Wednesday, August 22, 2007

తోడి కోడళ్ళు--1957

సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
డైరెక్టర్:: అదూర్తి సుబ్బారావ్

రాగం::

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చనో చెప్పగలవా?

నిన్ను మించిన కన్నెలెందరో మందుటెఒడలో మాడిపొతే,
వారి బుగ్గల నిగ్గు నీకూ వచ్చి చేరెను, తెలుసుకో..
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడ కట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?

కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ, ఘనులూ తొలచీ,
చెమట చలువను చేర్చి రాళ్ళను, తీర్చినారూ, తెలుసుకో..

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయె చీర కట్టిన చిన్నదాన
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?

చిరుగు పాతల, బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ..
చాకిరొకరిదీ ,సౌఖ్యమొకరిదీ సాగదింకా, తెలుసుకో...

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

No comments: