Thursday, August 30, 2007

ఆత్మ గౌరవం--1966::రాగం:::అలహేయ బిలావాల్



సంగీతం::సాలూరిరాజేశ్వర రావ్
గానం::P.సుశీల
రచన::దాశరధి 
రాగం:::అలహేయ బిలావాల్
(రాగం:::శంకరాభరణం )


అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

ఇన్నేళ్ళకు విరిసే వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే

!! అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే !!

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మృఒగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే

!! అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే !!

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

!! అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి !!

No comments: