Tuesday, August 21, 2007
ఘర్షణ--1998
సంగీతం::ఇళయరాజ
గానం::వాణీజయరాం
దర్శకత్వం::మణిరత్నం
నటీ నటులు::ప్రభు,కార్తీక్,అమల,నిరోష.
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే
ఊసులాడు నాకళ్ళు,నీకు నేడు సంకెళ్ళు
పాలపొంగు చెక్కిళ్ళు,వేసె పూలపందిళ్ళు
లవ్ లవ్ ఈ కథ,ఒహో మన్మధ
మైకం సాగనీ,దాహం తీరని
మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయెనే
నేడు పువ్వాయెనే,తోడుకల్లాడెనే
సందేళ వయసెందుకో చిందులేస్తున్నది
అందాల సొగసేమితో అందుకోమన్నది
క్షణంక్షణం ఇలాగే,వరాలు కోరుతున్నది చిన్నది
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే
ముద్దుమురిపాలలో సద్దులే చేసుకో
వేడి పరువాలలో పండగే చేసుకో
నా చూపులో ఉన్నవి కొత్త కవ్వింతలు
నా నవ్వులో ఉన్నవి కోటి కేరింతలు
ఇవే ఇవే ఇవేళ సుఖాలపూల వేడుక..వేడుక
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే
ఊసులాడు నాకళ్ళు,నీకు నేడు సంకెళ్ళు
పాలపొంగు చెక్కిళ్ళు,వేసె పూలపందిళ్ళు
లవ్ లవ్ ఈ కథ,ఒహో మన్మధ
Labels:
ఘర్షణ--1988
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment