Tuesday, August 21, 2007

ఘర్షణ--1988::రాగం:అమౄత వర్షిణి



గానం::వాణిజయరం
సంగీతం::ఇళయరాజ
రాగం::అమౄత వర్షిణి
కర్నాటక హిందుస్తాని


కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శౄంగార మునకీవె శ్రీకారమే కావె

ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం ఆ..

కన్నుల కదలాడు ఆశలు శౄతి పాడు
వన్నెల మురిపాల కధ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం ఆ..

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శౄంగార మునకీవె శ్రీకారమే కావె

No comments: