలపెట్టండి తమాషాఫోజులు..
మహరాజులు..అధిక చక్కని దొరగారు


స్వాగతం ఓహో..చిలిపికనుల శ్రీవారూ
సోగకనుల సైగచేస్తే ఆగలేని దొరగారు

No comments: