Thursday, July 26, 2007
తేనె మనసులు--1965 (old)
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
చందమామా..ఆ..
అందాలమామా..ఆ..
నీ ఎదుట నేను
వారెదుట నీవు..
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు
నీ ఎదుట నేను
వారెదుట నీవు
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను
తలదాచుకొనుట కది చాలన్నాను
నీ ఎదుట నేను..వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు!!
పెళ్ళి చూపులలో బిగుసుకొని
పేరేమి?..చదువేమి
నను ప్రేమిస్తావా? వయసెంత
పెళ్ళి చూపులలో బిగుసుకొని
పేరేమి?...నీ చదువేమి
నను ప్రేమిస్తావా? వయసెంత
అని అడిగారా?..ఆ..అసలొచ్చారా?
నాలో వారు ఏం చూశారో
నా వారయ్యారు...
నాలో వారు ఏం చూశారో నా వారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంట
నీ ఎదుట నేను..వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు!!
చల్లని వెన్నెల దొరవంటారు
తియ్యని నవ్వుల సిరివంటారు
చల్లని వెన్నెల దొరవంటారు
తియ్యని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలో వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
అనుభవించి అనమంటాను
వయసుకు వైరవి నీవంటాను
నీ ఎదుట నేను..వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు
చందమామా..ఆ..అందాలమామ..ఆ..
Labels:
Hero::Krishna,
P.Suseela,
తేనె మనసులు--1965
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment