Tuesday, August 21, 2007
ఘర్షణ--1988~~రాగం:::మోహన:::
సంగీతం::ఇళయరాజ
గానం::చిత్ర
దర్శకత్వం::మణిరత్నం
నటీ నటులు::ప్రభు,కార్తీక్,అమల,నిరోష.
రాగం:::మోహన:::
నిన్నుకోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
వురికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
!! నిన్ను కోరి !!
వుడికించే చిలకమ్మ నిన్నూరించే
వొలికించే అందాలే ఆలాపంచే
ముత్యాలా బంధాలే నీకందించే
అచట్లు ముచట్లు తానాలకించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కల్లలే విందు చేసనే నీతో పొందు కోరనే
వుండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
!! నిన్ను కోరి !!
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపూ నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వాగతం పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం కానీరాగ సంగమం
నీ జ్ఞపకం నా లోనే సాగేనులే ఇవేళ సరసకు
!! నిన్ను కోరి !!
Labels:
ఘర్షణ--1988
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment