Thursday, August 30, 2007

ఆత్మ గౌరవం--1966



సంగీతం::సాలూరు రాజేశ్వరరావ్
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం,చలం


::::

వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే
మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే


:::1

బరువు కనుల నను చూడకు మరులు కొలిపె మది రేపకు
బరువు కనుల నను చూడకుమరులు కొలిపె మది రేపకు
చెలి తలపె తెలిపెనులే సిగలోని లేమల్లెలు
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే!!

::::2


ఉరిమిన జడిసె నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
ఉరిమిన జడిసె నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
నీ హృదయములో ఒదిగినచో బెదురింక ఏమున్నది
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే!!
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుసగుసలు
పెదవులపై మధురిమలే చిలికించమన్నాయిలే
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే
మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే!!

No comments: