Thursday, August 30, 2007

ఆత్మ గౌరవం--1966



సంగీతం::సాలూరు రాజేశ్వరరావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల

తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం,చలం


మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

పట్నాలలో ఉండు పెదబాబుగారు
పల్లెసీమకు నేడు వేంచేసినారు
కొండంత దేవుణ్ని కొలిచేది ఎలాగో
తెలియక మేమంత తికమక పడ్డాము
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

ముద్దపప్పే కలుపుకోండి
కొత్త ఆవకాయే నంచుకోండి
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ
మచ్చు చూశారంటే మళ్ళీ తెమ్మంటారు
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

బూరెలే వడ్డించ మంటారా నేతిగారెలే వేయించుకుంటారా
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే
వైకుంఠమే వచ్చి వాకిట్లో దిగుతుంది
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

ఉన్నంతలో సేవలొనరించినాము
చిన్నారి మనసులే అర్పించినాము
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి
మీ చూపు నీడలో మేము జీవించాలి
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

No comments: